మారుతున్న అలవాట్లు
మారుతున్న అలవాట్లు


31-03-2020
ప్రియమైన డైరీ,
దేశం మొత్తం లాక్ డౌన్ లో ఏడవ రోజు ఇది.
గత వారం పాటు రోడ్ల మీద వాహనాలు తిరగడం లేదు కాబట్టి వాతావరణ కాలుష్యం తగ్గింది కదా.
ఇది కరోనా వైరస్ చేసిన మేలు అని కొందరు మేధావులు అంటున్నారు.
అలా అన్న వారిని తిట్టిన వాళ్ళూ ఉన్నారు.
ఏదేమైనా మార్పు మంచిదే.కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడే మనం వాతావరణం గురించి మాట్లాడ్డం కాదు.
అసలు మన దేశ సంస్కృతి ఎలాంటి మంచి
అలవాట్లు మనకు నేర్పింది అనే విషయం అందరూ తెలుసుకోవాలి.
ప్రకృతిని ఆరాధించే గుణం అలవర్చుకోవాలి.
చాలా మంది అలవాట్లు మారుతున్నాయి. అవన్నీ మంచి వైపు అడుగులు వేయించాలని ఆశిద్దాం.