Meegada Veera bhadra swamy

Drama

4.0  

Meegada Veera bhadra swamy

Drama

మాష్టారి ఆత్మాభిమానం

మాష్టారి ఆత్మాభిమానం

3 mins
589‘‘సుబ్బారావు మాస్టారు అనాథాశ్రమంలో ఉండడమేంటి? ఆయనకంత ఖర్మేం పట్టింది?’’

‘‘ ఏం చేస్తాం... మాస్టారి మంచితనమే అతన్ని ఈ స్థితికి దిగజార్చింది’’

‘‘అయినా అతనికి ముగ్గురు కొడకులు, ఒక కూతురు ఉన్నారు. అంత మంది కుటుంబం ఉండగా ఇదేం దుస్థితి?’’

‘‘అమ్మగారు చనిపోయిన తరువాత మాస్టారి పరిస్థితి మరీ దారుణమయిందటరా. అతని పిల్లలే వీధిలో పడేశారట’’

‘‘మనం ఒకసారి వెళ్లి మాస్టారిని కలుద్దాం. వీలైతే కొంత డబ్బు కూడా ఇద్దాం’’

‘‘అలాగే’’

‘‘మనమే కాదు మన వాళ్లని కొందరిని కూడగట్టుకుని వెళదాం’’

‘‘వద్దురా బాబూ! అతను ఆ స్థితిలో ఉన్నాడని ఎవరికీ తెలీకూడదని ఆశ్రమంలోనే ఉంటూ బయటికి రాకుండా ఉంటున్నారు. ఆశ్రమం గుమస్తా వల్ల తెలిసింది. మనకి తెలిసిందన్న సంగతి అతనికి తెలియదు. తెలిస్తే మరింత కుమిలిపోతారు. మన బాధ్యతగా అతన్ని కలవక తప్పదు’’

రవి, రాజు సుబ్బారావు మాస్టారి శిష్యులు. ఒకటి నుండి అయిదవ తరగతి వరకు మాస్టారి దగ్గరే చదువుకున్నారు. మాస్టారిని దేవుడిగా భావించేవారు. మాస్టారు వాళ్లని సొంత బిడ్డల్లా ఆదరించేవారు. * * * సుబ్బారావు మాస్టారి తండ్రికి అతను ఏడవ సంతానం. పిల్లలందరూ ప్రయోజకులే. దాదాపు అందరు ప్రభుత్వ ఉద్యోగులే. సుబ్బారావు మాస్టారే అందరి కంటే చిన్నవాడు. ‘నా కళ్ల ముందే తల్లిదండ్రులు చనిపోయారు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు కూడా చనిపోతున్నారు’ అని బోరున విలపించడం చూసి అతని భార్య నీలకంఠమ్మ ఎక్కడా చూడలేదు ఇలాంటి మనిషిని అనుకునేది. భర్తని పట్టుకుని ఆమె కూడా ఏడ్చేసేది. అంత సున్నితమైన మనసు గల వారు ఆ దంపతులు.

సుబ్బారావు మాస్టారు పిల్లల్ని అపురూపంగా పెంచుకొచ్చారు. తన తాహతుకు మించి అప్పులు చేసి మరీ వారిని చదివించారు. పెద్దవాడు రామేశం ఇస్రోలో సైంటిస్టుగా పని చేస్తున్నాడు. అతని భార్య అదే సంస్థలో క్లర్క్‌గా పని చేస్తోంది. రెండవ వాడు అవధాని అమెరికాలో గూగుల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరు, అతని భార్య కూడా ఇంజనీరే. మూడవ వాడు స్కూల్ మాస్టారు. సుబ్బారావుగారి అమ్మాయి పద్మలత టీచర్. అల్లుడూ టీచరే.

మాస్టారు రిటైర్ అయిపోయారు. పెన్షన్ కూడా వస్తోంది. అయినా అతనికి దానగుణం అధికం కావడం వల్ల తనకొచ్చే దాంట్లో నుండి ప్రేమ సమాజానికి, అనాథాశ్రమాలకు విరాళంగా ఇస్తుండేవారు. రిటైరయ్యాక వచ్చిన దాంట్లో ఆడపిల్లకి కొంత, చిన్న కొడుక్కి కొంత ఇచ్చేసి మిగతాది అనాథాశ్రమానికి, తన తోబుట్టుల కుటుంబాలకి ఇచ్చేసారు.

అతని భార్య నీలకంఠమ్మ క్యాన్సర్ సోకినప్పుడు పిల్లలు పెద్దగా పట్టించుకోలేదు. ఉపాధ్యాయుడైన చిన్న కొడుకు, కూతురు కొంత ఆదరించినా, ముక్కుతూ, మూలుగుతూ ఉండేవారు. పెద్ద చదువులు చదివించారు. దేశ విదేశ కంపెనీల్లో కోట్లాది రూపాయల జీతానికి పని చేస్తున్నారు. ఆ పెద్దవాళ్ల మీద భారం పెట్టొచ్చు కదా’ అనేవారు. వైద్యానికి ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తన శిష్యుడు షేక్ మస్తాన్ ఆలీ అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు చేశారు మాస్టారు. మాస్టారి మీద నమ్మకంతో హామీలేమీ అడక్కుండానే అప్పుడు ఇచ్చాడు అతను. వైద్యం చేయించినా మాస్టారి భార్య బతకలేదు. ఆపరేషన్ అయినా పది నెలలకే కన్ను మూసింది.

మాస్టారి పిల్లలు తల్లి కర్మకాండలు తూతూ మంత్రంగా జరిపించారు. ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోయారు. ఇల్లు ఉంది. పెన్షన్‌లో పది శాతం అంటే మూడు నాలుగు వేలు వస్తుంది. అవసరం అయితే మేమేన్నాం అంటూ మాస్టారిని ఇంట్లో వదిలేసి అంతా వెళ్లిపోయారు. ఒకసారి షేక్ మస్తాన్ ఆలీ వచ్చి ‘‘మాస్టారు ఇరవై లక్షలు అప్పు తీర్చాలంటే మీకు జన్మలో అయ్యే పని కాదు. కనుక మీ పిల్లల సాయం అడగండి’’ అన్నాడు. దానికి మాస్టారు మాట్లాడుతూ నీకంతగా డౌట్ ఉంటే ఈ ఇంటిని తీసుకో. ఇది నేను సంపాదించింది. దీని మీద వాళ్లకి హక్కు లేదు. ఎవరూ అడ్డుపడరు. అంతే గానీ వాళ్లని సాయమడగమని సలహాలివ్వకు’’ అన్నారు మాస్టారు ఆత్మాభిమానంతో. తర్వాత తన ఇంటిని ఆలీ పేరిట రాయించేశారు.

ఆటుపోటులకు తట్టుకున్న మనిషి కనుక బాధపడక అనాథాశ్రమంలో చేరిపోయారు. అక్కడ పురాణ పఠనం, కథావాచకం, కవితలు, పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అక్కడున్న వారిని సంతోషపెడుతూ కాలం నెట్టుకొస్తున్నారు.

‘అతన్ని కదిపితే మన పరువు అనాథాశ్రమం గేటుకు వేళాడదీస్తారు’ అనుకుంటూ అతని పిల్లలు మిన్నకుండిపోయారు. శిష్యులకి కూడా ఎవరికీ చెప్పలేదు మాస్టారు. మాస్టారి గురించి తెలిసిన రవి, రాజు ఆ విషయాలు నెమరు వేసుకుంటూ రాత్రి గడిపారు. * * * మర్నాడు ఉదయం పది గంటలకల్లా అనాథాశ్రమానికి వెళ్లారు రవి, రాజు. వాళ్లని చూడగానే మాస్టారు ఆశ్చర్యపోయారు. శిష్యులిద్దరు మాస్టారి కాళ్లకి దండం పెట్టారు. కుశల ప్రశ్నల తర్వాత విషయానికి వచ్చారు రవి, రాజు.

‘‘సార్ మేము ఇద్దరం బిజినెస్‌లో మంచి స్థితికి చేరుకున్నాం. మీరు మా అకౌంట్స్ రాయండి. మీకు నెలకి పదివేలు ఇస్తాం. ఒక రూము తీసుకుందాము. అందులో మీరు ఉందురు గానీ’’ అన్నారు.

‘‘మీ అభిమానానికి ధన్యవాదాలురా. నేను కోరుకుంటే నా చేత పని చేయించుకోకుండానే మీరు నన్ను పోషించగలరు. కంటికి రెప్పలా కాపాడగలరు. నిజానికి నా సంతానమూ చెడ్డవాళ్లు కాదు. నేనే తాహతుకి మించి అప్పులు చేసి వాళ్లకి ఏమీ ఇవ్వలేకపోయాను. అయినా నేను చేసిందల్లా సబబే అన్న సంతృప్తి నాకు ఉంది కాబట్టి నిశ్చింతగా ఉంటున్నాను. నా గురించి దిగులు పడకుండా పిల్లాపాపలతో హాయిగా ఉండండి. నేను నా మానస పుత్రుడు ప్రభాకర్ ఇంట్లో ఉన్నానని మీరు తృప్తి పడండి. వచ్చేటప్పుడు కాస్త ముక్కుపొడుం డబ్బాలు తెండి చాలు’’ అన్నారు మాస్టారు.

రవి, రాజు కళ్లు చెమ్మగిల్లాయి. నోట మాట రాలేదు. మాస్టారి ఆత్మాభిమానం, పట్టుదల తెలిసినవాళ్లు, అతన్ని ఎంత ఒప్పించినా లాభం లేదని గ్రహించి ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టకుండా ‘‘సార్ మేము వెళ్లి వస్తాం. ఆరోగ్యం జాగ్రత్త సార్. ఏ అవసరం వచ్చినా మాకు కబురు చెయ్యండి సార్’’ అంటూ మరోసారి మాస్టారి పాదాలు తాకారు.

అంతలో అక్కడికి ప్రభాకరరావు వచ్చాడు. అందరూ కలసి కొంత సేపు మాట్లాడుకున్నారు. రవి, రాజు వీడ్కోలు తీసుకున్నారు. శిష్యులని చూసి మాస్టారు మురిసిపోయారు. ‘నాది వసుధైక కుటుంబం. నాకీ గౌరవాన్ని ఇచ్చిన అక్షరమాతకి వందనం. సలక్షణ సరస్వతీ పాదాభివందనం’ అంటూ మనసులోనే చదువుల తల్లికి ప్రణామాలు అర్పించారు మాస్టారు.

అనాథాశ్రమం ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బు అయింది. ‘నా ఒడిలో కూడా తండ్రి బిడ్డల ప్రేమానుబంధాలా’ అనుకుంటూ .Rate this content
Log in

Similar telugu story from Drama