కరోనా : తపాలా శాఖ
కరోనా : తపాలా శాఖ
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఇరవై ఏడవ రోజు.
అన్ని రకాల రవాణా వ్యవస్థ ఆపబడింది ఈ లాక్ డౌన్ వలన. మరి అత్యవసర మందులు ఇంకా రోగులకు అవసరమైన మెడికల్ పరికరాలు సమయానికి అందకపోతే ఎంతో మంది రోగుల ప్రాణాలు ఆపదలో పడతాయి.
అందుకే మన తపాలా శాఖ వాటిని ప్రత్యేక వాహనాలలో విమానాల్లో సరఫరా చేస్తోంది.
చాలా మంది తమ పార్సిల్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ లాక్ డౌన్ సమయంలో పోస్టల్ సిబ్బంది ఇస్తున్న సేవలు అభినందనీయం.