ఇక్కడే కానీ ఎక్కడో
ఇక్కడే కానీ ఎక్కడో


టెక్నాలజీ.అంటే ఏంటో తెలీకుండానే స్మార్ట్ ఫోన్లు చుట్టేశాయి.అరచేతిలోనే ప్రేమలు.బ్యాంకు లావాదేవీలు.జీవితపు ముఖ్య నిర్ణయాలు.జాబులు.జవాబులు.ఉద్యోగాలు.ఉపదేశాలు.డిజిటల్ మాయలు.ఎక్కడో ఎవరో తుమ్ముతున్నారు మన ముక్కు ఊడిపోతోంది.
కృత్రిమ శ్వాసల్ని ఇవ్వగలిగింది ఇదే టెక్నాలజీ.ఎన్నో సమస్యల పరిష్కారాలకు దారి చూపుతోంది.
మనిషి మేధస్సుకు మానస పుత్రికలుగా ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి.
కానీ ఇంటర్నెట్ లేకపోతే ఊపిరి ఆగిపోయే పరిస్థితి. టెక్నాలజీ ఎన్నింటినో ఎందరినో మనకు దగ్గర చేసిందా.
కానీ ఎంతో కొంత మనల్ని మనకు దూరం చేసిందనుకోవాలో అన్నది అందరినీ వెంటాడే ప్రశ్న.కాలమే సమాధానం చెప్పాలి.