STORYMIRROR

Dinakar Reddy

Comedy Children

3  

Dinakar Reddy

Comedy Children

మాల్గుడి పెయింటింగ్స్

మాల్గుడి పెయింటింగ్స్

1 min
253

వసూ! నీకు సమయం ఎలా గడుస్తుందే. వంట కూడా మీ ఆయనే చేస్తారు కదా. రోజూ ఇలా ఖాళీగా కూర్చుంటే బోర్ కొట్టదా అని అడిగింది ఆమె స్నేహితురాలు విద్య.


వసుమతి అదే ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి క్యాలెండరు వెనుక ఉన్న పేజీలు తిప్పి ఏదో గీస్తూ కూర్చుంది.


వసు వాళ్ళ ఆయన సుమంత్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. అతను ఇంటికి వచ్చే సరికి బాగా పొద్దు పోయింది.


సుమంత్! చూడు నేను ఏం గీసానో. వసు గీసింది ఏమిటో అతనికి అర్థం కాలేదు.


కానీ చాలా బాగుంది అంటూ ఆమెను పొగిడాడు.


వెంటనే వసు లేచి ఏమండీ. నేను పెయింట్స్ వేయడానికి కావలసిన సామాను మొత్తం తీసుకుని రండి అని కోరింది.


దానికేం భాగ్యం. తప్పకుండా తీసుకు వస్తాను అని చెప్పి వంట చేయడానికి లోపలికి వెళ్ళాడు.


మరుసటి రోజు పెయింటింగ్ చేయడానికి కావలసిన సామాను అంతా ఇంటికే కొని పంపించాడు సుమంత్.


ఆ రోజు రాత్రి అతను వచ్చే సరికి ఇల్లంతా పెయింటింగ్స్ తో నిండిపోయింది. బోర్డులు ఖాళీ లేక వసు తను వేసిన పెయింటింగ్స్ అన్నీ మేకులకు తగిలించింది.


ఏవండీ! నా పెయింటింగ్స్ మాల్గుడి నుండి ప్రపంచమంతా చేరాలి. ఏమంటారు. అంది మురిపెంగా.


తప్పకుండా. నువ్వు గొప్ప ఆర్టిస్ట్ వి అని నీళ్ళు నములుతూ అన్నాడు. అతడి బుర్రలో గొప్ప మార్కెటింగ్ ఆలోచన తట్టింది.



Rate this content
Log in

Similar telugu story from Comedy