kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 10 వ భాగం

మనసు చేసిన న్యాయం - 10 వ భాగం

3 mins
12


మనసు చేసిన న్యాయం - 10 వ భాగం 


అత్తయ్యగారు వెళ్లిపోయాకా వదిన అమ్మ చేతులు పట్టుకుని ''నన్ను క్షమించండి అత్తయ్యా...అమ్మకి తనమాటే నెగ్గాలనుకునే పంతం ఏమిటో గానీ నాన్నగారిని కూడా ఇంట్లో ఒక్కమాట మాట్లాడనివ్వదు. ఒకవేళ ఏదైనా తనకిష్టం లేకుండా జరిగితే అన్నం తినడం మానేయడం, లేదా చేతికందిన వస్తువులు విసిరేయడం చేస్తుంది. అలా అని ఒకసారి సైక్రియాటిస్టు దగ్గరకు తీసుకెళ్తే 'నాకు పిచ్చి అనుకున్నారా..ఇక్కడకు తీసుకువచ్చారు? అసలు నన్ను పరీక్ష చేసే మొనగాడెవడో రమ్మను..ఈవేళ నాకు పిచ్చో వాడికి పిచ్చో తేలిపోవాలి అంటూ టేబుల్ మీద నున్న పేపర్ వైట్ తీసిందట. దాంతో ఆ డాక్టర్ ' తనమాట చెల్లి తీరాలి' అనే పిచ్చి తప్ప మీ ఆవిడకు నిజంగా పిచ్చి లేదు నాయనా...అన్నీ ఆవిడకు తెలిసే కావాలని చేస్తోంది ఆవిడ.''అని సాష్టాంగ పడిపోయాడట. మీకు అమ్మ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను.'' అంది 


''నా బాధ అది కాదమ్మా.. చక్కగా నీ సంసారం నువ్వు చేసుకుంటుంటే చక్కగా వచ్చి మంచీ చెడులన్నీ మాట్లాడుకుని మాకు గౌరవం ఇచ్చి తానూ గౌరవం పొంది వెళ్తే ఎంతబాగుంటుందీ చెప్పు? ఈ పెళ్ళికి మునుపు మేము ఎక్కడున్నదీ ఎవరికీ తెలియనంత మర్యాదగా బ్రతికాం. ఏమీ లేనిదానికి ఈవేళ బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. చుట్టుపక్కల అందరూ మమ్మల్ని  నేరస్తుల్లా చూస్తుంటే బాధగానే ఉందమ్మా విజయా.'' అంది అమ్మ కన్నీళ్లతో.


''తప్పు అత్తయ్యా...నిండు ఇంట్లో మీలాంటి ముత్తైదువ కన్నీళ్ళేట్టుకోవడం శుభం కాదు. ఈ మూడు నెలలు తాను రానంది కదా. తరువాత నేను పురుటికి ఎలాగూ వెళ్తాను కాబట్టి సమస్య ఉండదు. మన ఇంటికి అప్రతిష్ట తీసుకువచ్చే పని ఏదీ నావల్ల ఇక జరగకుండా చేసుకుంటాను. అందుకే అన్నిటికీ తాళాలు వేసేస్తున్నాను. లేకపోతే పెట్టె, బీరువా అన్ని కెలికేసి తనకేది నచ్చినా తీసుకుపోయేదే.'' అంది వదిన. 


అన్నయ్య, నాన్నగారు వచ్చి భోజనాలు చేసాకా జరిగింది చెప్పింది అమ్మ. 


నాన్నగారు ఆలోచనలో పడ్డారు గానీ అన్నయ్య ఆవేశం ఆపుకోలేకపోయాడు.


''అసలు ఏమనుకుంటోంది ఆవిడ? తప్పులన్నీ తనదగ్గర పెట్టుకుని, పైగా మన ఇంటికి వచ్చి మనతో ఎదురెట్టి మాట్లాడటం ఏమీ బాగోలేదు నాన్నగారు...ఆవిడ చాలా తెలివైంది నాన్న...మన తప్పు చేసాం అని అందర్నీ నమ్మించి, తన కూతురికి మనమేదో అన్యాయం చేసామని నిరూపించే ప్రయత్నం ఏదో చేస్తోంది ఆవిడ అని నా అనుమానం. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించకపోతే, తరువాత ఏం అనుకున్నా ప్రయోజనం లేదు.'' 


''ఆ ఇంటి యజమాని వస్తే పద్ధతిగా మాట్లాడవచ్చురా...ఏ పద్ధతీ లేని ఆడదానితో ఏం మాట్లాడతాం? ఏది మాట్లాడినా వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేసే రకం ఆ మహా ఇల్లాలు. అతనికి మంచి పేరు, చక్కటి ఉద్యోగం, ఉంది. నగరంలో ఉంటున్నారు...హుందాతనం, చదువు సంస్కారం గల కుటుంబం అనుకున్నాము గానీ...ఇవన్నీ నడమంత్రపు సిరి లక్షణాలు అని తెలియలేదు. అయినా మీ ఇద్దరూ ఒక్క మాటగా, సుఖంగా ఉంటే అదే చాలు.'' అన్నారు ఆయన.


'' మీకున్నంత ఓర్పు సహనం నాకు లేవండీ..మనుషుల మీద అభిమానం పెంచుకునే పెరుగుతుంది.తెంచుకుంటే తెగుతుంది. పెంచుకున్న అభిమానం తెంచుకునేలా ప్రవర్తిస్తే మాత్రం నాది బాధ్యత కాదు. వాళ్ళని మీరు క్షమించినంతగా నేను క్షమించలేను. మీ అంత విశాల హృదయం నాకు లేదు.''అనేసి అన్నయ్య లోపలి వెళ్ళిపోయాడు. 


ఊహించని తుఫాను మళ్ళీ మూడు నెలలవరకు రాదు కదా అని  పదిహేను రోజులు అందరం ప్రశాంతంగా ఉన్నాం. తొందరలోనే వస్తుందని మేము ఊహించనే లేదు. కానీ వచ్చేసింది.


నెలదాటాకా రానే వచ్చేసింది. ఈసారి పెళ్లి కుదిర్చిన పెద్దలతో.


********


ఈసారీ ఆదివారమే.. ఆదివారమే ఆవిడకు గొడవలకు అచ్చొచ్చిన రోజేమో మరి.


నాన్నగారు, అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు.


మావయ్యగారు,అత్తయ్యగారు, అత్తయ్యగారి నాన్నగారు, పెళ్లి కుదిర్చిన అత్తయ్యగారి పెదబావగారు నలుగురూ వచ్చారు.  వారందరినీ సాదరంగా ఆహ్వానించారు నాన్నగారు, అన్నయ్య. 


వాళ్ళ అందరినీ చూసి నాన్నగారు, అమ్మ చాలా సంతోషించారు. వాళ్లంతా అమ్మతరపు బంధువులే.నాన్నగారికి ఆత్మీయ మిత్రులే. అమ్మ, వదిన సాధారణ మర్యాదలన్నీ చేశారు. 


''అమ్మాయి విజయా...ఇలా దగ్గరగా రామ్మా.. నీళ్లోసుకున్నావట. చాలా సంతోషంగా ఉందమ్మా.'' అన్నాడు వదిన తాతయ్య. వదిన ఆయన కాళ్లకు నమస్కరించింది. 


అలాగే వదిన మిగతా పెద్దలకి నమస్కరించింది. తాము తెచ్చిన పూలు, పళ్ళు స్వీట్స్ అన్ని వదిన చేతుల్లో పెట్టి బొట్టు పెట్టారు అత్తయ్యగారు. 


వాటిని అమ్మ తీసుకుని బల్లమీద పెట్టింది.


మావయ్యగారు వదినను గుండెలకు పొదువుకుని '' బంగారూ...నన్ను...నన్ను తాతను చేస్తున్నావామ్మా?'' అని కళ్ళు చెమర్చగా వదిన తలమీద ముద్దుపెట్టుకున్నారు. రెండునిముషాలు అలాగే ఉండిపోయారు. దాదాపు పెళ్లయిన నాలుగు నెలల తరువాత చాలా రోజులకు చూశారేమో ఆయనకు కన్నీళ్లు ఆగలేదు కాబోలు. కళ్ళజోడు తీసుకుని కళ్ళు తుడుచుకున్నారు రుమాలుతో. 


అంతే!


అత్తయ్య గారు అందుకుంది. ''నేను మీకు ఇంటి దగ్గరే హెచ్చరించాను. ఆడపిల్లను ఇచ్చుకున్నందుకు వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా కాపురం చేసుకుంటూ అదే ఓర్చుకుంటోంది. మీరెందుకు బాధపడతారు..ఊరుకోండి. ఏంచేస్తాం. ఇదంతా దాని తలరాత ...మన ఖర్మ. '' అంది చీరకొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. 


''ఏమిటయ్యా గంగాధరం...మా అమ్మాయి మీరేదో విజయని కష్టపెడుతున్నారని...అడిగినందుకు తనని మీ ఇంట్లో అందరూ తలో మాటా అన్నారట..ఇంటి పెద్దగా నీతో చెప్పుకుంటే నువ్వేమీ పట్టించుకోలేదట. ఆడవాళ్లు ఏదోఒకటికి ఒకటి అనుకుంటారు అనుకో. అవి వాళ్ళ మధ్యే సమసిపోతే సరి. మరి ఇంటి పెద్ద నీదాకా వచ్చినా పట్టించుకోకపోవడం నాకు బాధ అనిపించిందబ్బాయ్.'' అన్నాడు వదిన తాతగారు. 


''అయితే మీకు ఇక్కడ జరిగినదంతా చెల్లాయి మీతో చెప్పిందన్నమాట. పెద్దవారు ..మీరు ఈవిషయం మా ఇంటికివచ్చి అడుగుతున్నారంటే విషయం పూర్తిగా తెలుసుకోవాలని వచ్చారన్నమాట. మా కుటుంబంలో అందరూ తలో మాట అన్నామని మీరు నమ్మాకా,మేము ఏంచెప్పినా మీరు నమ్మరు.నమ్మలేరు. ఇక మా ఇంటికి కాపురానికి వచ్చింది మీ మనవరాలు. ఆ అమ్మాయిని ఏం జరిగిందో చెప్పమనండి. ఎందుకంటే కష్టపెట్టినవాళ్ళం మేమని ఆరోపిస్తున్నారు. అంటే కష్టాలు పడింది మీ అమ్మాయేగా ... తనను చెప్పమనండి. పూర్తిగా వినండి. అపుడు చెప్పండి మీ సమాధానం.'' అన్నారు నాన్నగారు సీరియస్ గా. 


''అదేం చెబుతుంది నాన్నా...ఏం చెప్పినా వాళ్ళతరఫునే చెబుతుంది...అలా మార్చేశారు దాన్ని.ఇదిగో చూడండి దాని వొంటిమీద వాత...'' అంది అత్తయ్యగారు వదిన మోచెయ్యి చూపిస్తూ !

(మిగతా 11 వ భాగంలో!)



Rate this content
Log in

Similar telugu story from Drama