లాక్ డౌన్ Vs కరోనా పాజిటివ్
లాక్ డౌన్ Vs కరోనా పాజిటివ్


22-04-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఇరవై ఎనిమదవ రోజు.
లాక్ డౌన్ పొడిగించిన తరువాత కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతుండడం అంతు చిక్కని ప్రశ్నలా మారింది.
14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడలేదనీ,
28 రోజుల తరువాత వ్యాధి లక్షణాలు బయటపడుతుండడంతో అన్ని రోజుల పాటు వారు ఎవరెవరితో దగ్గరగా ఉన్నారో వారందరికీ పరీక్షలు చేస్తున్నారు.
వారికి కూడా ఆలస్యంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఈ గ్యాప్లో కరోనా కొత్త మ్యుటేషన్ చెందిందా అని కూడా అనుమానాలు లేకపోలేదు.
మొత్తానికి మళ్లీ ఈ కరోనా వైరస్ వ్యాప్తి కారణాల మీద గందరగోళం నెలకొంది.