కొత్త బట్టలు
కొత్త బట్టలు


తన్వి వాళ్ళ నాన్న ప్రక్కనే నడుస్తూ ఉంది.ట్యూషన్ నుంచి తన్విని వాళ్ళ నాన్నే రోజూ ఇంటికి తీసుకొస్తారు.
నాన్నా!నాకు కొత్త యూనిఫారం వద్దు.ఇది సరిపోతుంది నాన్నా అని అంది తన్వి.
ఏమ్మా.అలా చెప్పమని అమ్మ చెప్పిందా అని కూతురిని అడిగాడు భాస్కర్.
లేదు నాన్నా.అమ్మెప్పుడూ అంటుంది అన్నయ్యకి కొత్త బట్టలు అవసరం కానీ ఆడపిల్లవి నీకెందుకు అని.
నాకూ అన్నయ్యకూ ఇద్దరికీ కొనాలంటే మరి నీ దగ్గర డబ్బులు సరిపోవేమో అని అలా చెప్పాను నాన్నా అని తన్వి తల దించుకుంది.
భాస్కర్ మోకాళ్ళ మీద కూర్చొని తన్వి గడ్డం పట్టుకొని తన ముఖాన్ని చూశాడు.
తన్వీ.మీ అన్నయ్య నువ్వూ నాకిద్దరూ సమానమే.ఇంకెప్పుడూ నువ్విలా ఆలోచించకూడదు అని చెప్పాడు.తన్వి సరే నాన్నా అని ట్యూషన్ విశేషాలు చెప్పడం మొదలు పెట్టింది.
కూతురి భుజం మీద చేయి వేసి నడుస్తూ ఉంటే భాస్కర్ మనసుకి ఏదో గొప్ప ధైర్యం దొరికినట్లు అనిపించింది.