Raj Kumar

Comedy

5.0  

Raj Kumar

Comedy

ప్యార్ ''ఖ/కరోనా"

ప్యార్ ''ఖ/కరోనా"

4 mins
511


కరోనా వైరస్ రావడానికి వారం ముందు నాకు(జీవన్) ప్రమోషన్ వచ్చింది,అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళి ఫారిన్ క్లయింట్ ని కలిసి రావాలని మా మేనేజర్ (ఆనంద్) చెప్పాడు. ఈ డీల్ ఒకే అయితే మన కంపెనీ కి చైనా క్లయింట్ వాళ్ళు ''మెడికల్ క్లెయిమ్ " ప్రాజెక్టు ఇస్తారని చెప్పారు.అదేంటో

ఆ వారం అదృష్టం కలిసి వచ్చింది. ''పెళ్లి -ప్రమోషన్" ఒక్కసారిగా నా బ్రౌసింగ్ విండో లో మెయిల్ రూపం లో ఒక అందమైన ఫిమేల్ ప్రొఫైల్ పిక్ (రాగ) వచ్చాయి. మూడు నెలలు రీఛార్జి చేయిస్తే కానీ ''మ్యారేజి బ్యూరో" వాడికి నా మీద నమ్మకం కలగ లేధు.వెంటనే షాక్ ఎందుకంటే తనని కలుసుకోవాలి అనుకునే రోజు నేను క్లయింట్ తో మీటింగ్ ''ఒకే రోజు".

ఇప్పుడు ఎలా అని ఆలోచించి మళ్ళీ బ్యూరో అతనికి రీఛార్జి చేయించి అమ్మాయి పర్సనల్ నెంబర్ తీసుకొని తనకి నా ఆఫీసు టైమింగ్ అయిపోయాక కాల్ చేశాను. మొదటి సారి తన(రాగ) మాటలు వింటుంటే నా గుండెల్లో ఏదో తెలియని భయం-సంతోషం-ఒక నర్వస్ నెస్ , ఎందుకంటే ఈ-కాలం లో ''అబ్బాయిలకి సరైయన టైమ్ లో పెళ్లిళ్లు జరక్క వచ్చిన ఒక డిజార్డర్ లో నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను అని చెప్పాడు మా ఫ్యామిలి డాక్టర్ (మోహన్ ).ఎలాగో అలాగా తనో తో మాట్లాడి నా ప్రమోషన్ గురించి, బెంగళూరు ట్రిప్ గురించి చెప్పి తరువాత కలుద్దాం అని చెప్పాను. తను ఒప్పుకుంధి. కానీ ఒక కండిషన్ అని చెప్పింధి, మా వూరు లో , మా ఇంటి దగ్గర వున్న ఒక ప్లేస్ లో కలుద్దాం అని చెప్పింది ఎందుకంటే ఇప్పటివరకు తను ఏ పని మొదలు పెట్టిన అక్కడి నుండే అని చెప్పింధి. తనకు బాగా కలిసి వచ్చిన ప్లేస్ అని బలంగా నమ్ముతుంది.ఇప్పుడు తను అక్కడే వుండి తన డిస్టెన్స్ ఎంబీఏ కి ప్రిపేర్ అవుతున్న అని చెప్పింది.


వారము రోజులు బెంగళూరులో చైనా క్లయింట్ తో వున్నా, నా ఆలోచనలు అన్నీ రాగ చుట్టూ తిరుగుతున్నాయి. ఆఫీసు మీటింగ్ లు లేట్ నైట్ అయినా తనకి కాల్ చేసి మీటింగ్ లో జరిగిన విషయాలు అన్నీ చెప్పాను.చాలా సంతోషంగా ప్రాజెక్టు వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చాను. రాగానే రాగ కి కాల్ చేసి తనికి కలిసి వచ్చిన ప్లేస్ లో నే కలుద్ధామని చెప్పాను.

తనని కలుసుకునే రోజు, నేను తనని చాలా గాఢంగా ప్రేమించిన విషయం తెలియచేయాలని ఒక గిఫ్ట్ షాప్ కి వెళ్ళి తనకి రింగ్ కొని బయలు దేరి తను చెప్పిన ప్లేస్ కి వెళ్ళాను. అది ఒక మారు మూల పల్లెటూరు,అందమైన చెట్లు,దగ్గరి లో ''అమ్మ వారి" గుడి. రాగ అందముగా రెడీ అయి తన తో పాటు గా తన తమ్ముడు (గోవింద్) ని తీసుకొని వచ్చింది.రాగ ని చూడగానే నా మనస్సులో లవ్ ఫీలింగ్ ఇంకా పెరిగి పోయింది.కానీ గోవింద్ చాలా వింతగా వున్నాడు.చేతి లో ఎప్పుడు మొబైల్ చూస్తూ మధ్య మధ్య లో మాత్రమే చుట్టూ చూస్తున్నాడు. వాడు పుబ్ జి ఆడుతున్నాడు అనుకున్నా, నేను రాగ ని ప్రేమించిన విషయం చెప్పాలని ,అది గోవింద్ కి అర్ధం కాకూడదు అని రాగ తో ''ప్లీజ్ ముజే ప్యార్ కరోనా " అని రాగ ముందు నిలబడి తన చేతిని తీసుకొని రింగ్ పెట్టాను.అంతే తర్వాత ఏం జరిగిందో గుర్తు లేధు. లేచి చూసే సరికి చుట్టూ డాక్టర్ లు, రాగ ఒక వైపు ఏడుస్తూ,మరొక వైపు ఊళ్ళో జనాలు,లోకల్ మీడియా లో నా పేరు, లేవడానికి కూడా ఓపిక లేకుండా కొట్టేశారు ఆ ఊరి మనుషులు.


అసలు ఏం జరుగుతుంది,నాకు ఏమైంది అని అడగాలని ఎవ్వరిని చూసిన కనిపించ లేదు.చివరిగా అప్పుడే అటు వైపు ముసుగు వేసుకొని వస్తున్న ఒక పెద్ద వయస్సు నర్స్ ని పిలిచి అడిగా ఎందుకు నన్ను ఇక్కడ వుంచారు అని ? దానికి తను చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను ''బాబు నీకు కరోనా " జబ్బు వచ్చింది, నిన్ను అబ్జర్ వేషన్ లో పెట్టం, నీతో ఎవ్వరూ మాట్లాడరు అనగానే హీరో షాక్.

అప్పుడే వచ్చిన లోకల్ మీడియా ముందు గోవింద్ తన స్టయిల్లో మా బావ గారి కి కరోనా వచ్చింది అని తనే మొదటి సారి నేనే తెలుసు కున్న అని చెప్పడం. ఆ మీడియా వాడు నా దగ్గరికి మాస్క్ వేసుకొని వచ్చి గుచ్చి గుచ్చి నా గురించి అడిగితే, నా కంపెనీ పేరు, నేను రీసెంట్ గా పని చేసి వచ్చిన ప్రాజెక్టు చైనా వాళ్ళతో అని తెలిసి ''రాత్రికి రాత్రి " ఆ ఊరి నుండి దేశం మొత్తం తెలిసేలా చేశారు. వారం రోజులు రకరకాలైన మెడికల్ పరీక్షలు ''ఫెయిల్" అయ్యి ,చివరిగా రాగ ని పెళ్లి చేసుకొని మొదటి రాత్రి కి ఏర్పాట్లు చేశారు మా ఫ్యామిలి వాళ్ళు.


ఆ రాత్రి రాగ తో అడిగిన మొదటి ప్రశ్న ''ప్యార్ కరోనా " అని చెప్పితే మీ తమ్ముడు ఎందుకు అంతా గొడవ చేసి స్పృహ కోల్పోయే లా కొట్టారు ఎందుకు అనగానే, రాగ నవ్వింది, నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను.అప్పుడు తను నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకొని ''మీరు మా తమ్ముడిని (గోవింద్)ని ఏం చేయను అంటే చెప్తా" అంది. ధానికి నేను ఒకే అని ప్రామిస్ చేశాను. రాగ అప్పుడు చెప్పింది గోవింద్ గత రెండు సార్లు ''హింది పరీక్షలో" ఫెయిల్ అవుతూ వున్నడాని , ఆ రోజు నువ్వు చెప్పింది వాడికి అర్ధం కాలేధు, వాడికి అర్ధమైంది ఒక్కటే ''కరోనా " అంటే ''రోగం" అని,ఆ రోజంతా వాడు మొబైల్ లో మీడియా లో వస్తున్న ''ఇండియా లో కి కరోనా " వచ్చింది అని .

పాపం గోవింద్ పసి వాడు ,వాడికి ఏం తెలుసు మీరు కలుసుకునే రోజే ''కరోనా" వచ్చిన రోజు ఒక్కటే అని, మీరు అంటే ఎంత అభిమానమో- మీరు ఎక్కడ చనిపోతారో అని చాలా బాధ పడ్డాడు.


ఆనంద్ కి గోవింద్ మీడియా ముందు చేసిన ''నవరస ఆక్టింగ్ " గుర్తుకు వచ్చింది, వెంటనే ''గోవింద్ " అని అరవగానే ఎదురుగా ''గోవింద్" తల దించుకొని నిల్చున్నాడు. రాగ, తన ఫ్యామిలి అందరూ షాక్ గా చూస్తున్నారు. గోవింద్ దగ్గరికి వచ్చి ఆనంద్ ''నాకు తెలిసిన మంచి హింది మాస్టర్ వున్నారు, నువ్వు అర్జెంట్ గా హింది పరీక్షలో పాస్ కావాలి, దానికి ఎంతైనా నేను ఖర్చు పెడుతా" అని ప్రామిస్ చేయడం. గోవింద్ చేయి తుడుచుకొని ఆనంద్ ని హగ్ చేసుకొని ''మా బావ బంగారము" అని అనడం తో అందరూ హ్యాపీ.

రాగ వైపు చూసి ఆనంద్ ''అభి తో కుచ్ కరోనా" అనగానే లైట్ ఆఫ్ అవుతుంది.



Rate this content
Log in

Similar telugu story from Comedy