STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Comedy

4  

Venkata Rama Seshu Nandagiri

Comedy

ఇంటి వైద్యం

ఇంటి వైద్యం

1 min
656

ఈసంఘటన దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగినది.


మాతాతగారు భద్రాచలంలో హెడ్మాస్టర్ గా పనిచేస్తూ ఆయుర్వేదం మందులు కూడా అందరికీ ఇచ్చేవారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఆయనకు మంచి పేరుండేదిట. ఆసమయంలోనే మాబామ్మగారికి తరచుగా కడుపునొప్పి వచ్చేది. తాతగారు ఎన్నిమందులిచ్చినా ఆవిడకు తగ్గేది కాదు.


ఒకసారి అనుకోకుండా ఆఊరికి మద్రాస్ నుండి ఒక లేడీడాక్టర్ వచ్చారు. తాతగారు ఆవిడని కలిసి బామ్మగారి కడుపునొప్పి విషయం చెప్పి తను వాడిన మందుల వివరం కూడా చెప్పారట.


ఆవిడ కొంచెమాలోచించి సీసాలో మందువేసి "ఇది వాడమనండి మాస్టర్ గారూ, తగ్గిపోతుంది." అని చెప్పారట. ఆవెంటనే ఆవిడ తిరిగి వెళ్ళిపోయారు కూడా.


తాతగారు బామ్మగారిచేత ఆమందు తాగించారు. తొందరగానే ఆమందు పనిచేసి బామ్మగారికి కడుపునొప్పి తగ్గింది.


ఆయన ఎంతో ఆనందంగా డాక్టర్ గారికి ఉత్తరంలో ఆవిషయం తెలియచేస్తూ ధన్యవాదాలు చెప్పారు.


ఆవిడ తిరిగు ఉత్తరంలో "నేను మీకన్నా గొప్ప మందులేవీ వాడలేదండీ. మీరువాడిన మందే అదికూడా. కాకపోతే ఆవిడకు మీమీద నమ్మకం లేక మందు పనిచేయలేదు." అని తిరిగి ఉత్తరం రాశారట.


అది చదివిన తాతగారు 'ఇంటిచెట్టు మందుకు పనికిరాదంటే ఇదేమరి.' అనుకొని నవ్వుకున్నారట.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Comedy