gowthami ch

Drama


3  

gowthami ch

Drama


మరువలేని రోజు

మరువలేని రోజు

3 mins 118 3 mins 118

రాము , శివ , విక్రమ్ చిన్ననాటి స్నేహితులు. ఉండేది ఒకే ఊరు అయినా ఉద్యోగాలు వచ్చి పట్నంకి వెళ్లిపోవడంతో ఒకరినొకరు కోలుసుకోవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా 4 రోజులు సెలవులు చూసుకొని ఇంటికి వచ్చేవారు. అప్పుడు ఒకరినొకరు కలుసుకొని ముచ్చటించుకొనే వారు.


ఒకరోజు ముగ్గురూ కలిసి బయటకి వెళ్తూ ఉండగా "ఏరా రాము ఎలా ఉందిరా నీ కొత్త ఉద్యోగం?" అని అడిగాడు శివ.


"హా.. ఏదొరా అలా అలా జరిగిపోతుంది." అని సమాధానం ఇచ్చాడు రాము.


"ఏరా... ఏం అలా అంటున్నావు. పని ఎక్కువగా ఉందా ఏంటి." అడిగాడు శివ.


"అవునురా ఉదయం వెళ్లినప్పటినుండి సాయంత్రం తిరిగి వచ్చే వరకు క్షణం తీరిక ఉండట్లేదురా. అందుకే తొందరలో ఇంకో కంపెనీ కి మారాలి అనుకుంటున్నాను."


"అవునురా అదే మంచిది అంత వర్క్ ప్రెజర్ ఉన్నా కష్టమే. మంచి నిర్ణయం తీసుకున్నావు." అన్నాడు విక్రమ్.


ఇలా ముగ్గురూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక ముసలావిడ తన కూతురికి ఏదో ఆపరేషన్ చేయాలని అందుకు డబ్బు అవసరం అని ఆ దారిలో వచ్చే వాళ్ళందర్ని అడుగుతూ ఉంది. అలానే వీళ్ళని కూడా అడగడంతో రాము , శివ వాళ్ళకి తోచిన సహాయం చేసారు. విక్రమ్ మాత్రం ఆ అవ్వని చూసి కూడా చూడనట్లు వెళ్లిపోయాడు.


"ఏరా విక్రమ్ నువ్వు ఎందుకు ఏమి ఇవ్వలేదు ఆ అవ్వకి "అని అడిగాడు శివ.


విక్రమ్ నవ్వుతూ "మీరిద్దరూ ఇచ్చారు కదా చాలులేరా నేను ఒక్కడిని ఇవ్వకపోతే ఏమి కాదులే పదండి రా పోదాం."


"అదేంటి రా! అలా అంటావు ఆవిడ ఎంత అవసరం లో ఉందొ ఏంటో పాపం. ఎంతో కొంత ఇచ్చి ఉండవలసింది" అన్నాడు రాము.


"అవునురా.... "అంటూ రాముకి వంత పాడాడు శివ.


"అయినా, అంత అవసరం లో ఉండే ఆవిడకి నేను ఇచ్చే 10 రూపాయలు ఒక పక్కకి కూడా రావు. అలాంటప్పుడు నేను ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమి పెద్ద తేడా రాదు కదా" అన్నాడు విక్రమ్.


"అలా ఎప్పుడూ ఆలోచించకూడదు విక్రమ్.ఎప్పుడూ దేనినీ తక్కువ అనుకోకు , గుడి దగ్గర అడుక్కొనే వారికి మనం వేసేది ఒక్క రూపాయేగా అది వారికి దేనికి పనికి వస్తుంది అని ఆలోచించి వేస్తామా? అలా ఎంతో మంది వేసిన ఒక్కొక్క రూపాయి కలిసి కొన్ని 100 లు గా మారి వారి ఆకలిని తెరుస్తున్నాయిగా.


"అలాంటిది ఆ అవ్వకి మనం ఇచ్చే 10 రూపాయలే కొన్ని వందలు , వేలు అవ్వడానికి ఉపయోగపడతాయి అని ఎందుకు అనుకోవు. ఆపదలో ఉండే వారికి మనం చేసే చిన్న సహాయమైనా వారికి ఎంతో పెద్దదిగా అనిపిస్తుంది.


"అలాంటి అనుభవమే నాకు ఒకటి ఎదురైంది. అది నా జీవితంలో మరచిపోలేనిది. ఎప్పుడు తలుచుకున్నా ఎంతో ఆనందంగా ఉంటుంది."అన్నాడు రాము.


శివ ఆత్రంగా "ఏంటి రా అది మాకు ఎప్పుడు చెప్పలేదు."


"అది నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో జరిగిందిరా. బహుశా మీకు చెప్పడం మరచిపోయుంటాను. మీకు తెలుసు కదా , నాకు ఎప్పటినుండో ఎవరికైనా సహాయంచేయాలి అని కోరిక ఉండేదని. అందుకే నాకు ఉద్యోగం రాగానే నిశ్చయించుకున్నాను నాకు వచ్చే జీతంలో ఎంతో కొంత అవసరంలో ఉన్నవాళ్ళకి ఇవ్వాలని. అప్పుడు నాతో పనిచేసే ఒక అబ్బాయి make a wish లో పనిచేసేవాడు. అతడికి నా కోరిక గురించి వివరించి, నీకు తెలిసి ఎవరికైనా డబ్బు అవసరం అయితే నాకు చెప్పమని చెప్పాను. ఆ తరువాత ప్రతి సంవత్సరం కొంత డబ్బు పోగేసి ఆ డబ్బు మొత్తాన్నీ నాపుట్టిన రోజునాడు అవసరంలో ఉన్నవాళ్ళకి సహాయం చేస్తూ వచ్చాను . అలా అనుకున్న తరువాత నామొదటి సహాయం ఒక చదువుకునే అబ్బాయికి ఆత్యవసరం అని చెప్తే , డబ్బు పంపాను. తను ఎవరో కూడా నాకు తెలియదు. డబ్బుఅందిన వెంటనే అతను నాస్నేహితుడితో నాకు ధన్యవాదాలు చెప్పమన్నాడు అంట. కానీ నాస్నేహితుడు ఆ ధన్యవాధాలు నాకే నేరుగా చెప్తే బాగుంటుందని ఊహించి అతనికి నామొబైల్ నెంబర్ ఇచ్చాడు. అప్పుడు తను నాకు ఒక మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన తరువాత నా ఆనందానికి అవధులు లేవు. నాకే తెలియదు తన కి అంతగా నాడబ్బు ఉపయోగపడింది అని. తరువాత అప్పటినుండి ఇప్పటివరకూ అది అలానే కొనసాగిస్తున్నాను. అప్పుడే తెలిసింది ఇవ్వడంలో కూడా ఇంత ఆనందం వుంటుందా అని. దానికి ముందుగా నా స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.


జీవితంలో నేను మరచిపోలేని రోజులు చాలా ఉన్నాయి కానీ ఇది మాత్రం ఎందుకో నా జ్ఞాపకాలలో అలా నిలిచిపోయింది." అంటూ ఆ రోజుని గుర్తు చేసుకొని ఆనందించాడు.


Rate this content
Log in

More telugu story from gowthami ch

Similar telugu story from Drama