స్వాతి సూర్యదేవర

Comedy

4  

స్వాతి సూర్యదేవర

Comedy

అల్లరి పిల్ల విన్నీ..

అల్లరి పిల్ల విన్నీ..

3 mins
481


డాడీ ఏంటి ఆఫీస్ నుండి వచ్చి అలా పడుకున్నావు...డల్ గా ఉన్నావు మమ్మీ నిన్ను కూడా కొట్టిందా

నన్ను మమ్మీ కొట్టడం ఏంటమ్మా...నన్ను ఎందుకు కొడుతుంది..

మరి ఎందుకు భాదపడుతున్నావు...నువ్వు కూడా నాలాగే డల్గా ఉంటే నిన్ను కూడా నన్ను కొట్టినట్టు అట్లకాడ తీసుకొని కొట్టిందేమో అనుకున్నా

నా సంగతి సరే నిన్ను ఎందుకు కొట్టింది...

ఏమో డాడీ ,మమ్మీతో నా వల్ల కావట్లేదు మనం కొత్త మమ్మీని తెచ్చుకుందామా..అప్పుడు మనం ఏ భాధ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు..

కొత్త మమ్మీ ని తెచ్చుకునేంత బాధలు ఇప్పుడు నీకేం ఉన్నాయి రా ఈ మమ్మీ తో...

ఎం చెప్పను డాడీ...పొద్దున నాకు వద్దు అని ఏడుస్తున్న త్రి ఇడ్లి తినమని కుక్కింది,తర్వాత పాలు వద్దు అని ఎంత ఏడ్చిన ఊర్కోలేదు తాగలేదని కొట్టింది కూడా...

మరి ఫుడ్ తినకపోతే ఎలాగమ్మ తప్పు కదా...

వుండు డాడీ నీకు అంత తొందరే నన్ను చెప్పనీ...

హ.చెప్పు చెప్పు....

మళ్ళీ బయటకు వెళ్ళాం మేము షాప్కి అప్పుడు మళ్ళీ బెదిరించి కర్ర జ్యుస్ తాపించింది తెలుసా

కర్ర జ్యుస్ ఆ అదేం జ్యుస్ నాన్న...

చీ నీకు ఇది కూడా తెలియదా..కర్ర హోల్ లో పెడితే జ్యుస్ వస్తది కదా అది...

కర్ర హొల్ లో పెడితే వచ్చే జ్యుస్ ఆ..అదేంటి రా..నేను ఎప్పుడు వినలేదే

చూడలేదే...నాకు అర్ధం కాలేదు విన్ని

అందుకే నిన్ను రోజు నేను కొట్టేది..మీ సర్ కూడా నీకు హోమ్ వర్క్ ఎక్కువ ఇచ్చేది(వర్క్ ఫ్రొం హోమ్)

నా సంగతి సరే ముందు మీ సంగతి చెప్పు...కర్ర జ్యూస్ ఏంటి...

ఇంత చెప్పిన నీకు అర్ధం కాలేదా... డాడీ నీకంటే నోపితా నయం తెలుసా..

వాడేవడే

అబ్బా నీకు ఎం తెలియదు డోరేమాన్ ఫ్రెండ్...నీలాగే ఎం తెలియదు..అందుకే నేను నీకు చెప్పినట్టు డోరేమాన్ కూడా నోపితాకి అన్ని చెప్తాడు అయిన కొంచెం కూడా అర్ధం చేసుకోడు నీలాగే...ఇక నేను నీకు చెప్పలేను నేను పోతున్న..

అయ్యో అగవే..ముందు ఆ కర్ర జ్యుస్ అంటే ఏంటో చెప్పు...

నేను చెప్పను పో...

అగవే నువ్వు చెప్పిందాక నిన్ను వెళ్ళనివ్వను...అగు..

మమ్మీ.... మమ్మీ.... డాడీ..నన్ను కొట్టేస్తున్నాడు

ఓయ్ నేను ఎప్పుడు కొట్టానే

ఏంటి ఇక్కడ గొడవ

మమ్మీ డాడీ నన్ను కొడుతున్నాడు..

నెను ఎప్పుడు కొట్టానే నిన్ను

మమ్మీ డాడీ నిన్ను తిట్టాడు,కొత్త మమ్మీని తెచ్చుకుందామా అన్నాడు అది నీకు చెప్తా అన్నాను అని నన్ను చెప్పొద్దు అని కొడుతున్నాడు

మీకు బుద్ధి ఉందా చిన్న పిల్లని పట్టుకొని కొడుతున్నారా...పైగా ఇంకో పెళ్ళాం కావాలా మీకు...వుండండి చెప్తా మీ పని...

మమ్మీ బెల్ట్ అక్కడ ఉంది

ఓయ్ నీకు దండం పెడతానే నేను నిన్ను ఎం అనలేదు...విన్ని నే చెప్పింది నువ్వు తనని కొట్టావని....ఏదో కర్ర జ్యుస్ తాగలేదని బెదిరించావు అని..

కర్ర జ్యూస్ ఆ అదేంటి

అదే మమ్మీ మనం బయటకు వెళ్ళినప్పుడు మనం జ్యుస్ తాగం కదా ఆ షాప్ అబ్బాయి కర్రని హోల్ లో పెట్టి జ్యుస్ తీసాడు కదా....అది...

ఓ అదా... కర్ర ,కాకరకాయ కాదు చెరుకు రసంషుగర్ కెన్ జ్యుస్...

ఓహ్ అవునా...నాకు తెలియదు మమ్మీ దాని నేమ్

ఎలా తెలుస్తుంది పుస్తకాలు బూజు దులిపి ఆరు నెలలు అయింది..ఇంకెల తెలుస్తాయి

అదేంటి మమ్మీ పొద్దున కూడా నా బుక్స్ సర్దావు కదా

ఇది అండి దీని తెలివి ...కరోనా పెరు చెప్పి ఇంట్లో హాయిగా కూర్చొని ఆ t.v కి అతుక్కుపోయి కూర్చుంటుంది...ఆ వచ్చిన నాలుగు ముక్కలు కూడా మర్చిపోయింది...

నాలుగు ఏంటి మమ్మీ మొత్తం 3పీసెస్ ఏ గా

హ ఏంటి

అదే నువ్వు నాకు పెట్టినది చిక్కి 3 పీసెస్ ఏ గా...మరి 4 అంటావేంటి అంటే నువ్వు ఇంకో పీస్ తినేసవ నాది


..హే ముయ్..ఇది దీని గోల...

పోనీలే చిన్న పిల్ల ...పెద్ధోల్లం మనకే పదిలో నాలుగు గుర్తుండవు ఇంకా దానికి ఎం తెలుస్తుంది..

డాడీ.... పది అంటే వన్ 1 జీరో 0 టెన్10 ఏ కదా...

హ..అవును..

మరి అక్కడ 4 ఎక్కడ ఉంది నెంబర్


ఓయ్ నువ్వు ఆపేవే కాసేపు...చూడండి ఇది ఇలాగే ఉంటే మన మాట వినదు కానీ ముందు దీన్ని తీసుకెళ్లి హాస్టల్ లో పడియండి..అప్పుడు కానీ తిక్క కుదరదు...

అదేంటి మమ్మీ తిక్క నీకు కదా ఉంది...నన్ను పంపిస్తే ఎలా కుదురుతుంది

ఏంటి...

అదే నైట్ నువ్వు డాడీ ని తిట్టినప్పుడు డాడీ అన్నాడు ...మమ్మీ కి తిక్క ఉంది నాన్న అందుకే మనకి ఇన్ని బాధలు అని

అయ్యో అదేం లేదే...ఏదో ఉరికేనే అన్నాను...ఇది ఇంత బాగా గుర్తు పెట్టుకుంటుంది అని నాకేం తెలుసు...

..చదువు దగ్గర సున్నా కానీ, ఇలాంటివి మాత్రం బాగా గుర్తు ఉంటాయి దీనికి...మీతో వేగడం నా వల్ల కావాట్లేదు..రోజు ఏదో ఒక గోల..పెద్ద భాధ ఐపోయింది దీనితో

నాకున్న భాదలతో పోలిస్తే మీకు ఎం భాదలున్నాయి మమ్మీ...

నీకేం ఉన్నాఏ హ్యాపీ గా తిని ,చదువు చెట్టుబండలు లేకుండా ఇంట్లోనే ఉన్నావు కదా....

ఇదిగో ఇదే నా భాధ...తినకపోతే నెమో కుక్కేస్తావు..తింటేనేమో తిన్నాను అంటావు...లెగగాన్ర్ బ్రష్ చేయంటావు..వెంటనే స్నానము చెయ్యమంటావు. ఒక్క రోజైన వద్దులే అన్నవా..అనవు..పాలు అంటావు ,ఫ్రూట్స్ అంటావు..చకలెట్స్ అడిగితే వద్దు అంటావు..పాపం చిన్న పిల్ల అన్న జాలి కూడా లేదు నీకు పద్దాక చదువు చదువు అంటావు..అరే నేను చదువుతూ కూర్చుంటే డోరేమాన్ ఎవరు చూస్తారు....ఆ అంకుష్ చూడు ఎంత బాగా భజరంగి తో అడుకుంటాడో...నాక్కూడా అలాంటి ఫ్రెండ్ ని తీసుకురావొచ్చుగా..ఆహా ఇవ్వరు...టాయ్స్ కొనివ్వమంటే కొనివ్వరు....ఆ బుక్స్ ఈ బుక్స్ మాత్రం చాలా కొంటారు....అసలు ఇంత చిన్న పిల్ల ఎలా చదువుతుంది ఇన్ని బుక్స్ అని కూడా ఆలోచించరు...ఎందుకు మమ్మీ నాకు ఇన్ని బాధలు..హ


నాకు ఈ బాధలు అన్ని ఎప్పటికి పోతాయో ఏమో....నేను వెళ్లి కాసేపు డోరాబుజ్జి చూస్త...

అంతే కదండి మరి ఎవరి బాధలు వాళ్ళవి

                  



Rate this content
Log in

Similar telugu story from Comedy