Varun Ravalakollu

Thriller

4.9  

Varun Ravalakollu

Thriller

ఎవరు - 6

ఎవరు - 6

3 mins
507


6. ఆమె.. నేనుఏది ఏమైనా ఈ ఉదయం చాలా బాగుంది, నేను తాగుతున్న కాఫీలా. అలా అలా తాకి వెళ్లే చల్ల గాలి, చూడగానే మనసుకి హాయి కలిగించే పచ్చని కొండలు, వాటి అందాన్ని దాచే పొగమంచు. వింతగా అనిపించింది. ఎప్పుడూ ఉండే కొండలే, రోజు చూసే పొగమంచే, అలవాటైన కాఫీయే కానీ కొత్త అనుభూతి.

“ఏంటి, కళ్ళు తిరిగి పడిపోయినప్పటి నుండి వ్యాయామం మానేసినట్టు ఉన్నావు.” వెనకనుండి అలీ.

“అలాంటి ప్రత్యేకమైన రోజులు మళ్ళీ మళ్ళీ రావు”

“అర్థం కాలేదు” అలీ

“మీకు వ్యాయామం చేయాలని ఉందా?” అని మాట దాటేశాను.

అలీ “పరుగెత్తటాలు నా వల్ల కాదు కానీ, వాతావరణం బాగుంది కదా అలా నడుచుకుంటూ వెళదాం.”

నడక ఆరంభించాము.

అలీ “భాయ్, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను.”

“నీకు నచ్చినన్ని రోజులు ఉండు, నువ్వు అతిథిలాగా మొహమాటపడద్దు.”

అలీ “అతిథి కాను అంటున్నావు, కాసులు అడుగుతావా?”

“ఖనిజాలు ఇస్తావా? నువ్వు ఉండే ప్రతి రోజు లెక్కేసుకుని మరి మహేష్ గారు నా జీతంలో డబ్బులు తీసుకుంటున్నారు. అయన డబ్బులు ఇస్తే నీకు కూడా ఈ ఇబ్బంది ఉండదు, నువ్వు కూడా స్వతంత్రంగా ఉండవచ్చు.”

“చమత్కారం కూడానా!”

“దీనికి కాసులు అడగనులే!”

“మిమల్ని ఇంతక ముందు చూడలేదు, ఊరికి కొత్తా?” మా ఎదురుగా వస్తున్న అతను పలకరించాడు. చూడటానికి మాములుగా ఉన్నా చూసే చూపు మాత్రం మేధావిలా ఉంది. గిరజాల జుట్టు, పెద్ద నుదురు, ఆజానుబాహుడి కాయం.

“అవునండి, నా పేరు నరేంద్ర, ఇతని పేరు అలీ. మహేష్ గారి దగ్గర నిర్వాహకుడుగా పనిచేస్తున్నాను.”

“మీరు ఏ పని చేస్తున్నారు అని నేను అడగలేదు. భూపతి గారి పేరు చెబితే మర్యాద వస్తదా?” ఆ మాట కాస్త నిట్టురుస్తూ అన్నాడు.

“అలా కాదు. పరిచయం చేసుకుంటున్నాము అంతే, మీ పేరు చెబుతారు కదా అని”

“నా పేరు కృష్ణ ప్రసాద్, కృప అని పిలుస్తారు, మీ మహేష్ భూపతి కూడా”

“ఏంటి! కురూపి నా?” అలీ.

“కురూపి కాదు, కృప. ఇక్కడ టీ మొక్కల మీద పరిశోధన చేయటం నా వృత్తి”

“మీరు ఏమి చేస్తున్నారు అని మేము అడగలేదే!”

ఆయన కళ్ళలో కోపం. “సరే జాగ్రత్తగా వెళ్ళండి, ఊరు అంత మంచిది కాదు, ఈ మంచు పొగలాగా! ఎదుట వచ్చే ప్రమాదం దాచి అవకాశం కోసం అందాన్ని చూపిస్తుంది.”

అలీ “ముబారక్.”

***

ఎప్పుడూ పడే వర్షం ధాటికి భవంతి లోపలికి వచ్చే మార్గం పడిపోయింది, పనివారి చేత బాగు చేయిస్తున్న నాకు వెనక నుండి “నరేంద్ర గారు.”

వెనక్కి తిరిగి చూసాను. లక్ష్మి!

“ఇలా వచ్చారు?”

లక్ష్మి “పని చేయకుండా జీతం ఇవ్వరు కదా!”

“మీకు ఇక్కడ ఏమి పని?”

లక్ష్మి “ఇక్కడ అంటే ఇక్కడ కాదు, భవంతి పనులు నన్ను చూసుకోమన్నారు, మీరు కూడా పని గురించి చెబుతాను అన్నారు. అందుకే ఇలా వచ్చాను.”

ఛ..కాస్తయినా అలోచించి మాట్లాడచ్చు కదా! మట్టి బుర్ర అనుకుని ఉంటుంది...

“నేను చెప్పేది ఏముంది, మహేష్ గారు చెప్పే ఉంటారు కదా. భవంతి గురించి నేను చేసే పనుల్లో ఇదే అఖరిది. ఇవిగో తాళాలు. ఇంక ఈ బాధ్యత మీదే!”

లక్ష్మి తాళం తీసుకుంటూ “తాళం ఇచ్చారు, కానీ ఏది దేనిదో చెప్పలేదు.”

“పదండి చూపిస్తాను.”

“బాబు, సాయంత్రం లోపల అయిపోవాలి. రేపటికి పని ఉంచినా ఒక రోజు కూలి మాత్రమే ఇస్తాను.“ అక్కడ పనివారికి పని అప్పగించి నేను, లక్ష్మి లోపలికి నడిచాము.

లక్ష్మి “కొత్తగా కనిపిస్తున్నారు?”

“బాగుంది అనా, బాలేదు అనా?”

లక్ష్మి నవ్వుతూ “బాగుంది అనే అన్నానండి.”

“ఎవరో తెలియక ముందు పిలుపే బాగుంది.”

“దేని గురించి, మర్యాద గురించా? అప్పుడు మీరొక పోకిరి, ఇప్పుడు మా అధికారి”

“అయితే నన్ను ఆ పోకిరి అనే అనుకోండి.”

లక్ష్మి “ఆ పోకిరిని కొట్టాలి అనుకున్నా, మిమల్ని కొట్టమంటారా!”

“మీరు ఇప్పుడు కొట్టకపోయినా, ఆ పిలుపు కొట్టినట్టే ఉంది.”

లక్ష్మి “చనువు మంచిది కాదు. పని కోసం ఇంత దూరం వచ్చాను, పుట్టినింట పరువు పదిలంగా ఉంచాలి కదా”

“అంత దూరం ఎందుకు, అండి అని తగిలించండి, కర్ర వాత కాదు కదా, నోటి కూత కాబట్టి సరి సరి.“ అని ఒక నవ్వు విసిరాను.

“మాటలు బాగా మాట్లాడుతున్నారు.”

ఆ మాట అన్న మొదటి వ్యక్తి మీరే. లక్ష్మికి తన పనికి కావాల్సిన వివరాలు చెప్పి, అలా సరదాగా మాట్లాడుతూ ఉండగా మహేష్ గారు చూసారు.

ఆయన చూపు కొంచెం కోపంగా అనిపించింది. ఆయనకు మేము పని చేయట్లేదు అని కోపం వచ్చిందేమో.

***

మర్నాడు దర్శన గారు భవంతికి వచ్చారు. నన్ను చూసి పిలిచి “పనులు ఎలా ఉన్నాయి?”

ఆయన నాతో మొదటిసారి సరిగా మాట్లాడారు. “బానే జరుగుతున్నాయండి.”

“వచ్చే నెల మహేష్ గారి జన్మదినం ఉంది. దానికి కావలసిన పనులు ఇప్పుడే మొదలుపెట్టాలి. పెద్ద పెద్ద వారు వస్తారు. ఏ విషయంలోనూ ఆటుపాట్లు రానివ్వద్దు. కృప అని మహేష్ గారి స్నేహితుడు. ఊరి లోనే ఉన్నాడంట. అతని సలహాలు తీసుకో.”

“కృప నా”

“ఏమి? సలహా తీసుకోవటం ఇబ్బందా?”

“అలా కాదు”

“నువ్వు ఎప్పుడు భూపతి స్థాయి వేడుకులు చూసి గాని, చేసి గాని ఉండవు. అందుకే”

అంతలో లక్ష్మి అక్కడికి వచ్చి “మీరు ఖంగారు పడద్దు. మేము చేసుకుంటాము.”

“నువ్వు చెప్పావు కదా సరే!” అని లక్ష్మి తల మీద నిమిరి ఆయన వెళ్లిపోయారు.

ఆయన వెళ్లిపోగానే లక్ష్మితో “నీకు ఈయన తెలుసా?”

“ఆ, ఇక్కడి వారే కదా. చాలా మంచి వారు.”

***

చాకలి అతను వస్తే బట్టలు వేస్తున్నాము నేను, అలీ.

“అలీ, నువ్వు లక్ష్మిని చూసావా?”

“ఆ పనమ్మాయే కదా, చూసాను. మహేష్ గారి పక్కన తిరుగుతుంది ఈ మధ్య, ఆమే కదా? ఏమి తను నిన్ను ఎమన్నా అంటుందా?”

“లేదు లేదు”

మాట్లాడుతుండగా అలీ జేబులు ఖాళీ చేస్తునప్పుడు, తన జేబులో నుండి ఒక కాగితం కింద పడింది. అది గాలికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగింది.

అది తీసుకుని చూస్తే, ఆ కాగితం వెనకాల అదే అమ్మవారి బొమ్మ. అమ్మవారి కాళ్ళ దగ్గర గద్ద. వెనక్కి తిప్పి చూసాను. నాకు తెలియని బాష. ఆ రోజు బాణానికి వచ్చిన లేఖలో వాడిన భాషలో ఉంది.

“అలీ.. ఈ లేఖ ఏంటి? ఇది నీ దగ్గర ఉందేంటి?”

***


Rate this content
Log in

Similar telugu story from Thriller