murali sudha

Action Inspirational

4  

murali sudha

Action Inspirational

ధీర

ధీర

3 mins
216


*ధీర*


సముద్రుడే మింగేశాడో, పడమటి కొండలే లాక్కెళ్లిపోయాయో సూరీడు కనుమరుగై చాలా సేపే అయినట్టు ఉంది. అక్కడక్కడా మిణుకుమంటున్న తారకల తళుకులు తప్ప వేరే వెలుగేదీ లేదు ఆ సమీపంలో. అసలే శరత్తు, హేమంతల సంధికాలం. కొద్దిగా చలి, కొద్దిగా వేడితో గమ్మత్తుగా ఉంది వాతావరణం. 


అకస్మాత్తుగా వచ్చిన ఫోన్ కాల్ తో తను ఆ టైమ్ లో ఒంటరిగా బయటకు రావాల్సి వచ్చింది.


అతనూ తనకు పనిచోటులో పని అయిపోయిందని అటుగా వచ్చి ఏ ఆటోకోసమో, బస్ కోసమో అన్నట్టు ఎదురుచూస్తున్నాడు, పొద్దుట పొద్దుటే పంక్చర్ అయిన తన ద్విచక్ర వాహనాన్ని తిట్టుకుంటూ.


వస్తూనే తన వంక ఓరగా చూశాడు..


 చూసీ చూడనట్లున్నా మనసులోంచి 

ఏదో అలజడి ఆమె దేహంలోపల మెత్తగా చొరబడింది, దేహం మొత్తం పైకే తెలిసేంతగా కంపిస్తూ ఉంది.


ఆమె గమనింపును అతడు మిస్ అవ్వలేదు... 

తనకి కావలసిందదే.. 

తానూహించింది ఎదుట జరగడంతో మరికొంత ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడతను. 

కొంచెం కొంచెంగా రాలుతున్న మంచుకు ఆమె మంచు శిల్పంలా ఉంది... 

తెల్లని చీర బొడ్డుకిందకు కట్టు లూజ్ గా వదిలేసిన హెయిర్ స్టెయిల్.. అతని లోని పురుషుణ్ణి తట్టిలేపుతున్నాయ్.. 

అతడు చూస్తున్నాడా లేదా అని ఆమె మరోసారి చూసింది.. అపరిచితుడితో నీకెందుకని మనసు పోరుపెడుతున్నా.. కళ్ళు హృదయం ఆదేశాలని అందుకున్నాయి. అవి తనకోసమే అన్న భావన అతనిలో అంతకంతకూ పెరుగుతోంది.  


ఆమె రెండో లుక్ ని మిస్ కాని అతని నరనరాల్లో ఏదో జివ్వున పాకుతోంది, అసలే బ్రహ్మచారేమో కొత్త ఆస్వాదనకు దేహం సమాయత్తమౌతోంది.


చిన్నగా కదులుతూ వణుకుతున్న ఆమె పెదాలు, ఎర్ర మందారంపై నీళ్లు చిలకరించినప్పుడు అందంగా ఊగినట్టు తళుక్కున మెరుస్తున్నాయి.


చూపు తిప్పుకుంటే ఎక్కడ ఆ సుతిమెత్తటి కదలికను మిస్ అవుతానో అన్నట్టు అతడి చూపులు ఆ తెరచుకోని మాటల తలుపులపై ఆగిపోయాయి.


అడుగేస్తే కందిపోతానా, వేయకుంటే చిక్కిపోతానా అన్నట్టు ఆమె రెండు పాదాలు తొలకరి జల్లుకు తడిచిన గరికలా అటూ ఇటూ తటపటాయిస్తున్నాయి.


లేలేత పాదాలు ఎటు కదులుతాయో చూసి, అనుసరిద్దాం అన్నట్టు అతగాడి అడుగులు ఎదురుచూపులు చూస్తున్నాయి.


చుక్కల వెలుగులోనూ చక్కగా మెరుస్తూ ఆమె ముఖాన వెలుగుతున్న చెమటచుక్కలు.


రారమ్మన్న ఆహ్వాన పత్రికల్లా అతని కంటికి రాస్తున్న ఉత్తేజ లేఖలు.


అల్లాడుతున్న చీర చెంగును ఎంతలా లాగి చుట్టుకున్నా ఇంకా ఎక్కడో చల్లగా తగిలి గిలిగింతలు పెడుతున్న గాలి.


చిలిపిగాలి పోడు గాలై మొత్తంగా ఆమె కొంగును ఎత్తుకుపోతే తనివితీరా దర్శిద్దామన్న తపనల వేడుకోలును మోస్తున్న వాయుదేవుడు.


పది నిమిషాలు పది యుగాల్లా, ఇద్దరికీ రసపరీక్ష పెడుతూ.....

వయసులో ఉన్న భారం ఆమెది, వయసు రుచి చూద్దామన్న ఆత్రం అతనిది.


'ఏమీ అనుకోనంటే ఇటువైపుగా ఆటోలు రావడం లేదు. నేను గత అరగంట పైనుంచీ ఎదురుచూస్తున్నాను' టపీమని అబద్ధం ఆడేశాడు తానొచ్చిందీ ఆమెకు నిమిషం ముందే అయినా.


వినిపించినా , సమాధానం ఇవ్వలేని , ఇవ్వాలని అనుకోని మౌనం. మాటకలపొద్దన్న మనసు వేడుకోలు


'అలా నడుచుకుంటూ ఆ వీధి చివరకు వెళితే అటుగా వచ్చే వెహికిల్స్ ఏమన్నా దొరకవచ్చు' ఓ ఆశతో కూడిన ఉపదేశం.


మెత్తని మాటల్లో కొద్దిగా బలపడుతున్న నమ్మకం, తడి వేడి తపనల్లో మూగబోయిన గొంతు.


'ఇక్కడ ఇంకో మనిషి అలికిడి లేదు, నేనూ వెళుతున్నాను. మీరు వస్తే సరే, లేకుంటే మీరే ఒంటరిగా మిగిలి ఆపై బాధపడతారు. అసలే రోజులు బాగాలేవు' ఇంకొంచెం ముందుకు జరిగి వెలువడిన హెచ్చరిక.


భయమో,అనుమానమో తెలీక మనసునిండా ముసురుకున్న అలజడి, వచ్చిన ఫోన్ కాల్ ను తిట్టుకుంటూ ఏమీ చేయలేక నిలబడిన అసహాయత.


'సరే అయితే నేను వెళుతున్నాను. బై' వల్లో పడిందో లేదో తెలుసుకునే మిషతో వేసిన అడుగులు.


ఏమనుకుందో ఏమో, అతడిని నమ్మిందో, అపనమ్మకంతోనే కదిలిందో , అవసరం కదిలించిందో అతనికి ఓ పదడుగుల వెనుక ఆమె.


ఇంకా ముందు ముందుకు దాదాపు పావుగంట నడక, అలసిన దేహం, సన్నగిల్లుతున్న నమ్మకం, కోల్పోతున్న ఆత్మవిశ్వాసం 


తనకి కావలసిన అదను... 

తనూహించిందే జరగబోతోంది..

తన కోరిక నెరవేరబోతోంది..

అపరిచితతో... ఆనందకేళి విలాసం


సుతిమెత్తగా పలికిన కళ్ళు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. నాగరిక ఆనవాళ్ల మాటున అనాగరిక రూపం విచ్చుకుంది... మనిషి మృగ రూపాన్ని సంతరించుకున్నాడు, కోరలు తెంచుకున్న కోరికలు, పథకం పారినందుకు చేస్తున్న వికటాట్టహాసం 


అకస్మాత్తుగా మారిన మనిషి అసలు రూపులు అర్ధమౌతున్నాయ్.. పులినోట చిక్కబోతున్న వాసన భయం కలిగిస్తోంది


లోపల ఆలోచనలన్నీ ఒక్కసారిగా రేడియేషన్ కు మాయమైన గువ్వలయ్యయ్


 'అన్నా! మిమ్మల్ని ఎంతో నమ్మి మీ వెనక వచ్చాను, ఇప్పుడిలా'


రెచ్చిపోతున్న చేతులు, ఈడ్చుకు పోబడుతున్న ఆమె శరీరం


'అన్నా! అన్నా! ప్లీస్ , నన్ను వదిలేయండి, నీ చెల్లి లాంటి దాన్ని' రోదిస్తున్న గొంతు


ఆక్రందనలు అతనికి ప్రోత్సాహకాలు అవుతూ పెరుగుతున్న ఉద్రేకం, ఉద్వేగం మీద పడుతున్న చేతుల్ని తోసేస్తూ, తోచినంతగా తిరగబడుతూ తనని తాను దక్కించుకునే యత్నంలో ఆమె.


వీలున్నంతగా శక్తిని ప్రయోగిస్తూ, ఆమెను ఆక్రమిస్తూ, అణువణువూ దోచుకునే దౌర్జన్యంలో అతను


అక్కడో లేడీ, పులి యుద్ధం


అతని గోరుగాట్లు, ఆమె రక్త ధారలు


అతని పంటి గుర్తులు, చినుగుతున్న ఆమె ఆచ్చాదనలు


'ఎందుకిలా నమ్మించి మోసం చేస్తున్నావు, నీకు అక్కా,చెల్లీ, తల్లీ లేరా?' విచ్చుకుంటున్న ఆమె ప్రశ్నల కత్తులు


'ఇదంతా నీ వల్ల కాదు జరిగింది, నాపాటికి నేను బస్సుకోసం నిల్చుని ఉంటే వచ్చావు'


'ఆ....వస్తే'


'వచ్చీ రావడమే నీ మానాన నువ్వు ఉండకుండా, ఒకటే పైట కప్పుకోవడాలు, పెదాలు, ఒళ్ళు వణకడాలు'


'అవి భయంతో జరిగిన చర్యలు, అలా వణికితే , పైట కప్పుకుంటే ఇలా అఘాయిత్యం చేస్తారా?'


'అసలెందుకు ఇలా రాత్రి పూట ఒంటరిగా వచ్చావు?'


'నీలాంటి రాక్షసుడు ఎదురౌతాడని తెలియక'


ఛళ్ మన్న ఆమె చెంప


సహనం కోల్పోయిన ఆమె


'అయినా ఇలా నిన్ను ఎందుకు బతిమాలుతున్నాను నేను'


'అంటే సహకరిస్తావా!?'


ఒక్కసారిగా కూడదీసుకున్న శక్తి, గుర్తుకు తెచ్చుకున్న బలం


'దేవుడా.....'


తగలరాని చోట తగిలిన దెబ్బ


అప్పటికే అసహనంతో తల్లిని ఆసుపత్రిలో చేర్చి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు వర్షంలో అర్ధరాత్రి చిక్కుకున్న తనని తాను రక్షించుకోలేకుంటే బయటకు రావడమెందుకూ.... అంటూ సంధిస్తున్న మనసు ప్రశ్నకు సమాధానంగా జరిగిన చర్యతో నిలదొక్కుకున్న ఆమె

చేతికంటిన మట్టిని దులుపుకుని


ముందుకు అడుగులేస్తూ.. 

అతని వైపు చూపుల కత్తులు విసిరేస్తూ.....

శివంగిలా......


Rate this content
Log in

Similar telugu story from Action