కరోనా & వృత్తిధర్మం
కరోనా & వృత్తిధర్మం


ప్రియమైన డైరీ,
భారత దేశం లాక్ డౌన్ లో ఇది పంతొమ్మిదవ రోజు.
అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు అని అనుకోవడానికి లేదు.
ప్రాణాలకు తెగించి వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న ఎందరో వైద్య ఆరోగ్య సిబ్బంది,పోలీసులు,విద్యుత్ ఉద్యోగులు,పారిశుద్ధ్య కార్మికులు,మీడియా వాళ్ళు, ఇంకా నిత్యావసర వస్తువుల పంపిణీ సిబ్బంది తమ కుటుంబాలకు దూరంగా ఉన్నారు.
నాకేం పట్టింది, అమ్మో నాకూ వైరస్ అంటుకుంటే ఎందుకొచ్చిన గొడవ అని వాళ్ళు అనుకోవడానికి లేదు.వృత్తిలో సేవ లేదనే వాళ్ళకి వీరంతా సమాధానం అని అనిపిస్తుంది.
వీళ్ళే కదా అసలైన హీరోలు.