కరోనా: ఒక హెచ్చరిక
కరోనా: ఒక హెచ్చరిక


ప్రియమైన డైరీ,
భారత దేశం లాక్ డౌన్ లో ఇది పదహారో రోజు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
ప్రొద్దున్నే ఒక స్నేహితుడికి ఫోన్ చేశాను.కాలేజీ టైమ్ నుంచే అతను ఫిలాసఫీ బాగా చెప్పేవాడు.
కరోనా వైరస్ గురించి అతణ్ణి అడిగాను.
p>
అతడు ఇది మొత్తం మన మానవాళికి హెచ్చరిక అని అన్నాడు.
ఈ ఇల్లు నాది.ఈ భూమి నాది. అలా ఎన్నో అనుకునే మనిషి ఈ భూమండలం మీద లేని రోజులు కొన్ని వేల సంవత్సరాల ముందు ఉన్నాయి.
అలాగే భవిష్యత్తులో మళ్లీ ఈ భూమి మీద మానవ జాతి ఆనవాలు కూడా లేని రోజులు రావొచ్చని అందుకు కాలం తెలిపే హెచ్చరిక ఇలాంటి పరిస్థితులు అని అన్నాడు.
అతనితో ఎలా వాదించాలో అర్థం కాలేదు.