స్వాతి సూర్యదేవర

Drama Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Drama Inspirational Others

ఫార్మా ఉద్యోగి

ఫార్మా ఉద్యోగి

2 mins
344


    ఫార్మా ఉద్యోగి....గుర్తింపు లేని సైనికుడు....


ఆమె..... .ఏంటండి ఇది దేశమంతటా లాక్డౌన్ అని ఇంట్లో వుంటుంటే...మీరు మాత్రం ఇలా కంపెనీకి వెళ్తూనే వున్నారు...

అతను..... వెళ్లకపోతే ఎలా...జీతం ఎలా వస్తుంది...ఇల్లు ఎలా గడుస్తుంది....

ఆమె.... ఉన్నదాంట్లోనే తిందాం....కాస్తో ,కూస్తో వెనకేసిన డబ్బులతో....అలానే గడుస్తుంది లెండి....

అతను..... సరే...ఎన్ని నెలలు తింటాం అలా....

ఆమె... .ఈ మహమ్మారి తగ్గేవరకూ....

అతను... ..నేను కంపెనీ కి వెళ్తేనే కదా అది తగ్గేది.....

ఆమె.. .అదేంటి......🤔🤔

అతను.... నేను వర్క్ చేసే ఫీల్డ్ ఏంటి.....

ఆమె.. .తన వైపు అలానే చూస్తూ ....ఫార్మా....కంపెనీ.....

అతను... .కదా.... మరి మేము పరిశోధనలు చేస్తేనే కదా....నువ్వు అంటున్న ఆ మహమ్మారి కి మందు దొరికేది....

ఆమె ...కావొచ్చు....కానీ..ఈ టైం లో మీరు ఇలా బయటకి వెళ్తే....మీకేంమన్న అయితే మా పరిస్థితి ఎంటో ఆలోచించారా....😢😢

అతను.... .ఆలోచించాల్సిన పరిస్థితిలో మేము లేము.......పరిష్కారం చూపెట్టాల్సిన భాద్యతలో మేము ఉన్నాం.... నా జాగ్రత్త లో నేను ఉంటాను...నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు....కంపెనీ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు....డోంట్ వర్రీ..బై....

ఆమె... లేని నవ్వు తెచ్చుకొని...నవ్వి పంపిస్తుంది....

పక్కింటి ఆమె ......ఏంటి...అమ్మాయి...మీ ఆయన డ్యూటీకి వెళ్తున్నాడా....

ఆమె. ...అవును పిన్ని గారు....

పక్కింటి ఆమె ......(. కాస్త వెటకారం,చులకన కలిపిన భావంతో ).....అంతేలే...వెళ్లకపోతే...మీకు ఎలా గడుస్తుంది లే..పాపం...మావాళ్ళు లాగా కాదుగా....మా సాఫ్టువెర్ ఉద్యోగులు అంత జీతాలు,సుఖం అందరికి వుండదులెమ్మ....

ఇదిగో అమ్మాయి ఒక చిన్న మాట

ఆమె ...ఏంటండి...

పక్కింటి ఆమె ......ఎం లేదు....మీ ఆయన రోజు డ్యూటీ కి వెళ్తున్నాడయే...ఎక్కడక్కడనుండో....ఎంత మందో వస్తారు....అంత ఆరోగ్యవంతులే అని చెప్పలేం...కాస్త మీరు ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉంటే మంచిది.....😏😏మీ వల్ల మా ప్రాణాలు రిస్క్ లో పెట్టుకోలేం కదా...

ఆమె ..... 😞😞😞అలాగే అండి అని ఇంకేం మాట్లాడలేక ఇంట్లోకి వెళ్ళిపోయింది.....

         ఇంట్లోకి వచ్చిందన్న మాటే కానీ ....లోపల తనకే తెలియని ఒక అంతర్మధనమ్ జరుగుతుంది....

ఆమె. .....ఎంత చులకన భావం కనపడుతుంది ఆమె మాటల్లో....ఇదా...మా ఫార్మా వాళ్ల ఉద్యోగాలకు ఉన్న విలువ....

      ఎందులో తక్కువ మేము....చదువు లోనా...,జీతం లోనా....ఈ రెండు కాదు గుర్తింపు లో....అవును కచ్చితంగా గుర్తింపు లోపం తోనే.....

           అరకొర మార్కులతో పాసైన వాళ్లందరికి ఉద్యోగం దొరుకుతుందేమో...కానీ మా ఫార్మా వాళ్ళకి డిస్టన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేయాలన్నా...మొదటి సంవత్సరం లో 70%పైగా మార్కులు వస్తేనే....బీ.యస్ స్సి లో వాళ్ళికి అర్హత లభిస్తుంది.... వీళ్ళది చదువులు కావా...కష్టం కాదా....

      వీళ్ళు చేసే పని దగ్గర క్షణం అలసత్వం చూయించినా... లక్షల్లో నష్టం,కొన్ని సార్లు ప్రమాదం జరిగి ప్రాణాలు కూడా పోవొచ్చు...వాళ్ళ ప్రాణాలను...భార్య,బిడ్డల భవిష్యత్తు ని రిస్క్ లో పెట్టి చేసే ఉద్యోగానికి విలువే లేదా....

       అన్ని రంగాల వారికి పండగలు,పబ్బాలకి సెలవులు ఉన్నాయి...కానీ మాకు పండగలు తెలియవు....,ఎప్పుడైనా తల్లిదండ్రులు చూడడానికి... ఊరు రమ్మంటేనే...రెండు రోజులు కూడా కుదురుగా ఉండలేని ఉద్యోగాలు మావి.....

       కానీ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.... వీళ్ళు ఎవరు ఇంట్లో నుండి కాళ్ళు కూడా బయటపెట్టట్లేదు....కానీ...మా ఫార్మా వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నారు....

     ఎం చేస్తున్నారు.....నీడపట్టున ఉంటున్నారు... జీతాలు తీసుకుంటున్నారుగా....అని అంటారేమో....

      నీడ పట్టునా......ఎక్కడ... ఇదివరకు....ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే....ఇప్పుడు పన్నెండు నుండి పద్నాలుగు గంటలు వరకు కూడా చేస్తున్నారు....

ఈ శ్రమ ఎవరికి కనిపించదా.....😥😥,ఇంతమంది...ఇన్ని రంగాలకు చెందిన వారు ఇంటిపట్టున ఉంటున్నా...వీళ్ళు మాత్రమే ఎందుకు వెళ్తున్నారు...అసలు ఎందుకు వెళ్ళాలి అనే కనీస ఆలోచన కూడా ఎవరికి రావట్లేదా......

    చిన్న నొప్పి వచ్చినా...డాక్టర్లు దగ్గరికి పరిగెడతారు....గుప్పెళ్ల కొద్ధి మాత్రలు,మందులు మింగుతారు....మరి అవి ఎక్కడి నుండి వస్తున్నాయి....వీళ్ళు( ఫార్మా ) తయారు చెయ్యకుండా....

        ఇప్పుడు ...ఈ ప్రాణాలు తీసే మహమ్మారి నుండి వీళ్ళందరిని కాపాడడానికి వీళ్ళు చేసే కృషి కేవలం డబ్బు తోనే ఎందుకు ముడిపెట్టి చూస్తున్నారో అస్సలు అర్ధం కాని ప్రశ్న...?

       ఫార్మా రంగం అంటే....చిన్న,నుండి పెద్ద స్థాయిల దాకా కృషి చేస్తేనే... ఆ పని సఫలీకృతం అవుతుంది...వీళ్ళందరు మాకు ఎందుకు అనుకుంటే....ఈ పరిస్థితుల్లో...ప్రపంచం లో సగం జనాభా కూడా వుండరు....

      కానీ....మాకు గుర్తింపు లేదని భాదపడం......మేము కూడా మా దేశం కోసం గుర్తింపు లేని సైనికుడిలా పని చేస్తూనే...ఉంటాం....ఆ బోర్డర్ లో సైనికులు ఎలా పని చేస్తున్నారో....అలానే మేము ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేస్తాo...మీ ఆరోగ్యాలకోసం....

     



Rate this content
Log in

Similar telugu story from Drama