Rama Seshu Nandagiri

Drama

3.6  

Rama Seshu Nandagiri

Drama

స్నేహ బంధం. (కళాశాల లో)

స్నేహ బంధం. (కళాశాల లో)

2 mins
609


కాలేజీ ఆవరణలో అడుగు పెట్టిన సౌమ్య స్నేహితుల కోసం కళ్ళ తోనే వెదికింది. పది అడుగుల దూరంలో చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వారి వైపు దారి తీసింది. వాళ్ళు చూడనే చూసారు.

"వచ్చావా తల్లీ రా! ఏమైంది ఈ 3 రోజులు ఎగ్గొట్టావ్‌!" రమ విరుచుకు పడింది.

" ఏదో పని ఉండి రాలేదు. నువ్వెందుకు అంత అరుస్తున్నావు" అంది సౌమ్య.

"అది అరిచింది, కాని ఇప్పుడు సిరి వస్తే నిన్ను కొట్టడానికి రెడీగా ఉంది." అంది లత.

" ఏం, ఏమైంది, నేనేం చేసాను" అంది సౌమ్య ఆశ్చర్యంగా.

" అనేది అనేస్తావ్. మర్నాడు కనపడవ్. నీ ఫ్రెండ్స్ అని మమ్మల్ని పట్టు కుంటారు." రాథ కినుక.

"ఏమైందంటే ఒక్కళ్ళు చెప్పరు. చెప్పి చావండే."

ఒక్క అరుపు అరిచింది సౌమ్య.

"అరిచావులే కాని, ఆరోజు పద్మనిఏమన్నావ్."

"నేనేమన్నాను" భృకుటి ముడి వేసి అడిగింది సౌమ్య.

"ఏమన్నావా! క్లాస్ రిప్రజెంటేటివ్ గా పద్మ సెలెక్ట్ అయిందని మేడం అనౌన్స్ చేసినప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడయ్యాయి, అని అది వినేటట్టు కామెంట్ చేసావు. దానికే అది చాలా ఫీలయ్యి సిరి తో గొడవ పడిందట." అంది లత.

"అంతే కాదు, క్లాస్ రిప్రజెంటేటివ్ అయితే చాలదు

అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని

అన్నావు కదా డైరెక్ట్ గా తనని. ఆమాటలకే కోపం వచ్చి సిరి ని చాలా మాటలందిట." రమ కంటిన్యూ చేసింది.

"నేనంటే నాతో గొడవ పడాలి, కాని సిరి తో ఎందుకు!" ఆశ్చర్యంగా అడిగింది సౌమ్య.

"అదేమిటి, వాళ్ళు కజిన్స్ అని నీకు తెలియదా" అంది రాధ

"కజిన్స్ అయితే మాత్రం, నేనేమైనా అంటే నన్నడగాలి, కాని వాళ్ళు గొడవ పడటమేంటి"

చిరాకు గా అంది సౌమ్య.

ఇంతలో సిరి రానే వచ్చింది. సౌమ్య ని చూడగానే హాయ్ అంటూ నవ్వుతూ పలకరించింది.

అది చూసిన మిగిలిన స్నేహితుల కి ఒళ్ళు మండింది.

" ఏమే, సౌమ్య కనిపిస్తే దాని పని పడతానన్న దానివి, ఏమిటి ఆ పలకరింపు?" రమ‌అంది కోపంగా.

సౌమ్య నవ్వుతూ చూస్తోంది.

"పోవే, ఆరోజు పద్మ నాతో గొడవ పడిందన్న కోపంతో అన్నాను కాని దీనితో నేనెందుకు గొడవ పెట్టుకుంటాను. అయినా మీ కన్నా నాకు పద్మ ఎక్కువ కాదుగా." అంది చిరునవ్వుతో.

సౌమ్య ఆనందంగా చప్పట్లు కొట్టింది.

మిగిలిన వాళ్ళు కోపంగా చూసారు.

"నీ కోసం మేము దానితో గొడవ పెట్టుకుని చెడ్డ అయ్యాం. నువ్వు దానిని సపోర్ట్ చేసి మంచి అయిపోతావా" రమ బిక్క మొహం పెట్టింది.

సౌమ్య, సిరి పకపకా నవ్వేశారు.

" అదేం లేదే, పద్మ కూడా సౌమ్య అన్న మాట లో నిజాన్ని గ్రహించి నాకు సారీ చెప్పింది . అంతేకాక

సౌమ్య కి సలహా ఇచ్చి నందుకు థేంక్స్ కూడా చెప్పమంది." నవ్వుతూ చెప్పింది సిరి.

"మరొక విషయం ఏమిటంటే నాకు ఈ విషయాలన్నీ సిరి ముందే చెప్పింది." అంటూ సౌమ్య గట్టిగా నవ్వింది.

"ఇద్దరూ కలిసి మమ్మల్ని ఫూల్స్ చేస్తారా" అని అందరూ కలిసి కొట్టబోయారు. వాళ్ళ నవ్వులతో ఆ ప్రాంతం మార్మ్రోగింది.



Rate this content
Log in

Similar telugu story from Drama