బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Classics Inspirational Others

3  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Classics Inspirational Others

ఓయ్ 2 topic 4

ఓయ్ 2 topic 4

3 mins
258


మహానగరం లో కారు స్పీడ్ గా వెళ్తుంది.అప్పుడే ఉదయ్ ఫోన్ రింగ్ అవుతుంది. కార్ డ్రైవ్ చేస్తున్న ఉదయ్ ఫోన్ వంక చూస్తూ నంబర్ చూస్తాడు .తన ఫ్రెండ్ .హలో చెప్పు రా..


ఒరేయ్ మామ..ఈ రోజు మైత్రి పుట్టిన రోజు రా..మామయ్యా ఏడి అని అడుగుతుంది.వస్తున్నారా దారిలో ఉన్న అక్కడకే వస్తున్న.


ఒకే రా కాస్త త్వరగా రా..


ఫ్యాక్సో ఎందుకు టెంక్షన్ పడతావు .పది నిమిషాలలో నీ ముందు వుంటా.అంటూ ఫోన్ పెట్టేసి కార్ లో ఉన్న లాఫింగ్ బుద్ధా నీ చూస్తూ చిన్న నవ్వు తన పెదవులపై వస్తుంది...మెల్లిగా సంధ్య తో గడిపిన క్షణాలు గుర్తు వస్తాయి ఉదయ్ కి తను పుట్టిన రోజు కి సంధ్య ఇచ్చిన గిఫ్ట్ లు తనతో గడిపిన క్షణాలు మరువలేనివి తనకి.ఆలోచిస్తూనే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు.తన కోసం ఎదురుచూస్తున్న తన ఫ్రెండ్ వెంటనే ఉదయ్ దగ్గరికి వెళ్లి త్వరగా రా మామ...అంటూ తీసుకెళ్తాడు.

ఉదయ్ తెచ్చిన గిఫ్ట్ నీ తన ఫ్రెండ్ పాప మైత్రి కి ఇస్తాడు.థాంక్స్ మామయ్య అంటూ తను ఉదయ్ కి బుగ్గ మీద ముద్దు ఇస్తుంది.


కేక్ కట్ చేసి మైత్రి వాళ్ళ అమ్మ నాన్న కి తినిపించి ఫోటో లు దిగుతూ వుంటారు.ఉదయ్ అక్కడే పార్టీ లో వున్న ఒక టేబుల్ దగ్గర కూర్చొని చూస్తూ వుంటాడు.అందరినీ నవ్వుతూ వుంటే చూస్తూ వుంటాడు ఉదయ్.


వెనక నుండి ఎవరో బుజం మీద చెయ్యి వేసినట్టు అనిపించింది. తిరిగి చూశాడు ఉదయ్.తన ఫ్రెండ్


ఎం అయింది రా... మామ అల వున్నావు..సంధ్య గుర్తు వచ్చింద.


మరిచిపోతే కదా ..అయిన తను నేను వేరు కాదు మరిచిపోవడానికి.


నిజమే కానీ..ఇలా ఎన్ని రోజులు లేని సంధ్య గురించి ఆలోచిస్తూ ఉంటావు.నీ తరువాత నీ ఆఫీస్ ,ఆస్తులు అంతస్తులు ఎవరు చూసుకుంటారు.నికంటు ఎవరయినా సొంత వాళ్ళు వుండాలి కదా మామ.


నువ్వు వున్నావు కదా ఫ్యాక్స్సో....ఇంకా ఎందుకు.


నేను జోక్ చెయ్యడం లేదు రా...అని మాట్లాడుతూ వుండగానే ఎవరో పిలిచే సరికి ఇప్పుడే వస్తాను అని తను వెళ్ళిపోతాడు..


ఉదయ్ వెనక్కి తిరిగి చూస్తాడు.అప్పుడే అక్కడ ఒక పదేళ్ల పాప కూర్చొని ఒక బుక్ లో ఎదో రాస్తుంది.అందరూ ఎంజాయ్ చేస్తున్న పార్టీ లో తను మాత్రమే అల కూర్చొని రాస్తుంటే .తన రూపం....తను పెట్టుకున్న కళ్ళజోడు ....మొహం లో సీరియస్ నెస్..తనకి సంధ్య గుర్తు వచ్చింది...కాసేపు తననీ అలానే చూస్తూ ఉంటాడు ఉదయ్...తనలో ఒక ఆనందం..చెప్పలేని ఒక అనుభూతి..తననీ చూస్తుంటే...వెళ్లి తన ముందు చైర్ లో కూర్చుని తన వంక చూస్తూ...హాయ్ అని అంటాడు..ఉదయ్...


ఆ అమ్మాయి చూసి మళ్ళీ రాయడం మొదలు పెట్టింది..


ఈ సారి ఉదయ్ కి ఇంకా సంతోషం గా అనిపిస్తుంది.


నీ పేరేంటి...


ముందు నీ పేరేమిటి అని అడిగింది ఆ అమ్మాయి...


ఉదయ్ అని అంటాడు...


తను మళ్ళీ ఎదో రాస్తూ ఉండిపోతుంది...


హలో హలో అని ఉదయ్ ఎన్ని సార్లు పలకరించిన తను ఎం మాట్లాడదు.


తను రాసే నోట్ బుక్ తీసుకుంటాడు . ఆ అమ్మాయి కోపం గా వేరే వాళ్ళ డైరీ తీసుకోకూడదు అని తెలీదా అంటూ బుక్ లాక్కోవడానికి ముందుకు వస్తుంది.


ఆగు...ఎందుకు అంత టేంక్షన్ పడుతున్నావు..మమ్మీ కి తెలియకుండా ఎగ్జాం పేపర్ దాచవ...అంటూ పాప నీ ఆపుతు డైరీ తీసి చూసాడు.అందులో న్యుమరాలజి రాసి వుంది ఉదయ్ అనే పేరు దాని కిందే సంధ్య అని...

ఆ పేరు నీ తాకుతూ....నీ పేరు సంధ్యా...

అవును...నికు నాకు ఫ్రెండ్షిప్ కుదరదు అంటూ తన బుక్ లాగేసి ముందుకు వెళుతుంది...

తననే చూస్తున్న ఉదయ్ దగ్గరికి మైత్రి వస్తుంది.


ఏమయ్యింది మామయ్య మా ఫ్రెండ్ ఎం అయిన అందా...


లేదు మైత్రి...చెప్పు నీ బర్త్ డే గిఫ్ట్ నికు నచ్చిందా...


చాలా...నచ్చింది మామయ్య...అంటూ తన ఒడిలో కూర్చుని..ఉదయ్ చేతులని ముందుకు అనుకోని ముందుకు వెనక్కు ఊగుతూ...పాపం వాళ్ళ మమ్మీ డాడీ 1 ఇయర్ బ్యాక్ ఆక్సిడెంట్ లో చనిపోయారు.వాళ్ళ తాత దగ్గర వుంటుంది...చాలా మంచిది.నచ్చిన వాళ్ళ కోసం ఏం అయిన చేస్తుంది. నచ్చక పోతే అస్సలు పట్టించుకోదు...చాలా బాగా చదువుతుంది...కానీ మొక్కల పిచ్చి..అంటూ తనని పిలిచిన ఫ్రెండ్ దగ్గరికి పరుగు తీసింది మైత్రి...


అప్పుడే వచ్చిన తన ఫ్రెండ్ నీ చూస్తూ...నా వారసురాలు కోసం నేను పెళ్లి చేసుకోవడం అవసరం లేదు ప్యాక్స్సో... అదిగో అని సంధ్యని చూపిస్తాడు ఉదయ్.....తన కలల్లో మెదిలే సంధ్య నీ గుర్తు చేసుకుంటూ...


కానీ.....


కానీ ఏమిటి రా...తను అమ్మాయి అనా....నేను ఇష్టపడిన అమ్మా...ప్రేమించిన అమ్మాయి ..ఇద్దరు ఆడవాళ్లే గా..వారసురాలు ఎందుకు కాకూడదు....అని సంధ్య ప్రతిరూపం అయిన పాప నీ చూస్తూ నవ్వుతాడు....



Rate this content
Log in

Similar telugu story from Classics