Mutyala HEMA MOUNIKA

Comedy Classics Inspirational

3.9  

Mutyala HEMA MOUNIKA

Comedy Classics Inspirational

ప్లేస్ మెంట్ రాఖీ

ప్లేస్ మెంట్ రాఖీ

2 mins
92


రాఖీ పండగ అంటే ఏంటి డాడీ? అంటూ అడిగింది మీన,అప్పుడు ప్రతాప్ రాఖి పండగ అంటే నువ్వు , అన్నయ్య లాస్ట్ ఇయర్ రాఖీ కట్టుకుని ఒకరికొకరు నేనంటే నేనని హారతి ఇచ్చుకున్నారు గుర్తుందా అదే రాఖీ పండగ. ఓ అదా అదెందుకు సెలబ్రేట్ చేస్కోవాలి అసలు అడిగింది మీన.

     ఎందుకంటే అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి గుర్తుగా,ఒకరిపై ఒకరు తమకున్న ప్రేమను లేదా ఇష్టాన్ని తెలపడానికి .

ఐతే నేను రాఖి కట్టను. ఏమ్మా మీన అలా అంటున్నావ్?నన్ను అన్నయ్య ప్రతిదానికీ తిడతాడు డాడీ,అన్నయ్యకు నేనంటే ఇష్టం లేదు.దేనికి తిట్టాడు?నేనేమో మొన్న వర్షంలో తడుస్తూ ఆడుకుంటుంటే మీన వర్షంలో తడవకు జ్వరం వస్తుంది అన్నాడు.నేను రాకపోతే అమ్మ చేత తిట్టించాడు.ఇంకో రోజు అన్నయ్య సైకిల్ ఇమ్మంటే ఇవ్వలేదు....అంటూ మొదలెట్టింది.సరే గానీ మీన అన్నయ్య నీ మంచి కోసమే చెప్పాడు అమ్మా నువ్వే అన్నయ్యను సరిగా అర్థం చేసుకోలేదు. అవునా..మరి ఎందుకు ప్రతీ సంవత్సరం చేసుకోవడం?

     అదెందుకంటే,నువ్వు అన్నయ్య పెద్దయ్యాక ఎవరి పనిలో వారు బిజీ ఐపోయారానకో కనీసం ఈరోజున ఐన ఒకరికొకరు ఎలా ఉన్నారో తెల్సుకుని చిన్ననాటి సిల్లీ థింగ్స్ అండ్ ఇంకా ఎన్నేనో విషయాలను, ఆనందాలను పంచుకోవడానికి....మరి నీకు ఎవరైనా రాఖీ కట్టారా.ఎందుకు కట్టలేదు ప్రతి ఇయర్ అత్త నాకు కడుతుందిగా. అత్తే కట్టాలా ఇంకెవరు కట్రా...ఇంతలో వాళ్ళ అమ్మ పిలిస్తే ఆ.. అంటూ మీన వెళ్లిపోయింది. ప్రతాప్ ఇలా ఆలోచనలో మునిగిపోయాడు...

    సుమారు ఏడేళ్ల క్రితమేమో తను ఒక అమ్మాయిని ట్రైన్లో కలుసుకున్నాడు.తన పేరు వసంత పక్కన ఒక 50 పైబడిన మధ్యవయస్కుడు తన తండ్రి ఏమో అనుకున్నాడు ప్రతాప్.ఇంతలో నాకు కాల్ వచ్చింది ఆ అమ్మ ట్రైన్ ఎక్కేసా నువ్వేమి ఫోన్ చేయకు రెండు రెండు గంటలకి ఒక్కొక్కసారి సిగ్నల్స్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే కంగరుపడటావు,నేనే నీకు ఫోన్ చేస్తాను అంటూ ఇంకా ఏవో మాట్లాడి ఫోన్ పెట్టేసా.ఇంతలో ఆ పెద్దాయన ఎక్కడికి బాబు అంటూ అడిగాడు.నేనా అండి అలా ఖరగపూర్ వరకూ అన్నాడు.ఓహో చదవుకోవడానికా బాబు ఏమి చదువుతున్నావు?ప్రతాప్ ఎంటెక్ చేయడానికని చెప్పి,ఇంకా ఏవో అడిగితే వాటికి సమాధానం చెప్పి టైంపాస్ కోసం వివేకానందుని జీవిత చరిత్ర తీసి చదువుతున్నాడు.ఒక గంట గడిచిన తర్వాత ఏదో కాస్త తిని ఈ బుక్ అంటే చాలా ఇష్టం అంకుల్ ఎన్ని సార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంది అంటూ ఏవేవో మాట్లాడుకున్నారు.

తర్వాత పెద్దాయన ఈ అమ్మాయి మా కూతురు తను కూడా ఎంటెక్ చేయడానికి ఖరఘ్పర్ వస్తుంది అని పరిచయం చేశాడు.తర్వాత కలిసే కాలేజికి వెళ్లారు.ఒక రెండు రోజులు ఐయ్యాక ఆయన వెళ్ళబోతూ తన కూతురుతో ఎప్పుడైనా సాయం అవసరమైతే అన్నలా భావించి అడుగమ్మా అంటూ ఆయన వెళ్ళిపోయాడు.

   ఇద్దరూ ఒకటే క్లాస్ అయినా వాళ్ళ మధ్య మాటలు తక్కువే.ఎప్పుడైనా మాట్లాడితే అదీ చదువు గురించే.కానీ వసంత అన్నా అని పలకరించేది అలా వాళ్ళ మధ్య అనుబంధం ఏర్పడింది.ఇలా రెండేళ్లు గడిచిపోతుండగా ఒక రోజు రాఖీ పండగ రోజు ఏదో placement exam ఉండి వాళ్ళు కాలేజిలో కలుసుకున్నారు. ఆరోజే వసంత అన్నా నీకు ఈరోజు రాఖీ కట్టొచా అంటూ అడిగి రాఖీ కట్టింది.

 తర్వాత నుండి వారిద్దరి మధ్య అనుబంధం ఇంకా పెరిగింది.ఒకరికొకరు చదువులో సాయం చేస్కొని మంచి ఉద్యగం సంపాదించారు.కానీ చదువు తర్వాత ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి.కొన్నెళ్లకు అంటే ఇప్పుడు మాటలు లేవు. కానీ కనీసం ఈ రాఖీ పండగ రోజు ఒకరినొకరు తలుచుకో కుండా ఉండగలారా?ఒకరు బావుండలని ఇంకొకరు మనస్ఫూర్తిగా కోరుకో కుండా ఉంటారా? ఇలా జీవితాంతం గుర్తుండే బంధాలకు అద్దం పడుతుంది వారిద్దరి మధ్య మాటలు లేకున్నా ఈ రాఖీ పూర్ణిమ.

        అటువంటి అన్నా_చెల్లెళ్లకు ఈ కథ అంకితం...


Rate this content
Log in

Similar telugu story from Comedy