నాకొక లేఖ
నాకొక లేఖ


గౌరవనీయులు అని పెడదామంటే నువ్వెప్పుడూ నిన్ను గౌరవించుకోలేదు.
ప్రియా అని పెడదామంటే నిన్ను నువ్వెప్పుడూ ప్రేమించుకోలేదు.అందుకే నీకో లేఖ వ్రాస్తున్నా.నిన్ను నువ్వు గౌరవించుకొని ప్రేమించుకునేలా మారాలని.
అందరిలా అందమైన బాల్యం లేదని బాధపడుతూ కూర్చోకు.ఆసరా లేదని చేరగిలపడిపోకు.ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా నీ లక్ష్యాల నుండి విదివడకు.
నీకు సాయం చేసిన వారికి కృతజ్ఞతగా ఉండు.నిన్ను చేతకానివాడు అని భావించే వాళ్లకు నీ విజయం సమాధానం చెబుతుందిలే.
నీకోసం నేను వ్రాస్తున్న ఈ లేఖ జాగ్రత్తగా దాచుకో.
నిన్ను నువ్వు మర్చిపోకు.అవునూ అడ్రస్ ఎవరిది వ్రాయాలబ్బా.
నాకు నేనే వ్రాసుకున్న ఈ లేఖను ఎక్కడ దాచాలబ్బా.