పచ్చడి లేని ఉగాది
పచ్చడి లేని ఉగాది


ప్రియమైన డైరీ,
ఇవాళ ఉగాది కదుటే.
ఉగాది పచ్చడి తినాలని చాలా ప్రయత్నించాను.
ఎక్కడా లేదు.
లాక్ డౌన్ కదా అన్ని వస్తువులూ దొరకలేదు.
మా పక్కింట్లో అడిగితే
నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు.
సరేలే ఉప్మా లోకి పనికొస్తుంది కదా అని దాచుకున్నాను.సాయంత్రం దాకా ఎదురు చూసి ఉప్మా చేసుకొని నిమ్మకాయ పచ్చడితో తిన్నాను.
అలా పచ్చడి లేకుండా శార్వరి నామ సంవత్సర
ఉగాది గడిచింది.
ఇంక ఓలిగ తినాలంటే రాసి పెట్టి ఉండాలి కదూ!