ప్రేమ లేఖ
ప్రేమ లేఖ
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఇదే నేను నీకు రాస్తున్న మొదటి ప్రేమ లేఖ, బహుశా చివరి లేఖ కూడా కావచ్చు.
నీకు గుర్తుందా మన పరిచయం నా ఏడుపుతో మొదలయ్యింది. నేను ఆరోజు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వావు. కానీ ఆ వెంటనే నన్ను అక్కున చేర్చుకున్నావు.
అప్పటి నుంచి నా కళ్ళలో నీకు రాకుండా చూసుకున్నావు..
నేను ఏడిస్తే నువ్వు బాధ పడ్డావు..
ఏ కష్టాన్ని నా దగ్గరకి రాకుండా చూసుకున్నావు..
నాకు తోడుగా నీడగా ఉన్నావు..
నా ప్రతి పనిలో అండగా ఉన్నావు..
నాకు ధైర్యాన్ని ఇచ్చావు..
ఇలా ఆనందంగా మన సాగిపోతోంది మన ప్రేమ, జీవితాంతం నాకు ఈ ప్రేమ చాలు అనుకునెంతలో..
ఒక వ్యక
్తి నా జీవితంలోకి వచ్చారు
కాదు కాదు నువ్వే తీసుకు వచ్చావు
నాకు ఇంకొక ప్రేమని పరిచయం చేద్దాం అనుకున్నావు
మన ప్రేమ మధ్యలో ఎవరు రాలేరు అని నీకు తెలియదా?
నీ మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తరగనిది అని నీకు తెలియదా?
ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అమ్మా.
అవును ఈ ప్రేమ లేఖ నేను రాసింది నీకే అమ్మా..
నీకన్న నన్ను ఎవరూ ప్రేమించలేరు అమ్మా
నీ అంత ప్రేమని ఎవరూ పంచలేరు అమ్మా
నీకు నేను భారం అయిపోయా నా అమ్మా
నన్ను వేరే చోటకి పంపించేయాలి అనుకున్నావు
కానీ...
నీ మీద నా ప్రేమ నిరంతరం కొన సాగుతూనే ఉంటుంది.
ఇట్లు:
నీ కూతురు