పలకా బలపం
పలకా బలపం


నేను మొదటిసారి పాఠశాలలో అడుగుపెట్టిన జ్ఞాపకం బహు చిత్రం.
తలకు బాగా చమురు(నూనె) పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని మా అమ్మమ్మ తల మొత్తం కొబ్బరి నూనెతో తడిపేసింది.
చేతిలో పలక.నిక్కరు జేబులో బలపం.మొహం మీద పౌడరు.తల మీద నుంచి కారుతున్న నూనె ఆ పౌడరుతో కలిసి చేసిన ముద్రలు.
రేయ్ అరవకండి అని ఓ మనిషి బెత్తం పట్టుకొని పిల్లలందరినీ హెచ్చరిస్తున్నాడు.
ఆయన నన్ను కూర్చో అని తరగతిలో కూర్చూబెట్టాడు.తెలుగు చెబుతారంట.లెక్కలు కూడా అంట.
మా నాన్న చెప్పాడు.బుద్ధిగా చదువుకోవాలని.కానీ మాష్టారు చేతిలోని బెత్తం చూసి అనుకున్నాను దీని నుంచి తప్పించుకోవాలి అని.