కరోనా : కాలం మారేనా
కరోనా : కాలం మారేనా


ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఇరవై తొమ్మిదో రోజు.
రాజైనా బంటైనా కాలానికి ఒకటే అన్నట్లుంది.
డబ్బు ఉన్న వాడూ లేని వాడూ ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి వచ్చింది.
ఎంత సంపద ఉన్నా నువ్వు బయటికి రాలేవు.
కానీ అన్ని వసతులూ కల్పించుకోగలడు.
మరి కూలో నాలో చేసుకునే వాడు ఇంట్లో ఉండడం అంటే అది వారికి ఒక పరీక్షే కదా.
ఈ గడ్డు కాలం ఎప్పుడు వెళ్లిపోతుందో మళ్లీ మునుపటిలా పనులకి ఎప్పుడు వెళతామో అని కూలి పనుల మీద ఆధారపడిన వాళ్ళు అనుకుంటారు.