స్వాతి సూర్యదేవర

Tragedy Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Tragedy Inspirational Others

నేను భారాన్ని కాదు..బాధ్యత ను.

నేను భారాన్ని కాదు..బాధ్యత ను.

1 min
380


రక్తాన్ని పాలగా మార్చి ఇచ్చిన నాకు ఈ రోజు బుక్కెడు బువ్వ పెట్టలేని భారాన్ని అయ్యానా... బిడ్డా అని ఒక తల్లి రోదన...


నీ భాద్యతలలో పాలు పంచుకొని నీకు వెన్నంటి ఉండడం నా బాధ్యత అని నేను అనుకుంటున్నా....కాని నేను నీకు భారమవుతున్ననా అని నీ మాటలలో నాకు అనిపిస్తుంది అని ఒక భార్య వేదన....


జగతికి మూలం ఆడపిల్ల అని కీర్తించే ఈ జగతిలో నన్ను కాపాడటం మీ బాధ్యత అన్న విషయాన్నీ విస్మరించి భారం అని కడుపులోనే కరిగించేదేందుకు అని అన్యాయంగా ఉసురు పోతున్న ఒక ఆడబిడ్డ ఆక్రందన......


భాద్యతలు మోసి మోసి అలసి సొలసిన మాకు పట్టడంత అన్నం పెట్టలేక ,గుప్పెడంత ప్రేమ చూపించలేంత భారం అయ్యామా అని ఒక వృద్ధ తల్లిదండ్రులు ఘోష....


పోయే ప్రాణాన్ని కాపాడడం నా బాధ్యత అని అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలని సైతం లెక్క పెట్టకుండా దివి కెగసిన వైద్యుల ఆత్మలు....ఎందుకు వారి ప్రాణాలు తో చెలగాటం ఆడుతున్నారు...అనిఅడగలేక.. నిస్సహాయ స్థితిలో హాస్పిటల్ ఫీజుల భారంతో ఏమి చేయలేక ప్రాణాల్ని పోగొట్టుకుంటున్న అన్యుల బాధను చూడలేక వారి ఆత్మలు పడుతున్న నరక యాతన... 


మీకోసం మేము ఉన్నాం....అది మా భాద్యత అని ప్రాణాలను పణంగా పెట్టి సరిహాద్దుల్లో పహారా కాసే సైన్యం చెపుతుంటే.....కుల మత భేదాలతో.....కొట్టుకొని ఈ మట్టికి భారం గా మారిన కొందరి నైజం.....


ఈ తీరు మారేదెన్నడు.....మన బాధ్యతలను గుర్తించేదెన్నడు......


    బాధ్యత గా తీసుకొనే ముందు భారం గురించి ఆలోచించడం మనెయ్యి నేస్తమా.....అప్పుడు అంతా ప్రేమే,భారం ఉండదు...కనపడదు....


తప్పులు ఉంటే మన్నించగలరు...🙏🙏



Rate this content
Log in

Similar telugu story from Tragedy