Rama Seshu Nandagiri

Drama

4.5  

Rama Seshu Nandagiri

Drama

స్నేహితురాలికి లేఖ

స్నేహితురాలికి లేఖ

2 mins
679


ప్రియ నెచ్చెలి, 


   ‌.      ఎలా ఉన్నావ్? ఎక్కడ ఉన్నావ్? నువ్వు తలపుకు రాగానే గుర్తు వచ్చే పాట ఏంటో తెలుసా! 'ఎందున్నావో ఓ‌ చెలీ...' ఆ( ఆ( అక్కడితో ఆగు. ఆ తర్వాత లైన్ల కి వెళ్ళకు. అవి మనకు వర్తించవు. ఇంతకీ, రెండు సంవత్సరాల నుండి నీ మాట

వినబడటం లేదు. ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. ఏమైపోయావు?


          మన బంధం ఈ నాటిదా? 43 సంవత్సరాల వయసు మన బంధానిది. 1976 లో మొదటిసారి ఎ.వి.ఎన్.కాలేజీ, ఫస్టియర్ డిగ్రీ క్లాస్ లో ఏ‌ ముహూర్తాన కలిసేమో కానీ అది ఫెవికాల్ బంధం లాగా చాలా బాగా గట్టి పడింది. మనం ముఖ్యంగా ఏడుగురు స్నేహితులమైనా మన ఇద్దరి బంధం మరింత పటిష్టమైనది.

          

           చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా మనం దాదాపుగా రోజూ కలిసే వాళ్ళం. నీ పెళ్ళి

అయ్యాక నీతో పాటు సోదరి స్థానం లో మీ అత్తారింటికి నీకు

తోడుగా రావడం, మీ అత్తింటి వారి తో కూడా మంచి స్నేహాన్ని పెంచుకోవడం మరువగలమా!


           ఆ ఇంటికి కూడా ఏదైనా కారణాల వలన కొంచెం వ్యవధి ఇచ్చి వస్తే మీ అత్తయ్య, మామయ్య ' ఏమ్మా స్నేహితురాలితో పాటు మేమూ ఎదురు చూస్తాం కదా! ఇలా రావడం ఆలస్యం చేస్తే ఎలాగమ్మా!' అంటూ ప్రేమగా పలికిన మాటలు మర్చిపోలేక పోతున్నా. 


             నా పెళ్ళి కూడా అయ్యాక ఉద్యోగాల రంథిలో పడి, సంసార సాగరం లో కూరుకు పోయి అప్పుడప్పుడు ఫోన్ లోనే పలకరించుకుంటూ చాలా ఏళ్ళు గడిపేశాం. ఇన్ని సంవత్సరాల వ్యవధిలో మంచి, చెడు అన్ని అనుభవిస్తూ పిల్లల్ని కూడా పెంచి ప్రయోజకులను చేశాం.


             అనుకోకుండా మా పెద్దమ్మాయి తో మా కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడ్డ తర్వాత నీ కొడుకు కోడలు, అమ్మ తో కలిసి మా ఇంటికి వచ్చి కలవడం ఎంత ఆనందాన్ని కలిగించిఃదో కదా మనకి!


  ‌‌.           తర్వాత కూడా మూడేళ్ల పాటు బాగానే క్రమంగా ఫోన్ ద్వారా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉండే వాళ్ళం. మాట్లాడుకున్నప్పుడల్లా ఎంత సమయం గడిచినా 'అప్పుడే ఫోన్ పెట్టేయాలా' అని బాధపడిన సందర్భాలే ఎక్కువ కదా. కానీ 'ఏం చేస్తాం, మన ఇంటి పనులు మనమే చేసుకోవాలి తప్పదు.' అనుకుంటూ 'మళ్ళీ మాట్లాడుకుందాం' అంటూ ఫోన్ పెట్టేసే వాళ్ళం కదా! 


             ఈ విషయాలన్నీ తల్చుకుంటుంటే నీతో మాట్లాడి రెండేళ్ళు గడిచాయన్న బాధ రెట్టింపు అవుతోంది. నీ

గురించి తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు కూడా వృధా అవుతున్నాయి. నీ నెంబర్ కి మెసేజ్ పెడితే చూసినా

జవాబు రాదు. ఫోన్ చేస్తే రింగవుతున్నా ఫోన్ తీయరు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. 


            నీ గురించి ఆలోచించి, బాధపడి, కన్నీరు కార్చినా నీ గురించిన జాడ చెప్పే వారే లేరా!

            

            నీ కోసం, నీ పిలుపు కోసం, నీ మాట వినడం కోసం ఎదురు చూసే నీ స్నేహితురాలిని మర్చిపోయావా! నమ్మను. బ్రతికుండగా మనిద్దరికీ సాధ్యం కాని విషయం అది.


            ఇప్పటికైనా నా మీద దయ తలచి, జాలిపడి అయినా నీ జాడ తెలుపవా నా నేస్తమా!  


  ‌‌.                         నీ కోసం జీవితాంతం

                              ఎదురుచూసే

                                 నీ చెలి

             

                              

     Rate this content
Log in

Similar telugu story from Drama