కొటం
కొటం
ఉస్సూరుమంటూ బస్సు ఆగింది.రోడ్డు మీద నుంచి ఎడం వైపు తిరిగి అలా ముందుకు నడిచాను.కోదండ రామ స్వామి గుడి గంటలు వినిపిస్తున్నాయి.
అక్కడ పాత కొటం లేదు.మేము గుడిసెను కొటం అంటాం.
మా పెద్ద వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి ఇక్కడ కొటాలు వేసుకుని పనులు చేసుకొని డబ్బులు సంపాదించేవాళ్ళమంట.
సంపాదించిన దాంట్లో కొంత రాముని గుడి హుండీలో వేసేవాళ్ళమంట.
అవ్వా వాళ్ళ కొటం లోనే నేను పుట్టానంట.అర్థరాత్రినేను పుట్టినప్పుడు కోదండ రామ స్వామి గుడిలో గంటలు వినిపించాయంట.
ఇప్పుడు కొటం స్థానంలో ఒక డాబా ఇల్లు దర్శనమిచ్చింది.
బయట నుంచి చూసి ప్రక్కకు వచ్చేశాను.
గుడి వైపు నడిచాను కాస్త డబ్బు హుండీలో వేయడానికి.నేనూ వేరే ఊరు వలస వెళ్ళాగా.