కరోనా: కొన్ని డౌట్లు
కరోనా: కొన్ని డౌట్లు


ప్రియమైన డైరీ,
భారత దేశంలో లాక్ డౌన్ లో పదనాలుగో రోజుకు చేరుకుంది.
కొంత మంది ఈ కరోనా వైరస్ బయో వార్ ఫలితమనీ మరి కొంత మంది కాల జ్ఞానం ప్రకారం ఇది యుగాంతమనీ వాదిస్తున్నారు.
కొన్ని డౌట్లు మాత్రం అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి.
పరిశోధనలు చేసి వ్యాక్సిన్ కనిపెట్టలేనటువంటి
విధంగా ఈ వైరస్ ఎప్పుడు మ్యుటేషన్ చెందింది?
ఇంత తక్కువ కాలంలో అంత శక్తివంతంగా మారిన దాని మ్యుటేషన్లను మనం అన్ని రకాలుగా భవిష్యత్తులో పసిగట్టగలమా?
అంటే ఇదే వైరస్ వేరే జీవితో కలిసి మరో విధంగా మనల్ని అటాక్ చెయ్యదని గ్యారంటీ ఏంటి?
కరోనాకు మందు కనుగొని ఫ్రీగా అందరికీ ఇచ్చే శక్తి భారతీయ ఆయుర్వేదానికి ఉందా?
ఉంటే ఎందుకు పూర్తి స్థాయిలో దాని గురించి శాస్త్రీయ చర్చ జరపడం లేదు?
ఇలా కొన్ని డౌట్లు అందరి మెదళ్ళలో తిరుగుతున్నాయి.
చూద్దాం కాలం ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతుందో.