kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం (3వ భాగం)

మనసు చేసిన న్యాయం (3వ భాగం)

3 mins
10


మనసు చేసిన న్యాయం (3వ భాగం)

పల్లవి మేడం గారికి నా వివరాలన్నీ ఇచ్చాను. ఆమె అన్ని వివరాలు నా ఫోన్ నెంబర్ తో సహా డైరీలో నోట్ చేసుకున్నారు.

అంకుల్ నైట్ డ్రెస్సులో వచ్చి సోఫాలో కూర్చున్నారు.

అంకుల్ తో అన్నాను.

"పదిహేను ఏళ్లలో పూర్తయ్యే ఒక లక్షరూపాయల పాలసీ చేస్తాను అంకుల్.

నేను రేపటి నుంచి తెలుగు లలిత కళా తోరణంలో ప్రారంభమయ్యే సి సి ఆర్ టి శిక్షణాకార్యక్రమానికి వచ్చాను అంకుల్. 21 రోజులు అక్కడే ఉంటాను. మిమ్మల్ని చూసి ఎంతో కాలం అయిందని ఈ విధంగా అయినా మిమ్మల్ని చూసే అవకాశం వచ్చిందని చూడటానికి వచ్చాను."

"అలాగా.నేను అడిగిన వెంటనే కాదనకుండా పాలసీ చేసినందుకు చాలా సంతోషం వైభవ్" అన్నారు అంకుల్.

ఈలోగా ఆంటీ నేను తీసుకొచ్చిన స్వీట్, హాట్ లక్ష్మి చేత ప్లేట్లలో ట్రేలో తెప్పించారు.

"ఇవెక్కడివోయ్.పైగా నాకిష్టమైన బెల్లం జిలేబి, కలాకండ్, బూందీ మిక్చర్..."అన్నారు జిలేబి తీసుకుని ముక్క కొరుకుతూ.

వైభవ్ పని అన్నట్టు ఆంటీ నాకేసి, అంకుల్ కేసి చూసారు.

"ఉత్తచేతులతో పెద్దల దగ్గరకు వెళ్లకూడదని నేనే తెచ్చాను అంకుల్.ఏమీ అనుకోకండి ప్లీజ్. "అన్నాను బ్రతిమలాడుతున్నట్టుగా.

"ఒకే.నువు గృహస్తుడివి అయ్యావుగా.నో ప్రాబ్లెమ్"అన్నారు.

నాకు చాలా చాలా ఆనందం అనిపించింది.

"మేడం.మీకు దగ్గర ఫారమ్స్ సిద్ధంగా ఉంటే నేను ఇపుడే సంతకాలు పెట్టేస్తాను. మీకు కావలసిన ఫోటోస్టాట్ కాపీలు పోస్ట్ లో తెప్పించి అందచేస్తాను."అన్నాను.

"ఒకే.షూర్ అండి."అని తన బాగ్ లో సిద్ధంగా ఉన్న కాగితాలు తీసుకుని నాచేత పూర్తిచేయించి సంతకాలు తీసుకుంది పల్లవి.

ఆమె రెండు విజిటింగ్ కార్డులు నాకు ఇస్తూ అంది.

"ఈ మొదటిది నా ఆఫీస్ విజిటింగ్ కార్డ్ సర్.ఈ రెండవది మీ ఏజెంట్ గారి విజిటింగ్ కార్డు.అందులో చిరునామా నా ఇంటిదే.ఆ ఇంట్లోనే వారు అద్దెకు ఉంటున్నారు.మీకు ఏ అనుమానం వచ్చినా నన్నుగాని, ఆమెను గాని కాంటాక్ట్ చేయవచ్చు.సరే చిన్నాన్న.అమ్మ నిరీక్షిస్తూ ఉంటుంది.నేను వెళ్ళిరానా మరి?"అంటూ లేచింది పల్లవి.

"ఒకే అమ్మా.వెళ్ళిరా."పల్లవి అందరికి చెప్పి వెళ్ళిపోయింది.

ఇంతలో నాకు ఫోన్ వచ్చింది. బయటకు వచ్చి మాట్లాడి లోపలికి వెళ్ళాను.మా మండలంలోని ఉపాధ్యాయుడు తాను లలిత కళాతోరణం వచ్చానని, అడ్మిషన్ చేసుకుని,రూమ్ కేటాయించారని, రూంలో తనతో ఇద్దరే ఉన్నారని, ఇతర రాష్ట్రాలనుంచి ఒక్కొక్కరే వస్తున్నారని, నన్ను కూడా తొందరగా రమ్మని ఆ ఫోన్ సారాంశం.

"సరే.నేను వెళ్ళొస్తాను అంకుల్."అంటూ లేచాను.

"మరో మాట మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళు. శుభా.వంట అయిందా?"

"అయిపోయింది.వచ్చేస్తే వడ్డించేస్తాను."ఆంటీ చెప్పారు.

"పద వైభవ్."అంటూ వాష్ బేసిన్ దగ్గరకు నడిచారు అంకుల్.నేను అనుసరించాను.

భోజన సమయంలో మాట్లాడటం అంకుల్ కి ఇష్టం ఉండదు.మౌనంగానే చేస్తూ మజ్జిగలోకి వచ్చాను.

ఆంటీ కమ్మటి మీగడ పెరుగు వేశారు. చివ్వున తలెత్తి చూసాను.

"అంకుల్ కి ఇష్టం కదా ఆంటీ."అని గుర్తుచేసాను.

"ఆరోజులు పోయాయి వైభవ్.అలా తినేసి 120 కేజీలు అయిపోయాను. ఇపుడు అంతా ఫైబర్ ఫుడ్ మాత్రమే.ప్రస్తుతం 85 మైంటైన్ చేస్తున్నాను."ఆ ఒక్క మాట మాట్లాడారు అంకుల్.

భోజనం పూర్తి అయింది. హాల్లో సోఫాలో కూర్చున్నాం.

"అంకుల్. ఒక్క విషయంలో మీ అనుమతి కోరుతున్నాను."

"నా వివాహానికి వస్తారని అమ్మ, నేను చాలా ఆశ పడ్డాము. నాన్నగారు చాలా ఎదురుచూశారు. మీ దగ్గరున్న మూడు నెలలు నేను ఎన్నో అంశాలలో ఖచ్చితత్వం ఎలా పాటించాలో నేర్చుకున్నాను.నా కష్టార్జితంతో చంద్రునికి ఓ నూలుపోగులా మీ దంపతులకు బట్టలు పెట్టుకోవాలి అన్నది నా 15 సంవత్సరాల ఆశ.ఆశయం కూడా.కాబట్టి మీరు అనుమతించాలని కోరుతున్నా అంకుల్."అంటూ మోకాళ్ళమీద అంకుల్ ముందు మోకరిల్లాను.

"అరె.ఏంటిది వైభవ్...ఇలాంటివి నాకు నచ్చవని నీకు తెలుసుకదా.ముందు నువు పైకి లే."అన్నారాయన.

"ప్లీజ్ అంకుల్.ఆంటీ.మీరైనా చెప్పండి ఆంటీ."అన్నాను ఆంటీతో.

"ఇదే మొదటిసారి..ఇదే ఆఖరుసారి వై భవ్ మరి.ఇంకోమారు ఇలా వస్తే తనకు నచ్చదు.బాగా గుర్తుపెట్టుకో.సరేనా?"అన్న ఆంటీ నేను తలా ఊపడం చూసి సోఫాలో అంకుల్ పక్కన వచ్చి కూర్చున్నారు.

"ఈ ఒక్కసారి ఒప్పుకో.అతని తరపున నేను అడుగుతున్నాను.ఒక సాంప్రదాయకమైన పెద్దరికం మనకు ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించడంలో కూడా ఆనందం ఉంటుంది బాబా.ప్లీజ్."అంకుల్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసారు.

"సరే. వైభవ్.ఒప్పుకుంటున్నాను."

నేను నా బ్రీఫ్-కేస్ లోంచి బట్టలు అంకుల్ కి, ఆంటీకి చేతులలో పెట్టి అక్షింతలు ఇచ్చి మనస్ఫూర్తిగా వారి కాళ్లకు నమస్కరించుకున్నాను.

వారు అక్షింతలు వేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన సంతృప్తి చెందిన మనసుతో పైకి లేచాను.

"నీ కోరిక తీరింది కదా.అన్నట్టు నీ ట్రైనింగ్ లో ఆదివారం సెలవు ఇస్తే సరదాగా ఓ ఆదివారం భోజనానికి రా."అన్నారు అంకుల్.

"తప్పకుండా వెళ్ళేలోపు వస్తాను అంకుల్.ఇక నేను బయల్దేరతాను."అని చెప్పి లగేజ్ తో బయల్దేరాను.

మరో పదినిమిషాలలో నాంపల్లివైపు పరుగెత్తుతున్న నేను ఎక్కిన ఆటోవేగంతో పోటీ పడుతూ అంకుల్ ఇంట్లో టీపాయ్ మీద చూసిన ఫొటోలో ఆవిడ ఎవరా అని ఆలోచన ముందుకు ఉరుకుతూనే ఉంది.

నేను కౌంటర్ లో రిపోర్ట్ చేసి నా రిలీవింగ్ సర్టిఫికేట్ అన్ని వారికి అందచేశాకా వారు తెలుగు రాష్ట్రాల వారికి కేటాయించిన రూంలోకి చేరాను.

ఇందాక నాకు ఫోన్ చేసిన అతని రూమే.తనపక్కనే నాకు కిటికీ దగ్గరగా ఫాన్ కింద ప్లేస్ సిద్ధంగా ఉంచాడు.

హాయిగా పక్క పరుచుకుని స్థిరపడిపోయాను.హాల్లో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ కబుర్లలో పడిపోయాను.

భోజనానికి రమ్మంటే అయిపోయిందని చెప్పి పక్కమీద నడుం వాల్చాను.

వద్దన్నా హైద్రాబాద్ లో 15 సంవత్సరాల క్రితం అడుగు పెట్టిన మొదటి రోజునుంచి జరిగిన సంఘటనల సాలెగూడులో తిరగడం మొదలుపెట్టాను.

(మిగతా 4 వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama