సంకటి చింతాకు పప్పు
సంకటి చింతాకు పప్పు


మామూలుగానే నాకు సంకటి అంటే భలే ఇష్టం.ఓ రోజు అక్కా వాళ్ళు అందరూ ఇంటికి వచ్చారు.తినడానికి సంకటి చేద్దామని అనగానే నాకు చెవుల్లో తేనె పోసినట్లయ్యింది.
అప్పుడే తెపిన చింత చిగురు వేసి పప్పు రుద్దారు.
అందరం తినడానికి కూర్చున్నాం.సంకటి ముద్దలో చేత్తో పప్పు వేసుకోవడానికి గుంత చేసుకున్నాం,
ముందు కాలంలో పెద్ద ఆకు తెంపుకొని దానిని అరా చేతిలో పెట్టుకొని దాని మీద సంకటి పెట్టుకునేవాళ్లట.
పనికి వచ్చిన వాళ్ళందరికీ కంచాలు ఉండవుగా.
ఆ సంకటి ముద్దలో గుంత చేసుకొని అందులో చారో,పప్పో వేసుకునే వాళ్లట.
సంకటి బాగుంటే ఇలాంటి సంకటి ఉంటే చాలు అని పని చేసుకునేవాళ్ళు.
మేము అలాగే చింతాకు పప్పు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం.
అప్పటి నుంచి ఎప్పుడు సంకటి చూసినా చింతాకు పప్పు పాత కాలంలో పని వాళ్ళ కథలు గుర్తుకు వస్తాయి.