మెకానిక్ మహేష్
మెకానిక్ మహేష్


ఒక ఊరిలో మహేష్ అనే మెకానిక్ ఉండేవాడు అతనికి రోజు ఒక రిపేర్ కి కారు వస్తుండేది . ఆ కారుని రిపేర్ చేస్తే అతనికి 500 రూపాయలు వచ్చేవి ఒకరోజు రమేష్ అనే వ్యక్తి మెకానిక్ షెడ్ కి వచ్చి ఇలా అన్నాడు నా దగ్గర ఒక కారు పనిచేయకుండా పడి ఉంది దానిని నీకు అమ్ముతాను కొంటావా అని అడిగాడు .
అప్పుడు మహేష్ బాగా ఆలోచించి సరే అన్నాడు రమేష్ కారు ని తీసుకొని వచ్చాడు అది చాలా పాత కారు దానిని మహేష్ రెండు వేల రూపాయలకి కొన్నాడు దానిని బాగా పరిశీలించి దానిని రిపేరు చేయడానికి పూనుకున్నాడు మహేష్ దాని కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు చాలా శ్రమించాడు దానిని వ్యవసాయం పనులకు ఊరికి వెళ్లడానికి ఉపయోగపడేలా తయారు చేశాడు మహేష్ ఆ కారుని చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు దాన్ని తన తండ్రి వ్యవసాయం పనులకు కూడా ఉపయోగించేవాడు మహేష్ ఒకరోజు ఆ మెకానిక్ షెడ్ కి ఒక డబ్బు ఉన్న వ్యక్తి వచ్చాడు మహేష్ నీకు చాలా తెలివి ఉంది నువ్వు ఇలా ఇలాంటివి చాలా తయారుచేయు అని అన్నాడు అప్పుడు మహేష్ కుదరదు ఈ ఒక్క కారు కోసం నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను నా వల్ల కాదు అని అన్నాడు డబ్బు ఉన్న వ్యక్తి ఎంత పెట్టుబడి అయినా సరే నేను పెడతాను అని మహేష్ కి నచ్చచెప్పాడు .
మహేష్ తన తెలివిని ఉపయోగించి చాలా కారు ని తయారు చేశాడు ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టారు ఆ కంపెనీకి ఓనర్ మహేష్. ఏ మనిషైనా ఇష్టమైన ఉద్యోగం లో కష్టపడి పని చేస్తే అతనికి ఓటమి అనేది ఉండదు.