Kavya Ramu

Drama

3.8  

Kavya Ramu

Drama

మౌన సంఘర్షణ

మౌన సంఘర్షణ

6 mins
509


అవని,ఆకాష్ లు అందరికి ఆదర్శమైన చూడముచ్చటైన జంట.

వాళ్ళ పేర్లకు తగ్గట్టుగానే అవని ఎంతో సహానశీలి, ఓపికస్తురాలు. అత్తమామలంటే ఎనలేని గౌరవం. ఇంట్లో అన్నింటిలో , అందరి విషయాల్లో చెదోడువాదోడు గా మెదిలేది. 

ఆకాష్ విశాల హృదయం ,మంచి మనస్సు కలిగిన వాడు,అందులో అవని అంటే ఆకాశమంత ప్రేమ.

ఉద్యోగ రీత్యా ఆకాష్ కి దూరం అవడంతో  ఆఫీసుకి దగ్గరగా వుండే  ఒక అపార్ట్మెంట్ ని చూసుకొని కుటుంబమంతా అందులోకి మకాం మార్చారు.

అక్కడ అందరూ ఉద్యోగస్తులు కావడం చేత బయటికిి వచ్చిన కూడా మాట్లాడే మనుషులు ఉండరు. 

ఎవరి గోల వారిదే అన్నట్లుగా ఉండే అనురాగం,ఆప్యాయతలు లేనట్టి, ఈర్ష్య అసూయలతో నిండి,సంతృప్తి లేని జీవితాలతో వెల వెల బోయిన రంగుల ప్రపంచం అది.

అవని బాగా చదువుకున్న అమ్మాయే అయినప్పటికిని ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఏ లోటు లేకపోవడంతో తను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయింది.

కానీ అవని వాళ్ళు ఉన్న చుట్టూ పక్కల ఊళ్ళోనే అందరూ దగ్గరి బంధువులే ఉండడంతో 24 గంటలు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. వారికి చేయాల్సిన అతిథి మర్యాదలు కూడా ఎలాంటి లోటు లేకుండా చేస్తూ ఉండేది అవని....అలా అవనికి విరామ సమయం అంటూ ప్రత్యేకించి ఉండేది కాదు.

                

                 ***

ఆకాష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుండే వాడు. ఇంకా ఓవర్ టైం చేయాలి అని పై వాళ్ళ నుండి ఆంక్షలు రావడంతో ఇంతకుముందు కన్నా ఎక్కువగా ఆఫీసులో పని ఒత్తిడి మూలాన ప్రొద్దున్నే వెళ్లి, ఏ అర్థ రాత్రో వచ్చేవాడు.

పెళ్ళైన తొలి నాళ్ళలో తప్ప ఆకాష్ తనని బయటికి తీసుకెళ్లిన సందర్భం లేదు. ఏది కావాలన్న అన్ని వసతులు ఇంట్లోనే సమకూర్చేవాడు. 

ఆకాష్ తో బయటికెళ్లాలి,సరదాగా గడపాలి అనే చిన్న చిన్న సంతోషాలను అవని కోరుకునేది.

ఆకాష్ పని ఒత్తిడిలో పడి అవని గురించి పట్టించుకోవడమే మానేశాడు. అలా కొద్దీ రోజులు గడిచిపోయాయి.

ఆమె మదిలో ఎన్నో ఆశలు,చిన్న చిన్న సంతోషాలు అన్ని ఎండమావిలా మారిపోసాగాయి.

కుటుంబమంతా చుట్టూ ఉన్నప్పటికంటే తన భర్త తనని పట్టించుకుంటూ తన పక్కన ఉన్న క్షణం కలిగే ఆనందం అనిర్వచనీయం. 

తనలోని చిన్న చిన్న సంతోషాలు అన్నింటినీ చెప్పాలనుకొని ఆకాష్ పరిస్థితిని చూసి మౌనంగా ఉండిపోయేది. ఇంకా ఇంతే ఎప్పటికి అని అవని తన పనిలో తను నిమగ్నమైపోయేది.

కొద్ది నెలలు గడిచాక పని భారం తగ్గుతుండడంతో ఆకాష్ కి కొంత ఊరట దొరికినట్లైంది.

               *****

అవని......అవని...... అంటూ ప్రేమగా పిలుస్తూ తన కోసం వెతుకుతుండగా వంట గదిలో ఉన్న అవని దగ్గరికి వెళ్లి చిరునవ్వుతో పలకరించబోయాడు.

ఏవండి.... వచ్చారా(నిట్టూర్పుగా)..!!! రండి భోజనం చేయండి వడ్డిస్తాను అని వడ్డించి భోజనం పూర్తయ్యే దాకా ఉండి షరా మాములుగా తన పనిలో తను పడిపోయింది.

ఇదంతా కొద్దీ నెలలుగా జరుగుతున్న విషయమే కానీ ఆకాష్ ఇంతలా పట్టించుకున్న సందర్భం లేదు. కొత్తగా అన్పించింది అతనకి.

అవని వచ్చేసరికి ఆకాష్ తన వర్క్ టెన్షన్ లో మునిగిపోయేవాడు. అలా అతనికి ఏ పట్టింపు ఉండేది కాదు.

తనలో ఒక మార్పును గమనించడం మొదలుపెట్టాడు. చేసిన పనే చేయడం, అదే పనిగా ఏవో ఆలోచనలో మునిగి పోవడం..... తన లొనే తను మదన పడడం , అప్పుడప్పుడు ఎవరికి సంబంధం లేనట్టు ప్రవర్తించడం ఇలా తనలో విపరీతమైన మార్పులను గమనించసాగాడు.

తనను తనే అనుకోవడం, స్తబ్దత గా ఉండిపోవడం అన్ని గమనిస్తూనే ఉన్నాడు. క్రమేణా ఈ పరిస్థితి తీవ్రస్థాయినే చేరుకుంది.

                 :::~:::

రోజులాగానే అవని రాత్రి 11 గంటలకి వంటగదిలో పనులన్నీ ముగించుకొని వచ్చి పడుకుంది. ఆకాష్ ఎదురుచూస్తూ ఉన్నాడు తనతో కాసేపు మాట్లాడాలి అని కానీ కుదరలేదు.

మరుసటి రోజున కూడా అంతే....... చాలా మామూలుగా, ఇంకా మౌనంగా ఉండేది. ఆకాష్ కి ఏం అర్థం అవ్వలేదు,ఎన్నో ఆలోచనలు మదిలో మెదలడం మొదలైయాయి. 

కుటుంబంలో అందరితో కలివిడిగా ఉండే తను నాతో మాత్రమే ఎందుకిలా ఉంటుంది అని రక రకాలుగా ఆలోచనలు చేయడం , అవని మౌనం ఆకాష్ కి అంతుచిక్కని సమాధానంగా తోచింది.

                *****

వారం గడిచింది పరిస్థితి లో ఏ మార్పు లేదు.

ఆకాష్ మనస్సు లో బాధ ,అవని పై ప్రేమ రెండు పెరుగుతూనే ఉన్నాయి.

                 

                 ****

 యథావిధిగా అవని పనులు పూర్తిచేసుకుని రావడంతో,

ఆకాష్ తనతో..... 

అవని.....!!! ఎందుకీ మౌనం.....??? బాధ్యతగా నాకు చేయాల్సిన పనులు తప్ప అందులో ప్రేమగా ఉన్న క్షణం లేదు....??

ఎందుకు.....???

నేను ఎంత ప్రయత్నించినా నా ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.....?? అంటూ తన బాధను వ్యక్తం చేసాడు ఆకాష్.

ఇన్ని రోజులుగా మనస్సులో తను పడుతున్న మనోవేదనకు సాక్ష్యంగా కళ్ళనుండి దారాలంగా ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ .....

అవని : ఆకాష్......!!! వారం రోజుల నా మౌనం నిన్ను పరిపరి విధాల ఆలోచనలతో , అర్థం కానీ సంశయంలోకి నెట్టేసింది. మనస్సు విప్పి మాట్లాడే క్షణం కోసం నువ్వు పడే ఆరాటం, నా కోసం వెతికే నీ కళ్ళు అన్ని చూస్తూనే ఉన్నా......


కొన్ని రోజుల మౌనమే నువ్వు భరించలేకపోయావ్.


పెళ్ళైన ఇన్నీ నెలల్లో ఏ రోజు నా గురించి ఆలోచన , చిన్న పలకరింపు కూడా లేదే.... ఎందుకు???

ఇన్ని రోజులనుండి నీ పలకరింపు కోసం వేచియున్న క్షణాలు ఎన్నో......!

 కనీసం  తిన్నావా.....??? అని అడుగుతావని ఆశగా ఎదురుచూసిన సందర్బాలెన్నో......!!

నీ చిన్న చిరునవ్వుతో నా లోని అలసట అంతా దూరం చేసిన ఆ నవ్వు మాయమై ఎంత కాలమైందో....!!!! 

ఆ నవ్వు కోసమే నా ఈ ఎదురుచూపు.....!!!

నా పై ప్రేమ, పట్టింపు, భాద్యత అంతా మనం ప్రేమించుకున్న జ్ఞాపకాల్లోనే తీపి గుర్తులుగానే మిగిలిపోయాయి.

 తొలి చూపులోనే మైమరిపించిన నీ చిరునవ్వు ఇప్పుడు ఏమైంది.....!!!!

గలగలా మాట్లాడే నీ మాటల ప్రవాహం మాయమై మన మధ్య నిశ్శబ్దం మాట్లాడుతుంది.  

ఒత్తిళ్లు, భాద్యతలు నీతో సమానంగా నాకు ఉంటాయి. ఏ క్షణంలోను నా ఉనికిని నువ్వు గుర్తించలేకపోయావా???

ఏ చిన్న సంతోషాన్ని పంచుకోవాలని అనిపించినా ఆ క్షణం నువ్వు నా పక్కన ఉండవు, ఒక వేళ ఉన్నా నీ ఆలోచన నీకే.....!!!!! 

సూర్యోదయం లేచింది మొదలు చందమామను మేల్కొలిపే వరకు అందరికి అన్ని సపర్యలు చేస్తూ , ఏ లోటు లేకుండా చూసుకుంటూ.......       వచ్చే నా అలసట అంత నీ చిన్న పలకరింపుతో.......మర్చిపోవాలని అనుకున్న ప్రతిసారి "డిస్టర్బ్ చేయకు" అని మౌనంతో నువ్వు చేసే సైగ నన్ను నేనుగా, ఒంటరిగా ఉండేలా చేసేది.

 ఆ క్షణం నన్ను నేను వేసుకున్న ప్రశ్నలేన్నో....!! నేను మరబొమ్మనా, ప్రాణం తో ఉన్న మనిషినా అని....!!! 

నా మనసులోని భావాలు ,బాధలు, భయాలు అన్నింటికి కారణం, సమాధానం రెండు నువ్వే...!!!

ఇన్ని రోజులుగా మన మధ్య మౌనం రాజ్యమేలుతోంది.

అదే మన మధ్య అర్థం లేని ఆలోచనలకు దారి తీసింది.

నాకు ప్రేమికుడివై పంచే నీ ప్రేమ కావాలి , స్నేహితుడిలా నీ పలకరింపు కావాలి, తండ్రిలా నీతో, నీ కోసం నేనున్నా అన్న భరోసా కావాలి, భర్తగా నీతో ఏకాంతంగా గడిపే క్షణం కావాలి. అంతే ఎంతటి బాధనైన భరించేస్తాను అంటూ ఆకాష్ ని గట్టిగా కౌగిలించుకొని ఇన్ని రోజులుగా  మౌనంగా మనసులో ఆదిమిపెట్టుకున్న బాధనంత కన్నీళ్ల రూపం లో బయట పెట్టింది.

తనలోని ఆవేదనను చూస్తున్న ఆకాష్ కి తను చేసిన తప్పు ఏంటో అర్థమై, అర్థం కాక కొంత సమయం దాకా మౌనంగా ఉండడం ఆకాష్ వంతయ్యింది.

ఎన్ని అవాంతరాలున్న , బరువు భాద్యతలున్న..... ఎన్ని పనులున్న భార్యాభర్తల మధ్య కోపతాపాలు, పలకరింపులు, ప్రేమబందాలు అన్ని సమపాళ్లలో ఉంటేనే భార్యాభర్తల బంధం ఎలాంటి అలమరికలు లేకుండా, మౌన సంఘర్షణలకు, అపార్థాలకు తావు లేకుండా ఉంటుంది.

ఈ విషయాన్ని మర్చిన ఆకాష్  అందరిని విడిచి తనే ప్రపంచంగా అనుకోని వచ్చిన అవని బాధకు కారణమైనందుకు చాలా భాదపడ్డాడు.

వెంటనే తేరుకొని అవని ని అక్కున చేర్చుకొని తన తప్పుకు క్షమాపణలు కోరాడు.

ఇక ఎప్పటికి మన మధ్య ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వనని అవని మనసుకు ధైర్యాన్ని ఇచ్చి తన కళ్ళల్లో మానసిక సంతృప్తి ని చూసి అమితానందానికి లోనయ్యాడు.

అప్పటిదాకా వారిద్దరి మధ్య జరిగిన మౌన సంఘర్షణకు అడ్డుతెరలు తొలిగిపోయి అవని ఆకాష్ ల మధ్య ప్రణయకావ్యం మళ్ళీ చిగురించింది.

              ★★★★★

కొన్ని సమస్యల పరిష్కారానికి మౌనం చేసే మేలు అంత ఇంత కాదు.

మనం తీసుకోవాల్సిన నిర్ణయం వల్ల అందరి జీవితాలు సుడిగుండంలోకి పడబోతాయి అన్నప్పుడు మౌనంగా ఉండడమే సరైన మార్గం.

అలా అని.... అన్ని సందర్భాల్లో అదే మౌనం దారి చూపెడుతుంది అనుకుంటే పొరపాటే......


అవని ఆకాష్ ల మధ్య సమస్య చిన్నదే కావచ్చు కానీ అది మితిమిరితే విడదీయరాని చిక్కుముడిలా మారి వారి జీవితాన్నే బలి చేస్తుంది.

ప్రతి మనిషి ఎదో ఒక సందర్భంలో తన  చేయి దాటిపోయింది పరిస్థితి.... అన్న క్షణాన మౌనంగా నిట్టూరుస్తాడు.

కొంత మంది ఓపికతో ,మౌనంతో తన సమస్యను పరిష్కరించుకోవచ్చు అనుకుంటారు.

అన్ని వేళలా మౌనం పనికిరాదు.

అదే మౌనం ఇద్దరి స్నేహితుల మధ్య అపార్థాలు కలగడానికి కారణం కావచ్చు.

ప్రేమికుల మధ్య విభేదాలకు , మనస్పర్థలకు తావునిస్తుంది.

భార్యాభర్తల మధ్య అర్థం కాని మౌన సంఘర్షణలతో ఊహించని అగాధాన్ని సృష్టిస్తుంది.

అందుకే అన్ని సమస్యలకు మౌనమే పరిష్కారం కాదు. 

ఒక్కోసారి మౌనం మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. సమస్యను జటిలం చేస్తుంది.

అందుకే  కొన్ని సందర్భాల్లో  మౌనం వదిలి, పెదవి విప్పి మన మాటలకు , భావవ్యక్తీకరణ కు అవకాశం ఇవ్వాలి



Rate this content
Log in

Similar telugu story from Drama