ఎంతవరకు అని అడక్కు
ఎంతవరకు అని అడక్కు


15-04-2020
ప్రియమైన డైరీ,
అనుకున్నట్లే లాక్ డౌన్ పొడిగించబడింది.ఇరవై రెండో రోజు ఇది లాక్ డౌన్ లో.
కూరగాయలు,సరుకులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం మొదలు అయ్యింది కొన్ని నగరాల్లో.
మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ అని చెప్పినా మళ్లీ మధ్యలో పరిస్థితిని బట్టి కొంత సడలింపు ఉంటుంది అని అన్నారు ప్రధాన మంత్రి గారు.
కానీ ఒక్కటే డౌటు.వందల్లో ఉన్నప్పుడు లాక్ డౌన్ అని అనుకున్నాం. వేలల్లో ఉన్నప్పుడు అంటే మే 3 తరువాత లాక్ డౌన్ తీస్తే ఎలా అని జనాల సందేహం.
అప్పట్లోగా ఏదైనా అద్భుతం జరగాలి.