నీ తోడు....!!!!
నీ తోడు....!!!!


అమ్మ.... నేను...
నాన్న కోసం అడకండి... నా చిన్నప్పుడు అప్పులకు అధికారుల్ని చేసి.. తిండి వేట అనే ఆట నేర్పి వెళ్ళిపోయాడు... సిటీ లో మేస్త్రి పని చూస్కొని వచ్చి.. మమ్మల్ని తోలుకుపోత అన్నాడు... కానీ ఇంకా దొరక్లేదేమో... ఇప్పుడు నాకు 20 యేళ్లు... నాన్న తోడు లేదు..
చిన్న ఉద్యగంలో చేరాను... పనీ ఎక్కువ ఉండటంతో లేట్ అయింది... ఆడది అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నడిచిన రోజు మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి నట్టు అన్నారు... కానీ రాలేదు అని నాకు ఆ రోజు రుజువు చేసింది... మగాళ్ళ రూపం వేసుకున్నా కొన్ని మృగాలు నా మీద పడ్డాయి...
ఈ వార్త తెలిసిన మా అమ్మ గుండె నాకు మాట కూడా చెప్పకుండా ఆగిపోయింది.. ఇప్పుడు అమ్మ తోడు లేదు..
చెడిపోయిన పిల్ల కి తోడు గా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు... వచ్చిన కొందరు గోడ చాటు తోడు లా ..
సమాజానికి తెలీకుండా తోడు ఉంటాం అన్నారు...
ఇలా పరధ్యానంగా నడిచి వెళ్తున్న నాకు... ఒక చిన్నారి అమ్మా అంటూ నా ముందర కిందపడిపోయిందీ..
ఏ తోడు లేని ఆ పసి దానికి నా తోడు అవసరం అని అనిపించింది...
తోడు అంటే ఒక మగాడే ఉండగలడు అనుకుంటే పొరపాటే... నాకు ఈ చిన్నారి తల్లి తోడు దొరికింది...
ఈ తోడు బాధ్యతలు కూడా నాకు అప్ప చెప్పింది..
అవన్నీ దైర్యంగా చేయగలను అనే నమ్మకంతో ఉన్న...
తనకి బట్టలు కొనాలి ..బాగా చదివించాలి... అమ్మో చాలా పనులు ఉన్నాయి...
వెళ్ళొస్తా....