పెళ్లి కళ వచ్చేసిందే
పెళ్లి కళ వచ్చేసిందే


పెళ్లి.మనకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కన్నా ఆనందం ఏముంది.
అగ్ని సాక్షిగా నీతో ఏడడుగులు వేసిన రోజు.
నా చిరునవ్వులకు కారణమైన నువ్వు సిగ్గుతో తల దించుకొని ఉండగా తాళిబొట్టు కట్టి నాతిచరామి అని పలికి
బ్రహ్మముడితో అగ్నిసాక్షిగా నీతో సప్తపది పూర్తి చేసిన ఆ రోజు.
మనిద్దరి పెళ్లి జరిగిన ఆ రోజు నా కల నిజమైన రోజు.ఒక్క కల కాదు.ఎన్నెన్నో కలలు నిజమైన రోజు.
ఎన్నో నిద్రలేని రాత్రుల బ్రహ్మచర్యపు బరువు దించుకున్న రోజు.