కరోనా : హెచ్చు తగ్గులు
కరోనా : హెచ్చు తగ్గులు
01-05-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై ఆరవ రోజు.
ఇంట్లో కూర్చుని ఏం చేయాలి అనే వాళ్ళు.ఏమిటి మా గతి. రాబోవు కాలం ఎలా ఉంటుందో బాధ పడే వాళ్ళు. రక రకాల వార్తలు చదివి భయపడే వాళ్ళు.
ఇలా అందరూ ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు.
నేను మాట్లాడిన వాళ్ళలో ఒకరు ఇలా అన్నారు.
హెచ్చు తగ్గులు లేకుండా అందరూ ఇలా ఇంట్లో ఉండి ప్రభుత్వ ఆదేశాలు పాటించడం చాలా గొప్ప విషయం అని.
ఎవరు పడే బాధ వాళ్ళది.కానీ అందరి బాధను అర్థం చేసుకోవడం మాత్రం కొందరికే సాధ్యం కదూ.