STORYMIRROR

Dinakar Reddy

Comedy Drama

3  

Dinakar Reddy

Comedy Drama

జేమ్స్ పాండ్

జేమ్స్ పాండ్

1 min
190

గణపతీ! నేను జ్వాలను ఇంటరాగేట్ చేయాలి. వెంటనే వెళ్ళి తీసుకురా అని అన్నాడు జేమ్స్ పాండ్. 

యస్ గురూజీ అని జ్వాలను తీసుకు రావడానికి బయటికి వెళ్ళాడు. 


ఇంతలో జేమ్స్ పాండ్ తన జేబులో చెయ్యి పెట్టుకుని మరో చేత్తో గోడ మీద గీస్తూ సీ మిస్ జ్వాలా అంటూ జ్వాల వచ్చాక ఏం మాట్లాడాలో ప్రాక్టీసు చేస్తున్నాడు.


జ్వాలా. ఒక వేళ నువ్వు ఫోన్లు శుభ్రం చేసే ఉద్యోగం మానేయాలి అనుకుంటే నా దగ్గర ఒక పోస్టు ఖాళీగా ఉంది అన్నాడు. 


మళ్లీ అతనే మరో వైపు తిరిగి ఏం ఉద్యోగం అండీ అంటూ జ్వాలలా ఆడ గొంతులో మాట్లాడాడు.


అదేనండీ. మీకేం అభ్యంతరం లేకపోతే నా ప్రియురాలి ఉద్యోగం మీకు ఇద్దామనుకుంటున్నాను అంటూ వెనక్కి తిరిగాడు.


వెనక్కి తిరిగి చూస్తే అక్కడ జ్వాల తల దించుకుని నిలబడి ఉంది. గణపతి ఇంకా సౌమిత్రి పళ్ళికిలిస్తూ నవ్వుతున్నారు.


జేమ్స్ పాండ్ హీ హి అని నవ్వుతూ అంతా ఉత్తిదే అంటూ జేబులోంచి చెయ్యి బయటికి తీశాడు. చెయ్యితో పాటు జేబు కూడా చిరిగి బయటకు వచ్చింది. గణపతీ ఒక్కసారి ఈ గదిలోకి రా అంటూ పిలిచాడు.


గణపతి బాబోయ్ అంటూ బయటకు పరుగెత్తాడు. సౌమిత్రి ఇంకా జ్వాల నవ్వుకున్నారు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Comedy