కరోనా : పరీక్షలు
కరోనా : పరీక్షలు
25-04-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై ఒకటవ రోజు.
మిగతా తరగతుల వారిని పై తరగతులకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేస్తారని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పదవ తరగతి విద్యార్థులు మాత్రం గందరగోళంలో ఉన్నారు.
సరిగ్గా పరీక్షలు జరుపుదామంటే ఈ లాక్ డౌన్ వచ్చింది. తల్లి తండ్రులు మాత్రం వారిని ఇంటి వద్దే చదివింది మళ్లీ మళ్లీ రివిజన్ చేయిస్తున్నారు.
అకడమిక్ సంవత్సరం స్వరూపమే మారిపోతుందేమో చూడాలి.