టాయిలెట్
టాయిలెట్


సిగ్గు లేదూ.కథ వ్రాయమంటే టాయిలెట్ గురించి వ్రాస్తావా.
అంతగా నీకు పత్రికలో పోటీకి కథ పంపాలంటే ఏ దేవుడి గురించో,రాజుల గురించో, చెట్టూ పుట్టా గురించో వ్రాయాలి గానీ విచిత్రంగా టాయిలెట్ గురించి వ్రాయడం ఏమిటి? అని నీల ఒకటే క్లాసు.
సీత మాత్రం నింపాదిగా కూర్చుంది. నీల సీత కంటే వయసులో పెద్దది.
సీత ఈ మధ్య ఒక పత్రికలో కథల పోటీకి ఒక కథ రాసి పంపింది.
కథ తాలూకు ప్రతిని చదవమని చెప్పి నీలకు ఇచ్చింది.
మంజు అనే ఒక నటి నేషనల్ హైవే మీద వెళుతూ రోడ్డు మీద చాలా వరకు ఎక్కడా టాయిలెట్ లేక చాలా ఇబ్బంది పడుతుంది.
ఒక దాబా దగ్గర టాయిలెట్ ఉన్నా ఆమె
ఉపయోగించుకోలేని పరిస్థితి.తరువాత తను ఈ విషయం ఓ పత్రిక ఇంటర్వ్యూలో చె
ప్పినప్పుడు ఒక
ఔత్సాహిక దర్శకుడు ఆమె చెప్పిన దాన్నే ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం.అది చాలా సక్సెస్ అయ్యి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరుగుతుంది.
ప్రభుత్వం ఆ నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన అతి తక్కువ ఖర్చుతో
అందరూ ఉపయోగించుకునేలా టాయిలెట్స్ కట్టిస్తుంది.
ఇదీ సీత వ్రాసిన కథ.
కథ మొత్తం చదివాక నీల సీతను అభిమానంగా చూసింది.
సీతా! నీకు బహుమతి వచ్చినా రాకపోయినా నువ్వు ఈ కథ ఎందుకు వ్రాశావో అర్థం అయ్యింది అని చెప్పింది.
వాళ్ళకు స్కూల్లో చదువుకునేటప్పుడు టాయిలెట్ సౌకర్యం లేక అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడే వాళ్లో గుర్తుకు వచ్చింది.
సీత తనలో తనే నవ్వుకుంది.