POLAVARAPU PUSHPAWATI

Romance Others

3.7  

POLAVARAPU PUSHPAWATI

Romance Others

కౌమారం

కౌమారం

8 mins
381


     "అమ్మ ,నీకు తెలుసా మా క్లాస్మేట్ శిరీష ఏం చేసిందో ఈ రోజు"అంటూ కంగారుపడుతునే బడి నుంచి వచ్చింది వనిత.     "ఏంటమ్మా ఎందుకు ఆ కంగారు" అంటూ కూతురిని దగ్గరికి తీసుకుంది జలజ.     "అమ్మ, సిరి ఏమో, రోజూ తనకి బడికి తీసుకువచ్చె ఆటో డ్రైవర్ తో లేచిపోయిందంటమ్మా, మా బడిలో అంతా గొడవ గొడవగా ఉంది. పోలీసులు కూడా వచ్చారు మా స్కూల్ కి."అని ఇంకా ఏవేవో చెప్పుకు పోతుంది పాప వనిత. జలజ గుండెలో వణుకు పుట్టింది. పాపని కాస్త గట్టిగా హత్తుకుంది."ఏం జరుగుతుంది ఈ పిల్లలకి, నిన్నటికి నిన్న పక్క బిల్డింగులో 15 ఏళ్ల పాప దూకి ఆత్మహత్య చేసుకుంది. అసలు ఎందుకు దూకేసిందో తెలుసుకోవడానికే రెండు రోజులు పట్టింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఎదురు బిల్డింగులు పనికివచ్చే కార్పెంటర్ అబ్బాయితో సన్నిహితంగా ఉండేదని. వాడు మోసం చేశాడని ఈ చిన్న పిల్ల ఆత్మహత్య చేసుకుంది. వాడికి పోలీసులు పట్టుకున్నప్పుడు చూస్తే చాలా బాధనిపించింది జలజకి , వాడికి ఏమీ లేదన్న 30 ఏళ్ల దాటే ఉంటాయి. ఈ పిల్లలు ఎలా అబ్బాయిల మాటల గారడీలో పడిపోతున్నారు. ఏం చేస్తే ఆగుతుంది ఈ పసి కూనల హత్యలు, జలజ మనసు మదన పడుతుంది.     "మరేమోనమ్మా ,నువ్వు నాకు చెబుతూ ఉంటావు కదా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి. అలాగే అబ్బాయిల మాటలలో మంచి చెడులను ఎలా గ్రహించాలో. మరి శిరీష వాళ్ళ మమ్మీ చెప్పలేదా తనకి ఈ బ్యడ్ టచ్ గురించి. చెప్పి ఉంటే తను ఆటో డ్రైవర్తో ఎందుకు వెళ్లిపోతుంది? అని అమాయకంగా అడుగుతుంది వనిత.                    "అదే కదమ్మా మా అమ్మలు చేసే పెద్ద తప్పు. పిల్లలకు 15ఏళ్ళు, 18 ఏళ్లు వచ్చినా ఇంకా చిన్నపిల్లలుగానే చూస్తాం.ఇటువంటి విషయాలు వాళ్ళ దగ్గర ప్రస్తావించకూడదు అనుకుంటాం. పెద్దయ్యాక వాళ్లే తెలుసుకుంటారు అనుకుంటాం. కానీ ఈలోపే తెలిసి తెలియని వయసులో, అన్నీ మాకే తెలుసు అనే అపోహలో, పిల్లలు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అసలు మా తల్లులు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పిల్లలకి డేంజర్ వయసు 12 నుంచి స్టార్ట్ అవుతుంది 18 వరకు. అది ఒక అలజడితో కూడిన వయసు. అలాంటప్పుడే తల్లులు, గాని టీచర్స్ గాని వాళ్లకి చదువుతోపాటు కౌమార దశలో వచ్చె శారీరిక మానసిక మార్పులు గురించి విపులంగా చెబుతూ సరైన దిశ నిర్దేశం చేయాలి. కానీ చాలామంది అమ్మలు ఇది తెలుసుకోరు",అంది జలజ."బడి నుంచి వచ్చిన పిల్లకి నీలో పాలు ఇవ్వకుండా ఏమిటే ఆ కబుర్లు" అని అత్తగారి కేక వినేసరికి వనితని ఫ్రెష్ అవ్వమని చెప్పి తను పాప కోసం స్నాక్స్, పాలు రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది". స్నాక్స్ప పాలు తీసుకొని వనిత వాళ్ళ నాన్నమ్మతో కబుర్లో పడిపోయింది. "ఇంటిలో పెద్ద వాళ్ళ ఉంటే ఇదొక పెద్ద ఉపయోగం మనకి. పిల్లలకి మంచి సాంగత్యం ఇట్టే లభిస్తుంది', అనుకుంది జలజ.      రాత్రి వంటకు ఉపక్రమిస్తుంది గానీ, మనసు మాత్రం పదేపదే శిరీష వైపుకే మల్లుతుంది. ఆ పాప ముక్కు ముఖం కూడా తను ఎరుగదు అయినప్పటికీ మనసు ఏదో బాధగా మూలుగుతుంది. "పాపం, చంటిది ఏమి అవస్థలు పడుతుందో ఆ వెధవతో","భగవంతుడా ఆ చంటి దానికి ఆ వెధవ భారీ నుంచి ఎలాగైనా కాపాడు తండ్రి "అని మనసారా దేవుడిని వేడుకుంది. ఎందుకంటే తనకి కూడా ఆ భగవంతుడే కాపాడేడు కదా అనే గట్టి నమ్మకం జలజకి. తను 13 ఏళ్ల తన కూతురి పట్ల జాగ్రత్తగా ఉంటూ , అవసరమైన అన్ని విషయాల పాపతో చర్చిస్తుంది అంటే దానికి కారణం గతంలో తనకు జరిగిన సంఘటనలే.జలజ మనసు నెమ్మదిగా గత స్మృతులలోకి జారుకుంది. తను 9వ తరగతి చదివే రోజులు.

                                                                 *********************

జలజ , ఉష, నీత,ముగ్గురు మంచి స్నేహితురాళ్ళు.

ముగ్గురు కలిసి బడికి వెళ్లి వచ్చేవారు. ఓ రోజు""ఏయి, జలజ,ఈ మధ్య మన కాలనీ లో కొత్తగా ఓ అబ్బాయి కనిపిస్తున్నాడు చూసావా? అని అడిగింది ఉష."అవును చూసాను, ప్రతిరోజు ఉదయం మా ఇంటి ముందు నుంచే వెళుతూ ఉంటాడు"అన్నది జలజ."అబ్బో అమ్మగారు అప్పుడే గమనించారన్న మాట" అన్నది,ఉష ఈసడింపుగా. "అవును నేను కూడా చూశాను భలే ఉన్నాడే మహేష్ బాబు లా, "అంది నిర్మల.    "నీ మొహం మహేష్ బాబు లా ఏంటే,మహేష్ బాబులా, మహేష్ బాబు కంటే చాలా అందంగా ఉంటాడు," అంది జలజ కాస్త మురిపెంగా."అవునా? అంతలా గమనించావా? అయినా మీరు ఉన్న ఏరియాలోనే కనిపిస్తున్నాడు ఎక్కువగా. మీ ఇంటి దగ్గరనే ఎక్కడో ఉంటున్నాడేమో,"అంది ఉష ప్రశ్నార్ధకంగా."అబ్బా ఎంత బాగున్నాడో నిజంగా తనకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా,"అన్నది నిర్మల కాస్త అసూయ భావముతో.

     జలజా , ఉష, నిర్మల, ముగ్గురు అప్పుడప్పుడే కైశోర్యం లోకి అడుగీడుతున్న 14 ఏళ్ల కిషోర్ బాలికలు. ఆ ఒక్క రోజే కాదు, ఆ తర్వాత కూడా ఇంచుమించు వారం రోజుల వరకు వాళ్ల మధ్య ఇదే సంభాషణ.వయసు అలాంటిది మరీ. ఆ వయసులో సినిమాలన్న , సినిమా హీరోలన్నా, సినిమా హీరోలను పోలిన కుర్రాలన్నా, పిల్లలు ఇట్టె ఆకర్షితులవుతారు. ఈ ముగ్గురు బాలికలు కూడా దానికి అతీతులు కారు. అందమైన అబ్బాయి తరచూ ఎదురుపడేసరికి గమనించడం సహజం.     ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం జలజ బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ అబ్బాయి నాన్నగారితో మాట్లాడుతూ కనిపించాడు. జలజ ఆనందానికి అవధులు లేవు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు సంబర పడిపోయింది. జలజ రాకను గమనించి తనకోసమే ఎదురుచూస్తున్నట్టు ఓ ముగ్ధ మనోహరమైన చిరునవ్వుతో, చంచలమైన కళ్ళతో మౌనంగానే పలకరించాడు ఆ అబ్బాయి. జలజ ఆపాదమస్తకము పులకరించి పోయింది. ఆ      అబ్బాయి కాసేపు జలజ తండ్రి తో మాట్లాడి వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ జలజ వైపు అదోరకముగా చూస్తూ వెళ్లాడు.తను చూసే చూపులలో ఏదో సందేశం ఉంది అన్నట్టు ఊహించుకుని తెగ పులకరించి పోయింది ఆ లేత వయసు గల జలజ.  "ఎంత సౌమ్యంగా ఉన్నాడు కదూ అబ్బాయి, పేరు ప్రణవ్ అట. చిట్ఫండ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడట. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడట. తన కంపెనీ ప్రోమోలో భాగంగా ఇంటింటికి వెళ్ళాలి కనుక మొట్టమొదటిసారి మన ఇంటికే వచ్చాడట", అని నాన్నగారు అమ్మతో చెబుతుంటే, ఒక్కొక్క మాట తన చెవిలో అమృతం కురిపించేలా అనిపించింది జలజకి. ఎందుకో తెలియని సంతోషంతో మనసు నిండిపోతుంది. కాలనీలో "ఇంత మంది ఉండగా ప్రణవ్ ముందు తన ఇంటికే రావడం ఏంటి". అంటు మనసు గుసగుసలాడుతోంది.ఏదో తెలియని ఊహలు పురివిప్పుతున్నాయి జలజ మదిలో.      మరునాడు డాబాపై కూర్చుని చదువుకుంటుంది. చేతిలో పుస్తకం అయితే ఉంది కానీ మనసు మాత్రం పరిపరి విధాలుగా పరిగెడుతుంది. ఇదివరకు అయితే చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు జలజకి. అందరూ తనకి పుస్తకాల పురుగు అని పిలిచే వారు.కానీ ఇప్పుడేంటి ఇలా జరుగుతోంది? గత వారం రోజులుగా చదువు మీద మనసు లగ్నం కావడం లేదు. ప్రణవ్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇదే వరుస. ఓ రోజు జలజ బడికి వెళుతుంది. వీధి చివర బైక్ మీద ఎదురుచూస్తూ ఉన్నాడు ప్రణవ్.      "అటువైపే వెళుతున్నాను, బడి దగ్గర డ్రాప్ చేస్తాను రా" అన్నాడు. జలజ మోము 16 కలలతో వెలిగిపోయింది. మనసు ఆనందంతో తబ్బి ఉబ్బి అయిపోయింది. కానీ పిలవగానే వెళితే అలుసైపోతానేమో అని పైకి మాత్రం"వద్దండి నేను నడుచుకుని వెళ్ళిపోతాను"అన్నది.మొదటి రోజు ప్రణవ్ కూడా మారు అడగలేదు. అదొక రకమైన ట్రిక్ ఏమో, ఆడపిల్లల్ని ఆకట్టుకోవడానికి. మరో రెండు రోజులు ప్రణవ్ కనిపించపోయేసరికి జలజ మనసు విలవిలలాడిపోయింది. మూడవరోజు మళ్లీ ప్రణవ్ అలాగే బైకుతో ఎదురుపడి రమ్మనగానే, ఎక్కువ బెట్టు చేయకుండా బండి ఎక్కేసింది. అలా అలా ఇద్దరు స్నేహము కాస్త పాకంలో పడుతుంది. జలజ, ఉష మరియు నీతాన్ని కూడా దూరం పెట్టడం మొదలుపెట్టింది. చదువు పట్ల శ్రద్ధ తగ్గింది, ప్రణవ్ పట్ల ఆకర్షణ పెరిగింది. ఆకర్షణని ప్రేమ అనుకుని తెగ ఫీల్ అయిపోతుంది తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న ఆ లేత కుసుమం.ప్రణవ్ తన మకాం జలజ వాళ్ల ఇంటికిి ఎదురుగా ఉండే బిల్డింగ్ యొక్క పెంట హౌస్ కి మార్చాడు.జలజకి పొద్దు పొడవదు రాత్రి గడవదు. అనుక్షణం ప్రణవ్ ధ్యాసే, మాటిమాటికి డాబాపైకి వెళ్లి కూర్చుంటుంది. అక్కడి నుంచైతే పెంట హౌస్ క్లియర్ గా కనిపిస్తుంది అని. అమ్మకి అనుమానం రాకుండా చేతిలో ఓ పుస్తకం పట్టుకొని మరీ కూర్చుంటుంది జలజ.      జలజ కి తెలుసు కాలనీలో తన ఈడు అమ్మాయిలు చాలామంది ప్రణవ్ నీ ఇష్టపడుతున్నారు అని. ఒక్కసారి ప్రణవ్ తో మాట్లాడడానికి తహతహలాడుతున్నారని కానీ ప్రణవ్ మాత్రం తనతో మాత్రమే స్నేహం చేస్తున్నాడు ఇది నిజంగా గర్వపడే విషయం అనుకుంది జలజ. భగవంతుడిచ్చే అందమే దీనికి కారణం అని తెగ మురిసిపోతుంది జలజ.      చిన్న చిన్న సహాయ పనులు చేస్తున్న వంకతో ప్రణవ్ జలజా వాళ్ళ నాన్నగారితో సన్నిహితం పెంచుకుంటున్నాడు. జలజకి మహదానందంగా ఉంది. తన ప్రేమకు ఇంకా తిరుగులేదు, నాన్నగారికి కూడా ప్రణవ్ అంటే ఇష్టం, ఇక ప్రణవ్ తన వాడే తీర్మానం చేసుకుంది చిన్నారి జలజ.అప్పుడే ప్రణవతో తనకు పెళ్లి అయినట్టు, తన స్నేహితురాళ్ళందరూ ఈర్ష్యతో కుళ్లుకున్నట్టు ఊహించేసుకుని అయ్యో పాపం స్నేహితురాలు అని జాలి కూడా పడిపోతుంది.      ఇది ఇలా ఉండగా, ప్రభుత్వము , పాఠశాలలో కౌమార్య విద్య అనే అంశాన్ని ప్రవేశ పెట్టింది. వాళ్ల పాఠశాలలో కూడా కౌమార విద్య పై ప్రత్యేకమైన తరగతులు నిర్వహించారు. దానికోసం పాఠశాలకి ప్రత్యేకంగా ఒక కొత్త టీచర్ కూడా వచ్చారు.     "ఛీ,ఛీ,ఇదేం పాడు, కౌమార దశ గురించి క్లాసులు చెప్పడం ఏంటి,"అని అందరూ ఈసడించుకున్నారు. అయినా క్లాసులకు వెళ్లక తప్పలేదు. మొదటి రోజు ఆడపిల్లలలో వచ్చిన శారీరిక మార్పులు గురించి చెప్పారు టీచర్. టీచర్ చెప్పె విధానం తెగ నచ్చేసింది అమ్మాయిలకు. రెండవ రోజు మానసిక ఎదుగుదల గురించి చాలా చక్కగా వివరించారు. ఆ సమయంలో హార్మోన్ల వల్ల వచ్చిన మానసిక బలహీనతల గురించి కూడా చాలా చక్కగా వివరించారు కొత్త టీచర్.     మూడవ రోజుది అతి ముఖ్యమైన అంశం. ప్రతి ఆడపిల్ల ఆ సమయంలో తెలుసుకోవలసిన విషయాలు చెప్పారు. అదే కౌమార దశలో వచ్చే సహజమైన ఆకర్షణ గురించి. ఆ వయసులో పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు తొందరగా ఆకర్షణలో పడతారు అని, తనకు తామే ఓ హీరోయిన్లలా ఊహించుకుంటారని. అని చెబుతూ ఆడపిల్లల యొక్క ఆ బలహీనతను గుర్తించి కొంతమంది మగవాళ్లు ఆ బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంటారు. మాటల గారడీతో వాళ్లని ఇట్టే ఆకట్టుకుంటారు. అలా వాళ్ళు అనుకున్నది సాధించాక ఆ ఆడపిల్లలని నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది తిరగబడితే చంపేస్తారు కూడా. మరి కొంతమంది యాసిడ్ల దాడి కూడా చేస్తుంటారు. లేదా రెడ్ లైట్ ఏరియాలలో అమ్మేసి వ్యభిచారం చేయిస్తారు అని టీచర్ ఎన్నో ఉదాహరణలతో, ఎన్నో సంఘటనలను వివరంగా చెబుతూ పిల్లలకు అన్నీ తెలిసేలా చేస్తున్నారు.     టీచర్ చెప్పే మాటలు విని జలజా మరియు వాళ్ళ స్నేహితురాలు కంగుతిన్నారు. టీచర్ చెప్పిన ఉదాహరణలో అబ్బాయిల వివరాలు చాలావరకు ప్రణవతో పోలినట్టు అనిపించింది వాళ్లకి. అదే వాళ్లు ఆరోజు చర్చించుకున్నారు కూడా.జరిగిన సంఘటనలన్నీ ఓసారి నెమరు వేసుకుంటుంటే తను కూడా ఎక్కడో పప్పులో కాలు వేస్తుంది అనిపించింది జలజకు. ప్రణవ్ తన ఊరికి పూర్తిగా కొత్తవాడు. కనీసం వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరు కూడా దగ్గరలో లేరు. అంతలా పని కట్టుకొని తన ఇంటికే ఎందుకు పదేపదే వచ్చేవాడు. ఆరోజు తనకు లిఫ్ట్ ఇవ్వటానికి పని కట్టుకొని కాపు కాసాడా, లేదా యాదృచ్ఛికంగా తారాసపడ్డాడా? అతనికి తన ఇంటి ముందు పెంట్ హౌసే ఎందుకు అద్దెకి లభించింది. ఇలా పరిపరి విధాలుగా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి మెదడులో. ఏమైనా ప్రమాదంలో చిక్కుకోబోతుందా? టీచర్ చెప్పినట్టు తనది ఆకర్షణే నా? టీచర్ చెప్పింది నిజమేమో, లేకపోతే తొమ్మిదవ తరగతి చదువుతున్న తనకు ప్రేమ దోమ ఏంటి అని జలజ మెదడు హెచ్చరిస్తుంది, కానీ ప్రణవ్ ఆకర్షణలో పీకల లోతు మునిగిపోయిన మనసు మాత్రం ఇంకా ప్రణవనే కోరుకుంటుంది.ఎంత వద్దనుకున్ని డాబా పైకి వెళ్లకుండా ఉండలేక పోతుంది. అయితే చాలావరకు టీచర్ మాటలను నెమరు వేసుకుంటూ ప్రణవ నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నం అయితే చేస్తుంది.      జలజలో వచ్చిన మార్పుని గమనించి ప్రణవ్ తన ప్రయత్నాలని మమ్మరం చేశాడు. పదే పదే ఇంటికి వచ్చి తనకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశాడు.అభం శుభం తెలియని జలజ మనసు ఓ వైపు, మెదడు మరోవైపు లాగుతున్నాయి. చిత్రమైన సంఘర్షణకు గురి అవుతుంది జలజ. ఒకవైపు ప్రణవ్ పట్ల ఆకర్షణ విడనాడ లేక పోతుంది, మరోవైపు టీచర్ మరియు స్నేహితురాళ్ళు హెచ్చరించిన హెచ్చరికలను కూడా పెడచెవిన పెట్టలేక పోతుంది, అలా మదన పడుతూ ఏ అర్థరాత్రి కో కునుకు పట్టింది.     తెల్లవారి నిద్రలేచేసరికి వీధిలో ఏదో హడావిడి. అమ్మ," అమ్మో అమ్మో ఎంత గుండెలు తీసిన బంటు". ఊరిలో ఎన్ని ఇల్లులు ఉండగా మా ఇల్లే దొరికిందా వెధవకి, అని ఎవరినో ఆడిపోసుకుంటుంది. "ఏమైందమ్మా ఎవరిని తిడుతున్నావు "అంటూ వచ్చింది జల అమ్మ దగ్గరికి."ఇంకెవరినే, ఆ ప్రణవ్ గాడిని, వీధిలో చూ ఎంత దారుణంగా ఉందో" అంది అమ్మ. "వీధిలో గొడవకి ప్రణవ్ కి ఏం సంబంధం అబ్బా," అనుకుంటూ బయటికి వెళ్ళబయింది జలజ.అంతలోనే జలజ నాన్నగారు కంగారుపడుతూ ఇంటిలోకి వచ్చి ఏది ?మన జలజ ఏది? బాబోయ్ ఎంత ప్రమాదం నుంచి తప్పించుకున్నాము మనము,, అంటున్నారు నాన్నగారు.జలజని చూసి కోడి తన పిల్లలని, పక్షి తన కూనలని రెక్కల కింద దాచుకున్నట్టు నాన్నగారు జలజను గుండెలకు హత్తుకున్నారు." ఏంటి నాన్న ఎందుకలా భయపడుతున్నారు? అని డిగింది నా నాన్నగారి చెయ్య పట్టుకుని.      "ఈ ప్రణవ్ ఉన్నాడే వాడి అసలు పేరు బసంత్ అట. అమ్మాయిలను ట్రాప్ చేసి రెడ్ లైట్ ఏరియాలకు మరియు దుబాయ్ దేశాలకు అమ్మే ఒక సంస్థకి నాయకుడు అట అతడు.కొత్త కొత్త ఊర్లలో వేరు వేరు పేర్లతో,; ఆకర్షనీయమైన ఉద్యోగాల పేరుతో మకాం వేసి, అక్కడ అమాయకంగా ఉండే అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేసి ,ప్రేమ పేరుతో ,చిన్నచిన్న అమ్మాయిలను వలలో వేసుకుని ,ఇంటి నుంచి పారిపోయేలా చేసి తీసుకువెళ్లి బొంబాయి కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో అమ్మేయడమే వాడి వృత్తి, అట.వాడి వలలో చిక్కుకొని మోసపోయిన ఎవరో ఒక అమ్మాయి ఎలాగో తప్పించుకుని బయటపడిందట. ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించి వీడి గురించి సరైన సమాచారం అందించడమే ఇప్పుడు వీడు దొరికాడు. గత మూడు నెలలుగా పోలీసులు వీడి కోసం వెతుకుతూనే ఉన్నారట."ఎన్ని మాయ మాటలు చెప్పాడు, అరచేతిలో వైకుంఠం చూపించాడు. చిట్ఫండ్ పేరుతో ఏదో లాభాలు చూపిస్తానని పదేపదే ఇంటికి వచ్చేవాడు.అమ్మో! వాడు పోలీసులకు చిక్కకుండా ఉంటే, ఏం జరిగి ఉండేదో ఊహించి అమ్మా నాన్న ఇద్దరూ వణికిపోతున్నారు. ఎందుకంటే క్లియర్ గా తెలుస్తుంది వాడి టార్గెట్ జలజ అని.జలజ డాబా పైకి పరుగుతీసింది, పెంట హౌస్ నిండా చుట్టుపక్కల జనాలు నిండి ఉన్నారు, పోలీసులు ప్రణవ్ కీ చేతులు వెనక్కి విరిచి పెట్టి కట్టేసి, కర్రతో కొడుతున్నారు. జలజ గుండె గుభేలు మన్నది.     "అమ్మ బాబోయ్ తనే గనక తొందరపడి ఉంటే జీవితము కుక్కలు చింపిన విస్తిరిగా మారిపోయి ఉండేది". సమయానికి బడిలో కౌమార విద్య తరగతులు జరిగాయి కాబట్టి ,కాస్త తనకు తానే ప్రశ్న వేసుకునే అవకాశం లభించింది. లేకపోతే ప్రణవ్ ఆకర్షణలలో మునిగి తేలుతూ, అదే ప్రేమ అనుకుని, ఇప్పటికే ప్రణవ్ చెప్పినట్టు తను విని ఉంటే తప్పు కాస్త జరిగిపోయి ఉండేదేమో," ఇకనైనా అనాముకులకు నమ్మకూడదు, వాళ్లని ఇంటిలోకి గాని మనసులోకి గాని చెరనివ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది జలజ. బుద్ధిగా చదువుకొని బ్యాంకు ఉద్యోగిని అయ్యింది, ఇది జరిగి 20 ఏళ్లు దాటేసింది. అయిన సమస్య మాత్రం అక్కడే ఉందన్నమాట, పిల్లలు ఇంకా ట్రాప్ అవుతూనే ఉన్నారన్నమాట. ఏం చేస్తే ఆగుతాయి ఆడ పిల్లల పై ఈ దారుణాలు, అనుకుంటూ దీర్ఘాలోచనలో పడింది జలజ. "అమ్మ, అమ్మ ,పిలుస్తుంటే వినవేంటి అని పాప వనిత కేక్ వేసె సరికి ఈ లోకంలో పడింది జలజ. తొందర తొందరగా ఏదో వంట అయిందనిపించేసి, టీవీలో న్యూస్ ఛానల్ పెట్టి చూస్తు కూర్చుంది, శిరీష కాపాడబడిందన్న వార్త వస్తుందేమోనన్న ఆశతో.       స్వస్తి .       పోలవరపు పుష్పావతి,      సోంపేట,      శ్రీకాకుళం.


Rate this content
Log in

Similar telugu story from Romance