కరోనా : వేదాంతము
కరోనా : వేదాంతము
16-04-2020
ప్రియమైన డైరీ,
భారత దేశం లాక్ డౌన్ లో ఇది ఇరవై మూడో రోజు.
ఎంతగానో మోడ్రన్ కల్చర్ అని అలవాటు పడ్డవారికి వేదాంతం అంటే ఏమిటో కొద్దిగా అర్థం అవుతోంది.
ఈ లాక్ డౌన్ వల్ల జనాలకి ఒక రకమైన
ఫిలాసఫీ అలవడుతోంది.
ఏదీ శాశ్వతం కాదు.మనిషి కూడా ఈ భూమ్మీద ఒక రకమైన జీవి అంతే.తానే భూమండలాన్ని శాసిస్తున్నాను అనే మనిషి కంటికి కనిపించని వైరస్ కి భయపడి మరో మనిషిని చూడగానే భయపడుతున్నాడు.
డాక్టర్లు,పోలీసులు,పారిశుధ్య సిబ్బంది విలువ తెలుసుకుంటున్నారు.
లాక్ డౌన్ పొడిగింపు మరింత మందిని ఫిలాసఫీ గురించి ఆలోచించేలా చేస్తుంది అనడంలో సందేహం ఏ మాత్రం లేదు.