కరోనా & కాలుష్యం
కరోనా & కాలుష్యం


ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం లాక్ డౌన్ లో పద్దెనిమిదవ రోజు.
ఓ పక్క లాక్ డౌన్ కంటిన్యూ అయితే జరిగే ఆర్థిక నష్టాలు ఆలోచిస్తూనే ప్రజలు ప్రకృతిలో జరిగే మార్పులను కూడా గమనిస్తున్నారు.
ధౌలాధర్ రేంజ్ ని ఇంటి నుంచి చూడగలిగిన జలంధర్ ప్రజలు అనే వార్త అందరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ప్రకృతి అద్భుతమని మనం కాలుష్యం చేయకుండా ఉంటే మరిన్ని అద్భుతాలు జరుగుతాయని చాలా మంది చెబుతున్నారు.
ఇదే విషయాన్ని లాక్ డౌన్ తరువాత కూడా కాస్త గుర్తు పెట్టుకొని మన వంతు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది కదా.