Aditya Chandra Mouli

Tragedy

4.3  

Aditya Chandra Mouli

Tragedy

నిశబ్ధపు చప్పుడు

నిశబ్ధపు చప్పుడు

3 mins
405


టైం : 5:55pm ; place : ప్రపంచం లో ఒకచోట ; person : మొదటి వ్యక్తి.

ప్రొద్దున నుంచి అలసిపోలేదు , ఆకలిలేదు,దాహం లేదు, బయటకు వేల్లబుద్ది అవట్లేదు, ఇంట్లో వుండబుద్ది అవ్వట్లేదు, ఆశ లేదు ,నిరాశలో కూడ లేను, ఒంటరిగా లేను , నాలో వున్నాను, నాతొ వున్నాను.ఆకాశం కూడ నాలానే వుంది,నారంజి రంగులో ఆకశలోనుంచి జారిపోతున్న సురిడ్ని మోస్తూ , రోజు లానే య్లాంటి మార్పు లేకుండ వుంది,నాలానే వుంది,బాల్కని లో ఒక కప్పు వేడి coffee తాగుతున్న నాతొ వుంది , ఇంకో అయిదు నిమిషాలు ఇలానే నాతోనే ఉండబోతుంది.నాలానే , ప్రపంచలో కూడ ఎలాంటి మార్పు లేకుండా, ఏమి జరక్కుండా,ఎప్పటిలానే , ఈ క్షణాలు గడియారపు ముల్లుని మోస్తూ , గడిచిపోతాయ ?

టైం : 5:56pm ; place : ప్రపంచంలో మరోచోట ; person : మరొక వ్యక్తి

నా వెంటపడుతున్నారు, దొరికితే చంపేస్తారు,మా నాన్న car ఇది,ఇదే నన్నీరోజు కాపాడాలి, కాని ఆయనకు నన్నిలా చూడడం ఇష్టం లేదు, నా చేతిలో సిగరెట్వున్న భరించేవాడు కాదు, కాని ఇప్పుడు నాచేతిలో వుంది ఒక మనిషి ప్రాణం తీసిన కత్తి,మా నాన్న నన్నేప్పుడు క్షమించడు. కాని నాకు బాధలేదు, వాడ్ని చంపకుండా బ్రతకడం నావల్ల కాదు, ఎందుకో ఆకాశం కుడా నాలానే వుంది,రక్తంతో కడిగినట్లు ఎర్రగా,మనసుకు చిల్లులో పడేంత భీకరంగా నవ్వుతుంది.రూర్యుడు కుడా నాలానే పారిపోతున్నాడు.కొండల వెనక దాక్కోవడానికి అనుకుంటా ,కాని ఎంతోకాలం కాదు,రంగు మార్చుకుని రేపు తిరిగొస్తాడు,ప్రపంచానికి మళ్ళీ కనిపిస్తాడు.

టైం : 5:57pm ; place: ప్రంపంచంలో వేరొకచోట ; person : మరొక వ్యక్తి

రాక్షసుల్లా వున్నారు , ఒకరి తర్వాత ఒకరు మీదపడుతున్నారు, చేతులు కాళ్ళు కట్టేశారు, ఇప్పుడు నీను మనిషిని కాదు,నాలో వున్న,సిగ్గు,బిడియం,ఆశ,కోరిక,బాధ వీటన్నిటిని ఒకొక్కటిగా చంపేస్తున్నారు.ముందు అమ్మ లా అరిచాను,తర్వాత చెల్లిలా అడుక్కున్నాను,కాని వాళ్ళు దేనికి లొంగ లేదు,నడిరోడ్డుమీద పిచ్చికుక్కలకు దొరికిన మాంసపు ముక్కనయ్యను,ఆకలి తీరెంత వరకు ఆడుకున్నారు,ఇప్పుడు నన్నిలా ఆకాశం కింద నిస్సహాయంగా వదిలి వెళ్ళిపోయారు.ఆకాశం కూడ నాలానే వుంది, మేఘాలన్నీ వేట కుక్కల్లా మీద పడుతుంటే , నిసహాయంగా వాటిమధ్య నలిగిపోయి , ఆస్తమిస్తున్న సూరీడు ,అచ్చం నాలానే వున్నాడు...నాలానే వుంది.

టైం: 5:58pm ; place : ప్రపంచంలో మరొక చోట ; person : మరొక వ్యక్తి

మా అమ్మ నన్ను భుజానేసుకుని ,మండుటెండలో ముక్కు మొహం తెలీని జనాల కాళ్ళు పట్టుకుని,ఒక్కొక్క రూపాయి అడుక్కుని నా కడుపు నింపేటప్పుడు,నాకు తెలీదు అమ్మంటే ఎంటో,తన చీరతో నన్ను కప్పి , రాత్రంతా ,చుంకు వాన నా మీద పడకుంగా గోడలా అడ్డంగా వున్నప్పుడు తెలీదు,నాకు అమ్మంటే ఏంటో,నాకు దెబ్బతగిలితే తను ఏడ్చినప్పుడు తెలీలేదు ,నన్ను ఎవరైనా తిడితేతనకు కోపం వచ్చినప్పుడు అర్ధం కాలేదు,కాని ఈరోజు నువ్వు కదలకుండా పడుకున్నప్పుడు అర్ధంఅయింది,నిన్ను తీసుకెళ్ళడానికి మునిసిపాలిటి బందోచ్చినప్పుడు అర్ధం అయ్యింది .కట్టెల మీద నిన్ను పడుకోపెట్టి ,నా చేత నిన్ను తగలు పెట్టిన్చినప్పుడు అర్ధమయింది,నువ్వు బూడిదల మారిపోయి ఆకాసంలో కలిసిపోయినప్పుడు అర్ధమయిన్దమ్మ నువెవ్వరో. ఆకాశం కూడ నాలానే ఉందమ్మ.అమ్మ లాంటి సూర్యుడ్ని వదులుకుని ,చీకట్లో కలిసిపోతున్న ఆకాశం అచ్చం నాలానే వుంది.

5:59pm ; place : ప్రపంచలో ఇంకో చోట : person : మరొక వ్యక్తి

నేను పుట్టి పదహారేల్లయింది ,కాని ఎందుకో తను పెట్టిన ముద్దుతో ఇప్పుడే నిజంగా పుట్టా అనిపిస్తుంది.ఇంతందంగా ఎలా వుంది,ఆ కళ్ళు నన్ను ముట్టుకున్తున్నాయి,తన శ్వాస నాకు దగ్గరగా తగులుతుంది,నాకేమీ జరుగుతుందో అర్ధం కావట్లేదు .నిన్ను ప్రేమిస్తూన్నా అని చెప్పాలనిపిస్తుంది,కాని చెప్పబుద్ది అవ్వట్లేదు ,ఇంకోక్కసారి తన పెదాలని ముద్దు పెట్టుకోవాలని వుంది,కాని నాలోవున్న్న బెరుకు ,నన్ను వెనక్కు లాగుతుంది,మనసంతా గజిబిజిగా వుంది,కిటికీ బయటున్న ఆకసంకూడా నాలనేవుంది,కొత్తగా ,వెచ్చగా ప్రేమ మైకంలో మునిపోతున్న సూరీడు ,అచ్చం నాలానే వున్నాడు.


6:00pm ; place : ప్రపంచలో ఇంకో చోట : person : మరొక వ్యక్తి

తనలోనుంచి నాప్రాణం బయటకొచ్చింది.ఆడపిల్ల ,బంగారంలా వుంది,ఇప్పటివరకు నీను చూసిన ప్రపంచాల్ అంతా తనకు చూపిస్తా,నా ఆస్తి ,ఆశ నా అనుకున్న నీను ,అన్ని నాకిక నా బంగారమే,ప్రపంచాల్ మొత్తం ఈ విషయం చెప్పాలని వుంది,అస్తమిస్తున్న ఆ సూరీడుని ఆపేసి అరవాలని వుంది,నీకంటే గొప్ప వ్యక్తీ నా ఇంట్లో ఉదయించిందని.ఈ సంధ్యా వర్నాలకన్నా అందంగా మా జీవితాలని మార్చబోతుందని ,చెప్పాలని వుంది.

6:01pm ; place : ప్రపంచలో ఇంకో చోట : person : మొదటి వ్యక్తి

నా చేతిలోవున్న coffee cup వేడిలో కూడ ఎలాంటి మార్పు లేదు.నా జీవితంలానే,రోజులానే ఏ మార్పు లేకుండా సూర్యుడు అస్తమించాడు,నాలాగా ,ఈ ఆకాశం లాగ,ప్రపంచం లో కూడ ఏమి జరగలేదనుకుంట,అంతా అలానే వుంది ,రోజు లానే ఇంకో రోజు గడిచిపోయింది.




Rate this content
Log in

Similar telugu story from Tragedy