శృతి తప్పని రాగం
శృతి తప్పని రాగం


మీ మొదటి నవల శృతి తప్పని రాగం చాలా విజయవంతమైంది కదా.ఆ నవలకు ఇన్స్పిరేషన్ ఏమిటో మీరు మా ఆడియెన్స్ కి కాస్త చెప్తారా?
ఓ ప్రముఖ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రచయిత్రి శృతి నవ్వుతూ ఇలా చెప్పింది.
అది నా రోజుల్లో జరిగిన ప్రేమ కథ.రాగ్ అనే అబ్బాయి నేను ప్రేమించుకున్నాం.
నేను మా ప్రేమ కథను నవలగా వ్రాసేటప్పుడు రాగ్ ని అడిగాను.పేరు మార్చాలా అని.తాను తన పేరుతోనే వ్రాయమన్నాడు.
అందుకే మా ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా నా మొదటి నవలకు శృతి తప్పని రాగం అని పేరు పెట్టాను.
జర్నలిస్టు మరికొన్ని ప్రశ్నలు అడిగి శృతి చెప్పిన సమాధానాలు రికార్డు చేసుకొని వెళ్ళింది.
ong> వెళుతూ వెళుతూ నవల మీద రచయిత్రి దగ్గర ఆటో గ్రాఫ్ ని ఎంతో అభిమానంగా తీసుకుంది. కాసేపటి తరువాత శృతికి ఫోన్ వచ్చింది. హలో! ఆ. అంతా మీరు చెప్పినట్లే చెప్పాను పబ్లిషర్ గారూ! అని చెప్పింది శృతి. మంచి పని చేశావ్.నిజ జీవిత కథ అంటే పాఠకులు మరింత ఆసక్తి చూపిస్తారు.నువ్వు అదే నవలను సిరీస్ గా కూడా వ్రాయి.అటు వైపు నుంచి పబ్లిషర్ సూచన. శృతి ముభావంగా సరేనంది. తన వ్యక్తిగత జీవితంలో రాగ్ అని ఎవ్వరూ లేరని తను ఇంక చెప్పలేదు. శృతి తన మొదటి నవలకు పార్ట్-2 వ్రాయడానికి సిద్ధమైంది.