కరోనా : ఆ ముప్పై రోజులు
కరోనా : ఆ ముప్పై రోజులు


24-04-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ముప్పై వ రోజు.
నెల రోజులు జనాలు తమ జీవన సరళిని మార్చుకున్నారు.
కష్టమో నష్టమో ఇంటిలోంచి బయటికి రాకుండా చాలా మంది ఒకేసారి సరుకులు తెచ్చుకుని గడిపారు.
పిల్లలకు స్కూళ్లు కాలేజీలు లేక పోవటంతో
అనుకోకుండా వచ్చిన సెలవులని ఇళ్లలో గడిపేస్తున్నారు.
ఇంటి నుంచి దూరంగా చిక్కుకు పోయిన వారు వీడియో కాల్స్ మార్గంగా ఇంటిలోని వారిని పలకరిస్తున్నారు.
నెల రోజుల్లో చాలా మార్పులు వచ్చాయి.
ఈ వైరస్ గొడవ పోతే ఎన్నో విషయాల్లో మన అలవాట్లు మారతాయి అనే విషయం చూడాలి.