కరోనా : రైతు బజార్
కరోనా : రైతు బజార్


17-04-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం లాక్ డౌన్ లో ఇరవై నాలుగో రోజు.
లాక్ డౌన్ కి అలవాటు పడిన జనం తాజా కూరగాయలు తెచ్చుకోవడానికి రైతు బజార్లకి వెళుతున్నారు.
ధర తక్కువనో లేక తాజాగా అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయనో తెలీదు కానీ సూపర్ మార్కెట్లు దాటి రైతు బజార్ వైపు అడుగులు పడుతున్నాయి.
భార్య భర్త కలిసి సంచీ తీసుకొని రైతు బజార్ వెళ్లి రావడం నాకొక అరుదైన దృశ్యంలా అనిపించింది.
రైతు బజార్లలో కూడా సామాజిక దూరం పాటించడం చెప్పుకోవాల్సిన విషయం.