యశస్వి రచన

Drama

4.0  

యశస్వి రచన

Drama

ఓటమి

ఓటమి

5 mins
994


"ఏంట్రా ఎప్పుడు చూడు ప్రతీ విషయం లో ఓడిపోతున్నాను.నా మీద నాకు ఆసహ్యం వేస్తుంది రా.ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఇంటర్వ్యూ లు కు అటెండ్ అయ్యాను అలాగే ఎన్నో ఎగ్జామ్స్ కి ఎంట్రన్స్ టెస్ట్ లు రాశాను.నేను ప్రతీ ప్రయత్నం లో ఓడిపోతున్నాను.నా బాధ్యత ఇంకా నాన్నే చూస్తున్నాడు.ఈ ఓటమి భయం చివరికి నా రక్తం లో కలసిపోతుంది అని భయం గా ఉంది రా, ఇప్పుడు నా మనసు చాలా ఉద్వేగంగా వుంది రా. ఆత్మ హత్య చేసుకోవాలి అనేంత బాధ గా వుంది రా" అని వేణు తన బాధ వర్మకి చెప్పాడు.


చూడు వేణు "ఓటమి భయం లేకపోతే ఎప్పటికీ నువ్వు విజయాని అందుకోలేవు. నువ్వు ఓడిపోతే ఈ సమాజం నిన్ను పట్టించుకోదు.నేను అనే ఉనికి నువ్వు కోల్పోతావు.ఈ ప్రపంచం లో తన ఉనికి కోల్పోయి చివరికి తనే ప్రపంచానికి ఉనికి గా మారిన అనేక మంది మన కళ్ళ ముందు వున్నారు"


"నువ్వు ఓడిపోయాను అని గొంతు చించుకుని అరిసిన అంత మాత్రాన ఈ ప్రపంచం నీ వైపు చూడదు.ఆ ఓటమి నుండి పాఠం నేర్చుకుని, ఓటమి అనే అడుగు దూరం లో విజయానికి దూరం అయిన నువ్వు , ఆ పాఠం ద్వారా ఆ అడుగు ను ఆత్మస్థైర్యం తో వేస్తే నీ ఓటమే నీ గెలుపు కి నాంది అవుతుంది"


"వేణు, నా దృష్టి లో నా ఓటమి అంటే నేను ఓడిపోవడం కాదు నా ప్రయత్నం ఫలించలేదు అంతే . నేను తిరిగి మళ్లీ ప్రయత్నిస్తాను. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాను.నిజానికి నువ్వు నీ ప్రయత్నం లో వున్న ఆసక్తి నీ కొల్పోయావు.నాకు తెలిసి నీకు గెలవాలి అనే ఆసక్తి వుంటే ఓటమి ఎదురయ్యే ప్రతీ సారీ నీ ఆసక్తి పెరుగుతూ వుండాలి కానీ నువ్వు ఓటమి వల్ల వచ్చిన నిరాశ వల్ల ఆసక్తి కోల్పోయి నీ ప్రయత్నం లో విఫలం అవుతున్నావు"


"గెలుపు నీ చుట్టూ వున్న సుఖాలను సౌఖ్యాలను చూపిస్తుంది.కానీ ఓటమి నీ చుట్టూ వున్న బాధలను కష్టాలను చవి చూపిస్తుంది. కష్టాలు బాధలు అనుభవించిన వాళ్లు మాత్రమే విజయం తాలూకా అసలైన రుచిని ఆస్వాదిస్తారు"


"గెలుపు ఓటమి అనేవి రెండు ఎప్పుడు మనం వెళ్లే దారిలో నే వుంటాయి. కానీ వాటి మధ్య తేడాను గుర్తించాలి అంటే ముందు మనసు చాలా ప్రశాంతం గా వుండాలి. ప్రశాంతత లేని మనసు అగ్ని పర్వతంతొ సమానం. ప్రశాంతత లేని మనసు నుండి వచ్చే ఆలోచనలు అగ్ని పర్వతం నుండి వచ్చే లావా తో సమానం దాని దారికి ఏవి అడ్డు వచ్చిన మాడి మసి అవుతాయి.అక్కడ తిరిగి ఏ మొక్క మొలవదు.అలాగే ప్రశాంతత లేని మనసు నుండి వచ్చే ఆలోచనలు కూడా చెడుకే దారి తీస్తాయి.ఎప్పుడు మంచి ఆలోచనలు రావు"


"ప్రశాంతమైన మనసు నిర్మలమైన వెన్నెల లాంటిది దాని నుండి ఎంత కాంతి వస్తె అంత అందంగా ఆ వెన్నెల కనిపిస్తుంది. అలాగే ప్రశాంతమైన మనసు వచ్చే ఆలోచనలు కూడా ఆ మనసు అందాని పెంచుతాయి"


"నువ్వు ఎప్పుడు ఓటమి గురించి ఆలోచించటం వల్ల గెలుపు అనే మాటకూడా నీ నోటి వెంట రావటం లేదు.అలాంటిది నీ జీవితంలో కి ఎలా వస్తుంది"


"అరేయ్ ముందు నువ్వు ఓడిపోయాను అని నిన్ను నువ్వు నిందించుకోకు. అది నీలోని ఆత్మస్థైర్యం ని దహించి వేస్తుంది. చివరికి అది ఇంటిసూరి నుండి మొదలు పెట్టినట్టు పెట్టీ చివరికి ఇంటి మొత్తాన్ని దహించి వేస్తుంది. అలాగే ఓటమి వల్ల కోల్పోయిన ఆత్మస్థైర్యం దేహాన్ని మొత్తం దహించి వేస్తుంది"


"కన్న వాళ్లు నువ్వు కొని తీసుకు రాలేదు అని భాదపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదురా. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే చూడాలి అని పరితపించే వాళ్లు రా. వాళ్లు ఇంకా నీ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే నువ్వు తిరిగి మళ్లీ వాళ్లకు వడ్డీ తో ఆ డబ్బులు తిరిగి ఇస్తావు అని కాదు. వాళ్ల రక్తమాసాములు పంచుకుని పుట్టిన బిడ్డ మంచి భవిష్యత్తు కు చేరుకుంటాడు అని. నీకు మీ అమ్మా నాన్న నుండి డబ్బులు తీసుకోవటం ఇష్టం లేకపోతే నువ్వు ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ లో జాయిన్ అయి నీ కర్చు లకు నీ డబ్బు నువ్వే సంపాదించు అంతే కానీ సిగ్గు పడవలసిన అవసరం లేదు"


"నువ్వు ఆత్మహత్య తో నిన్ను నువ్వు చంపుకుని చట్టం నుండి తపించుకుని వెళ్లిపోతావు.కానీ శిక్ష ఎవరు అనుభవించాలి? మీ అమ్మా నాన్నల లేకపోతే నీ తమ్ముడా?"


"ఒక చెట్టు ని పెంచి అది కాయలు కాసే సమయం కి అది గాలివాన లో కుప్పకూలిపోతే దానిని పెంచిన వాడు దాని కాయల రుచి నేను చూడలేకపోయాను అని భాదపడడు. నేను పెంచిన చెట్టు తన లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది అని బాధపడతాడు"


"ఇక భయం అంటావా! ఎవరికి లేదురా భయం చిన్న పిల్లవాడి నుండి చచ్చే ముసలివాడి వరకు అందరూ ఏదో విషయం లో భయపడుతునే వుంటారు.కానీ ఆ భయానికి అంటూ ఒక పరిమితి వుంటుంది"


"ఆ పరిమితిని ధైర్యం గా దాటితేనే విజయం నీ సొంతం అవుతుంది"


"భయం నీలో ఉన్న విశ్వాసాన్ని ఆవిరి చేస్తుంది కానీ ధైర్యం నీలో వున్న విశ్వాసాన్ని వంద రెట్లు చేస్తుంది"


"భయం, ధైర్యం రెండు పదాలు రెండు అక్షరాలే కానీ వాటి వల్ల కలిగే భావం జీవితం అనే మూడు అక్షరాలను మున్నాళ్ల ముచ్చటగా లేకపోతే నూరు సంవత్సరాల ముచ్చటగా మిగుల్చుతుంది"


"భయం అయినా ధైర్యం అయినా నీ గుండె నుండే బయటికి వస్తాయి.కానీ వాటిని బయటికి విడుదల చేయటం నీ మనసు మీద ఆధారపడి వుంటుంది"


"భయం గా వున్న సైనికుడు యుద్దానికి వెళ్లకుండా దాకుని వుంటాడు.కానీ ధైర్యం గా వున్న సైనికుడు యుద్ధంకి వెళ్లి విజయం తో తిరిగి వస్తాడు లేకపోతే వీర మరణం పొందుతాడు.సమాజం లో వీళ్ళ ఇద్దరి లో ఎవరికి ఎక్కువ ఖ్యాతి వస్తుందో నేను నీకు చెప్పవలసిన అవసరం లేదు"


"నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనేంత బాధ ఉంది అన్నవ్ కదా?"


"ఆత్మహత్య అంటే నీ దృష్టి లో అదేదో ఒక చాయిస్ అనుకుంటున్నావు.అది చాయిస్ కాదు రా వేణు అది కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ఒక ఆయుధం.ఆ ఆయుధానికి ముందు బలి నువ్వు అవుతావు కానీ దాని తాలూకా గాయాల బాధలు మీ అమ్మా నాన్న లను క్షోభ పెడుతుంది"


"వేణు నీలో వున్న భయాని నువ్వే అధిగమించాలి.నీకు ఎవరు సహాయం చేయరు.నీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు అనుకోవటం ఒక అవివేకం"


"శ్రీ శ్రీ ఒక మాట అన్నాడు

కుదిరితే పరిగెత్తు,

లేకపోతే నడువు,

అదీ కుదరకపోతే పాకుతూపో,

అంతే గాని ఒకేచోట అలా వుండకు అందుకే

నీలో శక్తి ఉన్నంత వరకు పోరాడు రా వేణు"


"విజయం వల్ల వచ్చే ఆనందం నిన్ను ఆకాశానికి చేరుస్తుంది.కానీ ఓటమి వల్ల వచ్చే అనుభవం అలాంటి వంద విజయాలు కు పునాది వేస్తుంది. ఓటమి తో శత్రుత్వం పెట్టుకుంటే అది నిన్ను ఏదో ఒక సందర్భం లో చంపేస్తుంది.అదే ఓటమి తో నువ్వు స్నేహం చేస్తే అది నిన్ను విజయం వైపుకు తీసుకెళ్తుంది"


"ఓటమి వచ్చింది అని నువ్వు భాద పడితే దాని వల్ల వచ్చే దుఃఖం, కారు మబ్బులు సూర్యుడిని కమ్మేసినట్టు నీ ధైర్యాన్ని అవి కమ్మేస్తాయి.ఒక్కసారి ఓటమి దుఃఖం నుండి బయటికి రా సూర్యుడు కంటే గొప్ప గా వెలుగుతున్న నీ దైర్యం ని చూడు, ఆ వెలుగు లో నువ్వు విజయానికి దారి తెలుసుకోవచ్చు"


"ఎందుకు ఓడిపోయాను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఆ ప్రశ్నలు కు సమాధానాలు వెతుకు. ఆ తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడు"


"ఒక రతన్ టాటా, దీరుభాయ్ అంబానీ ఇలా ఎందరో తమ జీవితాలు లో ముందు ఓటమి నే చూసారు. కానీ వాళ్ళ జీవితాలు నేడు ఓటమి వల్ల బాధపడే వాళ్ళకి ఒక స్ఫూర్తి గా నిలిచాయి"


"శ్రీ కృష్ణుడు యుద్ధం లో పడిపోయిన అర్జునుడిని లేపటానికి ఒక మహత్తర గ్రంధాన్ని బోధించాడు. అప్పుడు మొహం వీడిన అర్జునుడు యుద్ధం లో పాల్గొన్నాడు"


"కానీ జీవితం అనే యుద్ధం లో పడిపోతే నిన్ను లేపడానికి శ్రీ కృష్ణుడు రాడు.ఎందుకంటే ఆయన నీలోనే ధైర్యం రూపం లో వున్నాడు.అది నువ్వు గ్రహించి నిస్సత్తువ అయిన నీ దేహం లో బలాని నింపుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు


"ఓటమి చావు కాదు విజయం పుట్టుక కాదు ఆ రెండు జీవితం లో ఒక భాగాలు మాత్రమే.మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని ఓటమి కోర లో భందించ గలవు అలాగే విజయ తీరానికి చెర్చగలవు"


చివరిగా ఒక మాట రా 


"ఓడిపోయింది నువ్వు దానిని నువ్వే భరించూ,


దాని వల్ల వచ్చే అవమానాలు సహించు,


ఓటమి భయాని త్యజించు,


నీలో ఉన్న ధైర్యాన్ని నువ్వు గ్రహించు,


నీ తల్లితండ్రుల త్యాగాలను గుర్తించు,


చివరికి నీ గెలుపు తీరాలకు పయనించు"


ఇక నిర్ణయం నీదే రా వేణు.


"ఓటమికి భయపడి చచ్చిపోతావొ, విజయం కోసం పోరాడి గెలుస్తవో నీ ఇష్టం ఇంక"


అని వర్మ వేణు కి కొంచెం ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు.


కొన్ని నిమిషాలు వాళ్లిద్దరి మద్య మౌనం సాగిపోయింది.

అప్పుడు వేణు "మహా భారత యుద్ధం లో శ్రీ కృష్ణుడు అర్జునుడిని తన గీత తొ పైకి లేపాడో లేదో నాకు తెలియదు రా. అలాగే నేను ఇప్పుడు అర్జునుడి నో అవునో కాదో నాకు తెలియదు రా నాకు మాత్రం నువ్వు శ్రీ కృష్ణుడివి రా" అని గుండెలకు హత్తుకున్నాడు.


"అరేయ్ వేణు నువ్వు అర్జునుడు కాదు, అంతకు మించి నేను శ్రీకృష్ణుడు అసలు కాదు ఎందుకంటే మనం ఇద్దరం అంతకు మించి ప్రాణ మిత్రులం" అన్నాడు.



Rate this content
Log in

Similar telugu story from Drama