కరోనా : తుమ్మితే భయం
కరోనా : తుమ్మితే భయం


20-04-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఇరవై ఏడవ రోజు.
ఇప్పుడంటే ఎండాకాలం నడుస్తోంది. రాబోయేది వర్షాకాలం.జలుబు,దగ్గు,తుమ్ములు సర్వ సాధారణం.
ఇప్పటికే ఎవ్వరు తుమ్మినా ఇంక ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి మిగతా వారు ఇష్టపడటం లేదు.
అది ఆఫీసులో బాస్ అయినా సరే.
ఇప్పుడే ఇలా ఉంటే ఇంక వర్షాకాలంలో జలుబు చేసినా జనాలు తుమ్మడానికి భయపడతారేమో.
అప్పుడు కూడా వారిని ఇళ్లలోంచి బయటికి రానివ్వరేమో అనిపిస్తోంది.