Yeddula Chandrakanth

Horror Crime Fantasy

4.5  

Yeddula Chandrakanth

Horror Crime Fantasy

నిశీధిలో వేట

నిశీధిలో వేట

4 mins
2.1K



మువ్వల పాలెం గ్రామము సమయం రాత్రి 8 : 30 నిమిషాలు వర్షాకాలం కావడంతో ఆకాశం మేఘావృతమై ఏ క్షణంలోనైనా వర్షం పడేలాగా ఉన్నది

అదే సమయంలో ఇద్దరు భార్యాభర్తలు , వారి పేర్లు హరి , బిందు వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్లయింది. పక్కనే ఉన్నటువంటి సిటీలో ఫస్ట్ షో మూవీ చూసి వాళ్ల ఊరుకి వెళ్తున్నారు

వాళ్ళ ఊరుకు చేరుకోవాలి అంటే మువ్వల పాలెం గుండనే వెళ్ళాలి. మువ్వల పాలెంలో సాయంత్రము 6 దాటింది అంటే ఎక్కడా కూడా జనసంచారం కనిపించదు

అలాగే మువ్వల పాలెంలో ఉన్నటువంటి వాళ్ళు , తలుపులు గట్టిగా బిగించి బయట ఎంత అరుపులు, శబ్దం , ఎవరు పిలిచినట్లు అనిపించినా కూడా తలుపు తీయరు రాత్రి మూసిని తలుపులు మళ్ళీ తెల్లవారిన తరువాతే తీస్తారు

దానికి కారణం మువ్వల పాలెంలో రాత్రి సమయంలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని వాళ్ల భయం, ఆ భయానికి కూడా కారణం లేకపోలేదు

భార్యాభర్తలలో , భార్య చదువుకున్న అమ్మాయి , భర్త కాస్తోకూస్తో చదువుకున్నాడు

మువ్వల పాలెం గురించి తన భార్యకి ఎంత చెప్పిన అవన్నీ ఉత్తి మూఢ నమ్మకాలని, అటువంటివి నేను నమ్మను అని భర్తతో గొడవపడి మరి ఆ రోజు సినిమా చూడడానికి వెళ్లారు

వాళ్లు అనుకున్నట్లుగానే సినిమా చూసి , ఆ సిటీలోనే భోజనం కూడా ముగించుకొని ఇంటి దారి పట్టారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా వస్తూ ఉండగా బైకు ఎప్పుడైతే మువ్వల పాలెం పొలిమేరలోకి రాగానే హరికి చాలా భయం వేసింది

తను భయపడటము తన భార్యకి తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని ధైర్యంగా బైక్ ను ముందుకు పోనిచ్చాడు

బైక్ సరాసరి మువ్వలపాలెంలో జంక్షన్ మాదిరి ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకోగానే పంచర్ అయింది

హరి ( మనసులో ) : ఇదేమిటి ఇలా అయింది సరిగ్గా ఊరు మధ్యలోకి రాగానే బైక్ పంచర్ అయింది మా ఇద్దరికీ ఏదైనా ప్రమాదం ముంచుకు రాబోతుందా అనుకుంటూ ఆ భయాన్ని బయటకు కనిపించనివ్వకుండా ఇప్పుడెలా అనుకుంటూ ఉండగానే

బిందు : ఏంటండీ ఇలా అయింది ఇంకొక ఇరవై నిమిషాలు గడిస్తే మన ఇంటికి చేరుకునే వాళ్లం కదా

హరి : ఈ సమయంలో సినిమాకు వద్దు అంటే నా మాట నువ్వు విన్నావా ఇప్పుడు చూడు మన పరిస్థితి ఎలా అయిందో

బిందు : సరే నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని మాటలైనా అందరు కానీ మనం ఇంటికి చేరుకునే మార్గం ఆలోచించండి

హరి : ఆలోచించడానికి ఏముంది నడుచుకుంటూ వెళ్దాము పదా అంటూ , తను బైక్ ని తోసుకుంటూ వాళ్ల ఊరికి నడక ప్రారంభించారు

బిందు : ఏవండీ సినిమా బాగుంది కదా

హరి : సినిమాకేం చాలా బాగుంది , మన సినిమా ఇప్పుడే మొదలైంది , మన ఊరికి బైక్ తోసుకుంటూ అంత దూరం వెళ్ళాలి అంటే నా పని అయిపోయినట్లే

బిందు : నవ్వుతూ మీకు అంతగా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను తోస్తాను

హరి : అదేమీ లేదు త్వరగా వెళ్దాం పద అంటూ తన నడకలో వేగాన్ని పెంచాడు వాళ్ళు కొద్ది దూరం వెళ్ళేసరికి మువ్వల పాలెం స్మశానం కనిపించినది

స్మశానాన్ని చూడగానే హరి భయపడుతూ ,ఆ భయాన్ని బయటకు కనిపించనివ్వకుండా ఇంకా వేగంగా నడవసాగాడు

బిందు : ఏమైందండీ ఎందుకని అలా వేగంగా నడుస్తున్నారు కాస్త చిన్నగా నడవండి నేను మీతో పాటు నడవలేకపోతున్నాను

హరి : కంగారుగా త్వరగా నడువు మనం వెంటనే ఈ ఊరి పొలిమేర దాటాలి లేదంటే ప్రమాదం

బిందు : ఏమైందండీ ఎందుకని అలా మాట్లాడుతున్నారు

హరి : కోపంగా ఇప్పుడు నన్ను విసిగించకు , ముందు చెప్పింది చెయ్యి అంటూ ఉండగానే

ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి భయంకరమైనటువంటి ఈదురు గాలులతో, దుమ్ము దూళి లేస్తూ వారు వెళ్ళే దారి సరిగా కనిపించలేదు

బిందు : అదేమిటండి మనము ఇప్పుడు ముందుకు వెళ్లేలాగా దారి కనిపించకుండా ఎలా దుమ్ము లేస్తున్నదో

దూరము నుండి నక్కలు హో అంటూ ఊల , కుక్కలు చెవులు చిల్లులు పడతాయేమో అన్నట్లుగా మొరుగుతున్నాయి, గుడ్లగూబల హు,హు, హు..... అనే శబ్దంతో, తీతువు పిట్ట అరుపులతో వాళ్ళిద్దరికీ భయం కలగసాగింది

హరి చుట్టు వారికి ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తాయేమోనని భయం భయంగా చూడసాగాడు

బిందు : భయపడుతూ ఏవండి మనం ఇప్పుడు ముందుకు వెళ్ళలేము దారి అస్సలు కనిపించడం లేదు ఎలాగో ఒకలాగా వెనక్కి వెళ్లి ఈ వూరిలో ఎవరో ఒకరి సహాయం తీసుకుందాము పదండి

హరి : భయంతో గట్టిగా అరుస్తూ నువ్వు చెబితే విన్నావా , మువ్వల పాలెంలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అంటే వినలేదు ఇప్పుడు చూడు మన పరిస్థితి ఎలా అయిందో

బిందు : భయాన్ని దాచుకుంటూ మీరు మరీను ఏదో ఈదురుగాలికి దుమ్ము లేస్తూ ఉన్నది అంత మాత్రం దానికి దయ్యాలు ఉన్నాయి అని భయపడితే ఎలా చెప్పండి , త్వరగా ఊరిలోకి నడవండి అంటూ

వాళ్ళ బైక్ అక్కడే వదిలేసి ఇద్దరు గ్రామంలోనికి నడవసాగారు అలా వెళ్తున్నటువంటి వాళ్ళిద్దరికి గజ్జెల చప్పుడు వినిపించింది

ఇద్దరు భయం , భయంగా చుట్టూ చూడసాగారు అయినా వారికి ఏమీ కనిపించలేదు భయం భయంగా త్వరగా ఊరిలోకి చేరుకోవాలి అని ముందుకు నడవసాగారు

వాళ్లు నడుస్తూ ఉంటే వాళ్ళకి దగ్గరగా గజ్జల శబ్దం వినపడసాగినది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని గట్టిగా పట్టుకుని భయంగా ఆగి మళ్ళీ చుట్టూ చూసారు ఎక్కడా కూడా మళ్ళీ వారికి ఆ శబ్దము వినిపించలేదు

బిందు : అదేమిటండీ గజ్జల శబ్దం మనం నడుస్తూ ఉంటే వినిపిస్తున్నది ఆగిపోతే, వినిపించడంలేదు నాకెందుకు చాలా భయంగా ఉంది

హరి : ఆ భయంలో కూడా భార్యని ఓదారుస్తూ , ముందు నీ కాళ్లకు నువ్వు పెట్టుకున్న గజ్జెలు తీసేయి అంటూ తను పెట్టుకున్న కాళ్ళ పట్టీలు తీసేపించాడు

ఆమె పెట్టుకున్నట్టువంటి కాళ్ల పట్టీలు తీసివేసి ఊరిలోకి నడవసాగారు, ఇప్పుడు వాళ్లకు ఎలాంటి శబ్దమూ వినిపించలేదు ఇద్దరూ కాస్త ధైర్యంగా ఊపిరి తీసుకున్నారు

బిందు : నవ్వుతూ మనం ఇద్దరం ఇంతసేపు నా కాళ్ళకు పెట్టుకున్న గజ్జల నుండి వచ్చిన శబ్దం విని భయపడిపోయాము

హరి : నవ్వుకుంటూ నిజమే మనం త్వరగా ఊరిలోకి వెళ్లి , అక్కడ ఎవరో ఒకరు సహాయం తీసుకుందాము అంటూ మళ్ళీ నడక ప్రారంభించారు

వాళ్ళు ఇంకొక నిముషం ఉంటే ఊరిలోకి అడుగుపెడుతారు అనుకునే సమయంలో , ఈసారి గజ్జల శబ్దం మరీ దగ్గరగా వినిపించింది

అంతే ఒక్కసారిగా వాళ్ళిద్దరి గుండె ఆగిపోయినట్లుగా అనిపించింది. భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అక్కడే శిలా విగ్రహాలులాగా నిలబడిపోయారు

బిందు : భయంతో వణికిపోతూ హరిని గట్టిగా పట్టుకుని ఏవండి నేను ఇందాకే కదా నా కాళ్ళకు పెట్టుకున్నటువంటి పట్టీలు తీసి వేసాను , మరి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది

హరి : నువు భయపడకు ఈ సమయంలో ఎవరైనా బయటకు వచ్చి ఉంటారు అందుకే ఆ శబ్దం వినబడుతోంది అంటూ ఉండగానే వారికి ఒక నవ్వు వినిపించినది వాళ్ళిద్దరూ ఆ నవ్వు వినిపించిన వైపు భయం భయంగా చూడగా వారికి ఒక వంద మీటర్ల దూరంలో ఒక అమ్మాయి కనిపించింది 


Rate this content
Log in

More telugu story from Yeddula Chandrakanth

Similar telugu story from Horror